Tea vs Coffee: టీ, కాఫీ.. కెఫీన్, యాంటియాక్సిడెంట్లు దేంట్లో ఎక్కువగా ఉంటాయి?
Tea vs Coffee: టీ, కాఫీ.. దేంట్లో ఎక్కువ కెఫీన్, యాంటియాక్సిడెంట్లు ఉంటాయో ఎక్కుడ తెలుసుకోండి. ఈ విషయాల్లో ఏది అత్యుత్తమైన ఆప్షన్ అంటే..
Tea vs Coffee: చాలా మంది ఉదయాన్నే కచ్చితంగా టీ లేదా కాఫీ తాగుతారు. ఇవి రుచి చూడకుండా కొందరు రోజునే ప్రారంభించరు. అయితే, రోజుకు ఎన్ని కప్పుల టీ లేదా కాఫీ తాగితే ఆరోగ్యానికి సేఫ్ అని చాలా మందిలో ఉండే సాధారణ ప్రశ్న. టీ, కాఫీల్లో ఉండే కెఫీన్ (Caffeine), యాంటియాక్సిడెంట్ల(Antioxidants)ను పరిగణనలోకి తీసుకుంటే ఆరోగ్యానికి టీ, కాఫీలు ఎంత వరకు మంచివో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంపై న్యూట్రిషనిస్ట్ అంజలీ ముఖర్జీ స్పష్టతనిచ్చారు. కెఫీన్, యాంటియాక్సిడెంట్లు.. టీ, కాఫీల్లో ఎలా ఉంటాయో పేర్కొన్నారు. ఆ వివరాలివే.
Tea vs Coffee: “టీ, కాఫీ.. రెండింట్లో కెఫీన్ ఉంటుంది. అయితే చాలా రకాల టీలతో పోలిస్తే కాఫీలో ఎక్కువ కెఫీన్ ఉంటుంది. ఒకవేళ మీకు కెఫీన్ పడకపోతే.. టీ బెటర్ ఆప్షన్‍గా ఉంటుంది” అని అంజలి చెప్పారు. అలాగే, టీ లేదా కాఫీను మోతాదు మేరకే తాగాలని సూచించారు.
Tea vs Coffee: “సగటున కప్పు టీలో 20-60 మిల్లీ గ్రాముల కెఫీన్ ఉంటుంది. తయారు చేసిన విధానాన్ని బట్టి, కప్పు కాఫీలో ఇంత కంటే ఎక్కువ కెఫీన్ ఉంటుంది” అని ఆమె తెలిపారు. కెఫీన్‍ను మోతాదుకు మించి ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు.
Tea vs Coffee: కాఫీ, టీ.. రెండింట్లోనూ శరీరానికి మేలు చేసే యాంటియాక్సిడెంట్లు ఎక్కుగా ఉంటాయి. అయితే, యాంటియాక్సిడెంట్ల కోసమైతే కాఫీ కంటే టీనే అత్యుత్తమమని న్యూట్రిషనిస్ట్ అంజలి పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రీన్, బ్లాక్ టీల్లో ఎక్కువ యాంటియాక్సిడెంట్లు ఉంటాయి.
Tea vs Coffee: గుండె ఆరోగ్యం నుంచి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడం వరకు టీ, కాఫీ.. రెండు కొన్ని ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. అయితే, వాటిని తయారు చేసే, కాచే విధానం, వాడిన పదార్థాలపై ఇది ఆధారపడి ఉంటుందని చెప్పారు.
Tea vs Coffee: టీ, కాఫీ ఎక్కువగా తాగితే వాటికి బానిస అయ్యే అవకాశం ఉంటుందని, అందుకే వాటికి ఎక్కువగా అలవాటు పడకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. మోతాదు ప్రకారమే తాగాలని చెప్పారు.
Tea vs Coffee: “కెఫీన్‍ను తీసుకోవడం తగ్గించాలని మీరు అనుకుంటుంటే మీకు టీ బెటర్ ఆప్షన్‍గా ఉంటుంది. అలాగే ఎక్కువ యాంటియాక్సిడెంట్లు కావాలనుకున్నా, కొన్ని రకాల టీలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి” అని న్యూట్రిషనిస్ట్ అంజలీ ముఖర్జీ చెప్పారు.
సాధారణంగా.. రోజులో టీ లేదా కాఫీ.. రెండు కప్పులు లేకపోతే అంతకంటే తక్కువ తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.