Cornflakes: బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రతిరోజూ కార్న్ ఫ్లేక్స్ తినడం ఆరోగ్యమేనా? పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారు?-is it healthy to eat corn flakes for breakfast every day what do nutritionists say ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cornflakes: బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రతిరోజూ కార్న్ ఫ్లేక్స్ తినడం ఆరోగ్యమేనా? పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారు?

Cornflakes: బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రతిరోజూ కార్న్ ఫ్లేక్స్ తినడం ఆరోగ్యమేనా? పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారు?

Haritha Chappa HT Telugu
Jan 29, 2025 07:00 AM IST

Cornflakes: కార్న్ ఫ్లేక్స్ మనలో చాలా మందికి సులభమైన బ్రేక్ ఫాస్ట్. దీన్ని వండకుండా సింపుల్ గా తినేయచ్చు. కార్న్ ఫ్లేక్స్ లో పాలు వేసుకుని తినేస్తారు. అలా కార్న్ ఫ్లేక్స్ తినడం ఆరోగ్యకరమేనా?

కార్న్ ఫ్లేక్స్ రోజూ తినడం ఆరోగ్యకరమేనా?
కార్న్ ఫ్లేక్స్ రోజూ తినడం ఆరోగ్యకరమేనా? (canva)

బ్రేక్ ఫాస్ట్ లో కార్న్‌ఫ్లేక్స్ తినేవారి సంఖ్య అధికంగానే ఉంది. దీన్ని వండాల్సిన అవసరం లేకపోవడం, కేవలం పాలు వేసుకుని కలిపి తినేస్తే సరిపోతుంది. దీని వల్లే ఎక్కువ ఈ బ్రేక్ ఫాస్ట్ తినేందుకు ఇష్టం చూపిస్తున్నారు. ప్రతిరోజూ వీటినే అల్పాహారంగా తినేవారి సంఖ్య తక్కువేమీ కాదు. వీటిని తినడం ఆరోగ్యకరమేనా?

yearly horoscope entry point

కార్న్ ఫ్లేక్స్ రకాలు

కార్న్ ఫ్లేక్స్‌లో ఎన్న రకాలు ఉన్నాయి. స్ట్రాబెర్రీలు, మిక్స్ డ్ ఫ్రూట్, బాదం, ఆర్గానిక్ తేనె వంటి రకాల్లో ఇవి దొరకుతున్నాయి. వీటిలో కొవ్వు తక్కువగా ఉంటుంది. అందుకే వాటిని ఎక్కువమంది తింటున్నారు. కానీ వాటిలో చక్కెర, ఉప్పు (సోడియం) అధికంగా ఉంటాయని మాత్రం గుర్తించలేరు.

కార్న్ ఫ్లేక్స్ లో పోషకాలు తక్కువగా ఉండి పీచుపదార్థం తక్కువగా ఉంటుంది. ఇది గుండెకు, సాధారణ ఆరోగ్యానికి కూడా హానికరం. బ్రిటీష్ హార్ట్ ఫౌండేషన్ ప్రకారం ఉదయం అల్పాహారం కోసం కార్న్ ఫ్లేక్స్ మాత్రమే తినడం మంచిది కాదు. ఉదయం అల్పాహారం కోసం ఒక గిన్నె నిండా పండ్లు ఉండాలి.

కార్న్ ఫ్లేక్స్ ప్రాసెస్ చేసిన ఆహారం

అమెరికన్ ఇన్ స్టిట్యూట్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ ప్రకారం, అధిక ప్రాసెస్ చేసిన ఆహారాల వినియోగంతో అనేక ఆరోగ్య ప్రమాదాలు ఉన్నాయి. వాటిలో కొన్ని క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. అధిక ప్రాసెస్ చేసిన ఆహారాలలో సాధారణంగా అనారోగ్యకరమైన స్థాయిలో అదనపు కొవ్వు, చక్కెర, సోడియం ఉంటాయి. వీటి వల్ల ఊబకాయం, మధుమేహం, గుండెజబ్బులు, అధిక రక్తపోటు వంటి కొన్ని ఆరోగ్య సమస్యలు. కార్న్ ఫ్లేక్స్ రుచి, రంగు, వాసనను మెరుగుపరచేందుకు కొన్ని రసాయనాలను కలుపుతారు.

కార్న్ ఫ్లేక్స్ లో చక్కెర

హార్వర్డ్ కు చెందిన న్యూట్రిషన్ ప్రొఫెసర్ డాక్టర్ ఫ్రాంక్ ప్రకారం… అధిక రక్తపోటు, మంట, బరువు పెరగడం, మధుమేహం, కొవ్వు కాలేయ వ్యాధి వంటి రోగాలు అధికంగా చక్కెర తీసుకోవడం వల్ల జరుగుతాయి. అవన్నీ గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి. కార్న్ ఫ్లేక్స్ అధిక గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని తినడం అంత ఆరోగ్యకరం కాదు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు పూర్తిగా వీటిని తినకూడదు.

కార్న్ ఫ్లేక్స్ లో అధిక కేలరీలు

ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ బిహేవియరల్ న్యూట్రిషన్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ రిపోర్ట్ ప్రకారం, కార్న్ ఫ్లేక్స్ లో కేలరీలు అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల బరువు త్వరగా పెరుగుతారు.

కార్న్ ఫ్లేక్స్ తినడం వల్ల ఏమాత్రం ఆరోగ్యకరం కాదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీటిని ఎంత తక్కువగా తింటే అంత మంచిది.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Whats_app_banner

సంబంధిత కథనం