Seatbelt and Pregnancy: గర్భం ధరించాక సీట్ బెల్డ్ ధరించడం మంచిదేనా? అలా ధరించడం వల్ల ఏం జరుగుతుంది?
Seatbelt and Pregnancy: కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ ధరించాలనే నిబంధన గర్భిణీ స్త్రీకి కూడా వర్తిస్తుందా? ప్రెగ్నెన్సీ సమయంలో సీట్ బెల్ట్ పెట్టుకోవడం మంచిదేనా? సీట్ బెల్ట్ ధరించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.
మహిళ జీవితంలో గర్భం ధరించిన రోజులు చాలా సున్నితంగా ఉంటాయి. ఆ రోజుల్లో వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ తొమ్మిది నెలల్లో ఆమె తన గురించే కాకుండా తన బిడ్డ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సమయంలో గర్భిణీ స్త్రీ తన రోజువారీ పనులు చేయడంలో చాలా సమస్యలు ఎదుర్కొంటుంది. అలాంటి కష్టమైన పనుల్లో ఒకటి కారు సీట్ బెల్ట్ పెట్టుకోవడం. కొందరు మహిళలు ఆఫీసుకు వెళ్లేందుకు కారును వినియోగిస్తారు. ఆ సమయంలో సీట్ బెల్ట్ ధరించడం వంటివి చేస్తారు. అయితే ఈ నిబంధన గర్భిణులకు కూడా వర్తిస్తుందా? ప్రెగ్నెన్సీ సమయంలో సీట్ బెల్ట్ పెట్టుకోవడం మంచిదేనా? సీట్ బెల్ట్ ధరించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి అంశాలపై ఎంతో మందికి ఎన్నో సందేహాలు ఉన్నాయి.

గర్భిణులు సీటు బెల్టు ధరించాలా?
క్షేమంగా గమ్యాన్ని చేరుకోవడం కోసం కారులో ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరూ సీటు బెల్టులు ధరించడం తప్పనిసరి. గర్భధారణ సమయంలో ఇది మరింత ముఖ్యమైనది. ఎందుకంటే డ్రైవింగ్ చేసేటప్పుడు గర్భిణీ స్త్రీకి సడన్ బ్రేక్ వేసినప్పుడు అకస్మాత్తుగా షాక్ లేదా నొప్పి అనిపించదు.
సీట్ బెల్ట్ కట్టుకునే విధానం
గర్భిణీ స్త్రీలు సీట్ బెల్ట్ ను పొట్టపైన కాకుండా పొట్ట కింద కట్టుకోవాలి. అలాకాకుండా మీరు పొట్ట మీద పెట్టుకోవడం వల్ల మీకు అసౌకర్యంగా ఉండడం లేదా పిండానికి అసౌకర్యంగా అనిపించవచ్చు.
ఈ తప్పులు చేయకండి -
గర్భిణీ స్త్రీలు బిగుతుగా సీట్ బెల్ట్ పెట్టుకోకూడదు. బిగుతైన సీటు బెల్టులు ధరించడం వల్ల కటి ప్రాంతం, దిగువ పొత్తికడుపుపై ఒత్తిడి పడుతుంది. ఈ కారణంగా స్త్రీ కడుపులో తీవ్రమైన నొప్పిని అనుభవించవచ్చు.
- సీట్ బెల్ట్ ను కొద్దిగా వదులుగా ఉంచండి, తద్వారా మీ పొట్ట పై చాలా బిగుతుగా అనిపించదు.
-సీట్ బెల్ట్ వేసుకున్న తర్వాత చాలా మంది మహిళలకు వెన్నునొప్పి మొదలవుతుంది. అటువంటి పరిస్థితిలో, నడుము నొప్పి నివారించడానికి, స్త్రీ బ్యాక్ సపోర్ట్ పెట్టుకోవాలి. అలా చేయడం వల్ల వారికి మద్దతు లభిస్తుంది.
- గర్భం ధరించాక దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి. ఒకవేళ వెళ్లాల్సి వస్తే మధ్యలో విరామం తీసుకుని ప్రయాణం చేయాలి.
-గర్భధారణ సమయంలో భద్రత కోసం, ఎల్లప్పుడూ సీటు బెల్టును పొట్ట కిందకి పిరుదుల చుట్టూ సౌకర్యవంతంగా పెట్టుకోండి.