క్యాన్సర్ పేషెంట్లు ఎక్సర్‌సైజ్ చేయొచ్చా? ఎలాంటి వ్యాయామాలు వీరికి మేలు చేస్తాయి?-is it good to exercise while undergoing cancer treatment how does it help ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  క్యాన్సర్ పేషెంట్లు ఎక్సర్‌సైజ్ చేయొచ్చా? ఎలాంటి వ్యాయామాలు వీరికి మేలు చేస్తాయి?

క్యాన్సర్ పేషెంట్లు ఎక్సర్‌సైజ్ చేయొచ్చా? ఎలాంటి వ్యాయామాలు వీరికి మేలు చేస్తాయి?

Ramya Sri Marka HT Telugu

క్యాన్సర్ రోగులు బలహీనంగా ఉంటారు. ఇటువంటి సమయంలో వ్యాయామం చేస్తే మరింత బలహీనంగా మారతారనే ఆందోళన చాలా మందికి ఉండచ్చు. కానీ ఇది నిజం కాదు. వాస్తవానికి క్యాన్సర్ బాధితులు వ్యాయామం చేయడం వల్ల చాలా రకాలుగా ప్రయోజనాలు పొందచ్చట. కాకోపోతే ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.

క్యాన్సర్ బాధితులు వ్యాయామం చేయచ్చా

క్యాన్సర్ చికిత్స అనేది కేవలం మెడికల్ ట్రీట్మెంట్‌ కోసమేనని పరిగణించొద్దు. ఇది మానసిక, శారీరకంగా ప్రభావం చూపించి భావోద్వేగాలలో మార్పు తీసుకొస్తుంది. ఇటువంటి సమయంలో వ్యాయామం చేయడం అనేది అసాధారణంగా అనిపించినా, చిన్నపాటి ఫిజికల్ యాక్టివిటీ కూడా శక్తిని, ధైర్యాన్ని అందించి బలం నిండేలా చేస్తుంది.

క్యాన్సర్ ట్రీట్మెంట్ టైంలో వ్యాయామం కలిగే లాభాలు..

వ్యాయామం చేయడం వల్ల చిన్నపాటి నెగెటివ్ ఫీలింగ్స్ కలిగినా, శరీరాన్ని మెల్లగా కదిలించడ వల్ల ట్రీట్మెంట్‌లో మెరుగైన ఫలితాలు వస్తాయట. వ్యాయామం వల్ల ఇంకా ఏమేం ఉపయోగాలున్నాయో తెలుసుకుందాం.

బరువు నియంత్రణ

ట్రీట్మెంట్ సమయంలో కొంతమంది బరువు తగ్గుతారు. మరికొంతమంది బరువు పెరుగుతారు. వ్యాయామం చేయడం వల్ల ఈ రెండింటినీ సమతుల్యం చేస్తుంది.

గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యం

గుండె ఆరోగ్యానికి, ఊపిరితిత్తుల ఆరోగ్యానికి వ్యాయామం సహాయపడుతుంది. వ్యాయామం చేయడం వల్ల శరీరానికి ఆక్సిజన్ సరఫరా మెరుగై శ్వాసక్రియ మెరుగవుతుంది.

అలసట తగ్గింపు

క్యాన్సర్ చికిత్సలో వచ్చిన అలసటకు కారణాలు – కీమోథెరపీ, రేడియేషన్, మందుల దుష్ప్రభావాలు. విశ్రాంతి తీసుకోవడం కంటే చిన్నపాటి నడకలే అలసటను తగ్గిస్తాయి. శరీరాన్ని కదిలించడం వల్ల శక్తి మరింత మెరుగవుతుంది.

నిద్రపై ప్రభావం

వ్యాయామం చేసినవారికి ప్రశాంతమైన నిద్ర కలుగుతుంది. ఎక్కువ సమయం పాటు నిద్రలో గడిపేందుకు సహాయపడుతుంది. ఇన్సోమ్నియా వంటి సమస్యలు తగ్గేందుకు ఉపయోగపడుతుంది.

జీర్ణక్రియ మెరుగుదల

పేగు సమస్యలు, మలబద్ధకం వంటి సమస్యలకు తేలికపాటి వ్యాయామం చేయడం చక్కటి పరిష్కారంగా కనిపిస్తాయి.

మానసిక ఆరోగ్యం మెరుగుదల

వ్యాయామం చేయడం వల్ల ఎండార్ఫిన్స్ అనే హార్మోన్ల విడుదలవుతాయి. ఇది మానసిక ఉల్లాసాన్ని పెంచి డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి. పేషెంట్లలో స్వీయ నమ్మకం పెరుగుతుంది.

ఇమ్యూనిటీ బూస్ట్

వ్యాయామం రెగ్యూలర్ చేసే వాళ్లలో వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. శరీరంలోని వ్యర్థ పదార్థాలు తొలగిపోతాయి. అదేవిధంగా క్యాన్సర్ రోగుల్లో కూడా ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనే శక్తి పెంచి, వ్యర్థాలు తొలగిపోయేందుకు ఉపయోగపడుతుంది.

ఎలా ప్రారంభించాలి?

ప్రారంభంలో రోజుకు 10 నుంచి 15 నిమిషాల పాటు నడవాలి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్‌లు, స్ట్రెచింగ్ ద్వారా శరీరాన్ని మెల్లగా అలవాటు చేయాలి. శక్తి లెవెల్స్ పెరిగిన తర్వాత బాడీ వెయిట్ వ్యాయామాలు, యోగా వంటి సాధనలను ప్రారంభించవచ్చు.

వ్యాయామం ఎలాంటి సమయంలో చేయకూడదు:

  1. ప్లేట్లెట్లు లేదా వైట్ బ్లడ్ సెల్స్ తక్కువగా ఉన్నప్పుడు
  2. శస్త్రచికిత్స తర్వాత పూర్తిగా కోలుకోనప్పుడు
  3. తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్యలున్నప్పుడు
  4. చాలా అలసటగా ఉన్నప్పుడు
  5. మానసికంగా విపరీత ఒత్తిడిలో ఉన్నప్పుడు

ఇటువంటి పరిస్థితుల్లో డాక్టర్ సలహా లేకుండా వ్యాయామం చేయకూడదు.

సైంటిఫిక్ పరిశోధనలు ఏమని చెప్తున్నాయంటే, పరిశోధనల ప్రకారం క్యాన్సర్ ట్రీట్మెంట్ సమయంలో వ్యాయామం చేసినవారిలో యాక్టివ్‌నెస్ మెరుగ్గా కనిపించింది. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం రెండూ వృద్ధి చెందుతాయి. వ్యాయామం వల్ల ట్రీట్మెంట్ వల్ల కలిగే సైడ్ఇఫెక్ట్స్ తక్కువగా కనిపిస్తాయి.

ఎక్సర్‌సైజ్ షెడ్యూల్ ఇలా ప్లాన్ చేసుకోవడం బెటర్

సోమవారం – నడకస్ట్రెచింగ్

మంగళవారం – బ్రెతింగ్ ఎక్సర్సైజ్, యోగా

బుధవారం – లైట్ బాడీవెయిట్

గురువారం – నడక

శుక్రవారం – తై చీ లేదా యోగా

శనివారం – స్విమ్మింగ్ లేదా విశ్రాంతి

ఆదివారం – పూర్తిగా విశ్రాంతి

వ్యాయామం అనేది శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని పెంచే సహజమైన మార్గం. నడక, యోగా, శ్వాస వ్యాయామాలు ఇవి శరీరాన్ని తిరిగి చురుకుగా మార్చేందుకు సహాయపడతాయి.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం