Milk in Fridge: ఫ్రిజ్‌లో పాలను పెట్టడం మంచిదేనా? ఈ తప్పులు చేస్తే ఆరోగ్యం పాడవుతుంది జాగ్రత్త
Milk in Fridge: చాలా మంది పాలు ఫ్రిజ్ లో ఉంచుతారు. ఇలా ఫ్రిజ్‌లో పాలు ఉంచేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

చలికాలం, వేసవికాలం అనే తేడా లేదు ఫ్రిజ్ ఉపయోగం ఎల్లప్పుడూ ఉంటుంది. కొన్ని వస్తువులను ఫ్రిజ్ లేకుండా నిల్వ చేయడం చాలా కష్టం. పాలు కూడా అలాంటి వస్తువుల్లో ఒకటి. ఫ్రిజ్ లో ఉంచిన పాలు చాలా రోజులు తాజాగా ఉంటాయి. కానీ ఫ్రిజ్ బయట ఉంచినట్లయితే అవి ఒక రోజు కూడా ఉండవు. దాదాపు ప్రతి ఇంట్లోనూ ఏ పదార్థాలు ఫ్రిజ్ లో ఉంచినా, ఉంచకపోయినా పాలు మాత్రం తప్పనిసరిగా ఉంచుతారు. కానీ అలా చేయడం ఆరోగ్యానికి మంచిదేనా?ఫ్రిజ్ లో పాలు నిల్వ చేసే సరైన పద్ధతి ఏమిటి? మనం ఏ తప్పులు చేస్తున్నాం? ఈ విషయాలు తెలుసుకుందాం.
ఫ్రిజ్‌లో పాలు ఎన్ని రోజులు తాజాగా ఉంటాయి?
పాలను ఎక్కువ రోజులు తాజాగా ఉంచుకోవడానికి, వాటిని ఫ్రిజ్ లో నిల్వ చేయడం చాలా ముఖ్యం. యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ నివేదిక ప్రకారం, ఫ్రిజ్ లో మీరు పాలను సుమారు ఒక వారం పాటు నిల్వ చేయవచ్చు. ఫ్రిజ్ లేకుండా పాలు ఎనిమిది గంటల వరకు మాత్రమే ఉంటాయి. వేసవిలో ఒకటి లేదా రెండు గంటల్లోనే చెడిపోతాయి.
ఫ్రిజ్ లో ఉంచిన పాలు ఆరోగ్యానికి మంచిదేనా?
ఫ్రిజ్ లో పాలు చాలా రోజులు తాజాగా ఉంటాయి, కానీ అవి ఆరోగ్యానికి మంచిదేనా అనే విషయంలో చాలా మందికి సందేహం ఉంటుంది. ఫ్రిజ్ లో ఉంచిన పాలు తాగడం సురక్షితం. పాలను మళ్ళీ మళ్ళీ మరిగించడం వల్ల పోషకాలు తగ్గుతాయి. కాబట్టి, పాలను ఒకసారి మరిగించి ఫ్రిజ్ లో ఉంచినట్లయితే మళ్లీ వాటిని తీసి మరగించడం వల్ల పాల నాణ్యత తగ్గిపోతుంది. అయితే, ఎప్పుడూ ముడి పాలను ఫ్రిజ్ లో నిల్వ చేయకూడదు. చాలా నివేదికల ప్రకారం, ముడి పాలను ఫ్రిజ్ లో ఉంచడం వల్ల వాటిలోని బ్యాక్టీరియా, వైరస్‌లు చాలా రోజులు జీవించి ఉంటాయి. అలాంటి ముడి పాలు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ, మరోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
ఫ్రిజ్ లో పాలు ఉంచేందుకు సరైన ప్రదేశం
పాలను ఫ్రిజ్ లో ఎక్కువ రోజులు నిల్వ చేయడానికి, వాటిని సరైన ప్రదేశంలో ఉంచడం చాలా ముఖ్యం. చాలా మంది పాలను ఫ్రిజ్ తలుపుల వైపున ఉన్న ఖాళీలలో ఉంచుతారు. ఇది పూర్తిగా తప్పు. వాస్తవానికి, ఆ ప్రదేశం ఉష్ణోగ్రత అత్యధికంగా ఉంటుంది. ఫ్రిజ్ తరచుగా తెరిచి, మూసివేయడం వల్ల అక్కడి ఉష్ణోగ్రతలో ఎక్కువ మార్పులు ఉంటాయి. కాబట్టి, పాలను అక్కడ నిల్వ చేయడానికి బదులుగా, ఫ్రిజ్ వెనుక భాగంలో ఉన్న దిగువ ఖాళీలలో ఉంచండి. ఆ ప్రదేశం చాలా చల్లగా ఉంటుంది, కాబట్టి అక్కడ పాలు ఎక్కువ రోజులు సురక్షితంగా ఉంటాయి.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం