మూత్ర విసర్జన చేసిన వెంటనే నీరు తాగడం మంచి అలవాటేనా? ఇది మూత్రపిండాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?-is it a good habit to drink water immediately after urinating what effect does it have on the kidneys ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  మూత్ర విసర్జన చేసిన వెంటనే నీరు తాగడం మంచి అలవాటేనా? ఇది మూత్రపిండాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

మూత్ర విసర్జన చేసిన వెంటనే నీరు తాగడం మంచి అలవాటేనా? ఇది మూత్రపిండాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

Ramya Sri Marka HT Telugu
Jan 03, 2025 08:30 AM IST

మూత్ర విసర్జన చేసిన తర్వాత కొందరికి దాహం వేస్తుంది. అందుకే టాయిలెట్ నుంచి రాగానే వెంటనే నీరు తాగుతుంటారు. మీరూ అలానే చేస్తుంటారా? మూత్ర విసర్జన చేసిన వెంటనే నీరు తాగడం మంచి అలవాటేనా? ఇది మూత్రపిండాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది.

మూత్ర విసర్జన చేసిన వెంటనే నీరు తాగడం మంచి అలవాటేనా?
మూత్ర విసర్జన చేసిన వెంటనే నీరు తాగడం మంచి అలవాటేనా? (Shutterstock)

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే సరైన మొత్తంలో నీరు త్రాగటం ఎంత ముఖ్యమో సరైన పద్ధతిలో, సరైన సమయంలో తాగడం అంత కన్నా ముఖ్యం. మంచినీళ్లు తాగడం గురించి మనం చాలా నియమాలు వింటుంటాం. నిలబడి ఉన్నప్పుడు తాగకూడదు. అలాగే అన్నం తిన్న వెంటనే తాగకూడదు. మరీ ముఖ్యంగా ఆయాసపడుతున్నప్పుడు నీళ్లు తాగకూడదు వంటి చాలా ఉన్నాయి. వీటిలాగే నీరు తాగడం విషయంలో మరో ముఖ్యమైన నియమం కూడా ఉంది. అదేంటంటే, మూత్ర విసర్జన తర్వాత నీరు తాగడం.

yearly horoscope entry point

సాధారణంగా మూత్రవిసర్జనకు వెళ్లి వచ్చిన వెంటనే చాలా మందికి దాహంగా అనిపిస్తుంది. వారు టాయిలెట్ నుంచి వచ్చీ రాగానే వెంటనే నీరు త్రాగుతుంటారు. ముఖ్యంగా ఆఫీసుల్లో పని చేసే వాళ్లు బ్రేక్ టైంలో వాష్ రూంకి వెళ్లి వచ్చి నీళ్లు తాగి వెళ్లి సీట్లో కూర్చొంటారు. తెలియకుండానే ఇది చాలా మందికి అలవాటుగా మారిపోయింది. అసలు ఇలా చేయడం కరెక్టేనా.. ముమ్మాటికీ కాదనే అంటున్నారు పరిశోధకులు.

ఏం చెప్తున్నారంటే..:

మూత్ర విసర్జన చేసిన వెంటనే నీళ్లు తాగకూడదట. అలా అయితే ఎంత సేపు తర్వాత నీళ్లు తాగాలి అనే మరో ప్రశ్న కూడా మీలో రావొచ్చు. ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది కూడా. ఎందుకంటే టాయిలెట్ చేసిన వెంటనే నీరు త్రాగటం శరీరంపై ప్రతికూల ప్రభావం పడుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. వాటిల్లో తెలిసిన వాస్తవాలేంటి.. ప్రతికూల ప్రభావం ఎందుకు కనిపిస్తుందో తెలుసుకుందాం.

నీళ్లు తాగడం వల్ల వచ్చే సమస్యలు:

వైద్య శాస్త్రం, ఆయుర్వేదం రెండింటిలోనూ, వాష్ రూంకు వెళ్లి వచ్చిన వెంటనే నీరు త్రాగటం మంచిది కాదనే ప్రస్తావించారు. వాస్తవానికి, టాయిలెట్ చేయడం అనేది మీ మూత్రపిండాలు, మూత్రాశయానికి సంబంధించిన ప్రక్రియ. మీరు మూత్రవిసర్జన చేసిన తర్వాత వెంటనే నీరు త్రాగితే, ఇది మీ మూత్రాశయంపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ కారణంగా, మూత్రపిండాల సాధారణ పనితీరుపై ప్రతికూల ప్రభావం కనిపిస్తుంది. ఈ రోజువారీ అలవాటు మూత్రపిండాల సంబంధిత వ్యాధులు, అంటువ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.

శరీరంలో ద్రవాల సమతుల్యత: మూత్రం పోసిన తర్వాత, శరీరంలో ద్రవాల స్థాయి కొంత తగ్గిపోతుంది. ఈ సమయంలో వెంటనే నీరు తాగడం వల్ల, మూత్రపిండాలు గరిష్టంగా పనితీరు చూపే అవకాశం ఉండదు.ఇది ఉబ్బరానికి దారితీస్తుంది. పొత్తికడుపు నొప్పి లేదా అసౌకర్యం రావచ్చు. మూత్రం పోసిన తర్వాత వేగంగా నీరు తాగడం, ప్రత్యేకంగా అధికంగా తాగడం వల్ల, గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్ట్ (GIT)లో కొంత ప్రభావం ఉంటుంది.

వెంటనే నీరు తాగడం వల్ల వచ్చే ప్రధాన సమస్యలు:

1. ఇన్ఫ్లామేషన్ & పొత్తికడుపు (Bladder Irritation)

2. మూత్రపిండాల ఒత్తిడి (Kidney Stress)

3. హైపోనట్రేమియా (Hyponatremia)

4. పొత్తికడుపు విస్తరణ (Bladder Overfilling)

5. గాస్ట్రోఇంటెస్టినల్ ఇబ్బందులు (Gastrointestinal Problems)

మూత్రం పోసిన తర్వాత ఎంత విరామంతో నీరు తాగాలి?

మూత్ర విసర్జన చేసిన తర్వాత 20 నిమిషాల విరామం తర్వాతే నీళ్లు తాగాలి. టాయిలెట్ చేసేటప్పుడు మూత్రపిండాలు, మూత్రాశయం చురుకుగా మారుతాయి. అటువంటి పరిస్థితిలో, మీరు మూత్రపిండాలకు కొంతకాలం విశ్రాంతి ఇస్తే, అది బాగా ఫ్లష్ అవుతుంది. ఇది శరీరానికి ఉపశమనం కలిగిస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం