Kitchen tips: చలికాలంలో కొబ్బరినూనె గడ్డ కట్టేస్తోందా? ఈ నాలుగు చిట్కాలు పాటిస్తే గడ్డకట్టదు
Kitchen tips: శీతాకాలం కొబ్బరి నూనె గడ్డ కట్టేస్తుంది. దాన్ని కావాలనుకున్నప్పుడు వెంటనే వాడలేము. దాన్ని వేడికి గురిచేసి కరిగేలా చేసి అప్పుడు వాడతారు. నూనె చలిలో గడ్డకట్టకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండా.
కొబ్బరినూనె అన్ని ఇళ్లల్లో అందుబాటులో ఉంటుంది. తలకు, ఒంటికి కూడా ఈ నూనెను వినియోగిస్తూ ఉంటారు. వంటకోసం వాడే వారి సంఖ్య అధికంగానే ఉంది. కేరళలో పూర్తిగా కొబ్బరి నూనెతోనే వండుతారు. అయితే, శీతాకాలంలో దీన్ని ఉపయోగించడం కొంచెం ఇబ్బందిగా మారుతుంది. వాతావరణం చల్లబడగానే కొబ్బరినూనె గట్టిపడటం మొదలవుతుంది. శీతాకాలంలో దీన్ని వాడడం కష్టంగా మారుతుంది. అందుకే చలికాలంలో కొబ్బని నూనె గడ్డకట్టకుండా ఉండాలంటే చిన్న చిన్న చిట్కాలను పాటించండి.
కొబ్బరి నూనెను ఎక్కువ మంది పలుచని సీసా, డబ్బాల్లో నిల్వ చేస్తూ ఉంటారు. దీని వల్ల చలికాలంలో దాన్ని వాడడం కుదరదు. ఈ కారణంగా చాలా మంది శీతాకాలంలో కొబ్బరి నూనెను ఉపయోగించకుండా ఉంటారు. మీరు అదే సమస్యను ఎదుర్కొంటుంటే మేము మీకోసం కొన్ని చిట్కాలు అందించాము. ఈ చిట్కాలు గడ్డకట్టే చలిలో కూడా కొబ్బరి నూనె గడ్డకట్టకుండా నిరోధిస్తాయి. అలాగే గడ్డకట్టిన కొబ్బరి నూనెను త్వరగా కరిగేలా చేయడానికి ఏం చేయాలో తెలుసుకోండి.
ఇలా నిల్వ చేయండి
శీతాకాలంలో చలి కారణంగా కొబ్బరి నూనె పూర్తిగా గడ్డకడుతుంది. అటువంటి పరిస్థితిలో, వెచ్చగా ఉంచడానికి సరైన ప్రదేశంలో నిల్వ చేయడం అవసరం. శీతాకాలంలో, కొబ్బరి నూనెను వంటగదిలోని గ్యాస్ దగ్గర లేదా మీ ఫ్రిజ్ పైన ఉంచండి. ఇది కాకుండా, మీరు దీన్ని మైక్రోవేవ్లో కూడా నిల్వ చేయవచ్చు. మైక్రో వేవ్ వాడనప్పుడు లోపల ఖాళీగా ఉంటుంది. అలాంటప్పుడు మూత గట్టిగా పెట్టి మైక్రోవేవ్ లోపల డబ్బా పెట్టేయండి. ఇది కాకుండా, మీ వద్ద పాత థర్మోస్ బాటిల్ ఉంటే, మీరు కొబ్బరి నూనెను కూడా నిల్వ చేయవచ్చు.
ఇతర నూనెలతో
శీతాకాలంలో కొబ్బరి నూనె గడ్డకట్టకుండా నిరోధించడానికి మరో మార్గం ఉంది. కొబ్బరి నూనె గడ్డకట్టినా, మిగతా కొన్ని నూనెలు గడ్డకట్టవు. కొబ్బరి నూనెకు మరొక నూనెను జోడించి నిల్వ చేయాలి. ఆలివ్ ఆయిల్, ఆవ నూనె, ఉసిరి ఆయిల్ లేదా నువ్వుల నూనె వంటివి కొంచెం కొబ్బరి నూనెలో కలిపితే మంచిది. ఆ నూనెలు కూడా ఆరోగ్యానికి మేలు చేసేవే. ఇందుకోసం కొబ్బరినూనెను వేడి చేసి అందులో నాలుగింట ఒక వంతు పైన చెప్పిన నూనెలను కలపాలి. దీంతో చలికాలం మొత్తం కొబ్బరినూనెను ఎలాంటి ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు.
కొబ్బరి నూనెను మీరు పలచటి డబ్బాలో నిల్వ చేయకూడదు. ముఖ్యంగా ప్లాస్టిక్ దబ్బాల్లో ఉంచితే ఇది త్వరగా గడ్డకట్టేస్తుంది. పెద్ద నోరు ఉన్న వెడల్పాటి సీసాలో నిల్వ చేయండి. దీని వల్ల ఇది గడ్డకట్టినా కూడా త్వరగా కరిగిపోయే అవకాశం ఉంది. అలాగే, నిల్వ చేయడానికి మట్టి కుండ, గాజు సీసా లేదా స్టీలు పాత్ర, సిరామిక్ జార్ ఉపయోగించండి. వెలుపల ఉష్ణోగ్రత లోపలి నూనెను ప్రభావితం చేయదు.
ఇలా కరిగించండి
మీ కొబ్బరి నూనె పూర్తిగా గడ్డకట్టి, సులభంగా బయటకు రాలేకపోతే, మొదట ఒక పాన్లో నీటిని వేడి చేయండి. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత, మీ ఆయిల్ బాటిల్ ను వేడి నీటిలో ముంచండి. ఇది నూనె సులభంగా కరిగిపోవడానికి సహాయపడుతుంది. ఇది కాకుండా, నూనెను కరిగించడానికి మీరు హెయిర్ డ్రయ్యర్ను కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం ఆయిల్ బాటిల్ లోపల కొద్దిగా వేడి గాలిని చల్లితే మీ ఆయిల్ వెంటనే కరిగిపోతుంది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
టాపిక్