Chashwe: జీడిపప్పు గురించి మీలోనూ ఈ అపోహ ఉందా? నిజం తెలుసుకోండి-is cashew increase cholesterol in body know the truth about the myth ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chashwe: జీడిపప్పు గురించి మీలోనూ ఈ అపోహ ఉందా? నిజం తెలుసుకోండి

Chashwe: జీడిపప్పు గురించి మీలోనూ ఈ అపోహ ఉందా? నిజం తెలుసుకోండి

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 18, 2024 12:30 PM IST

Chashwe: జీడిపప్పు తినడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలు చేకూరుతాయి. వివిధ లాభాలు ఉంటాయి. అయితే, జీడిపప్పు గురించి ఓ అపోహ మాత్రం బాగా పాపులర్ అయింది.

Chashwe: జీడిపప్పు గురించి మీలోనూ ఈ అపోహ ఉందా? నిజం తెలుసుకోండి
Chashwe: జీడిపప్పు గురించి మీలోనూ ఈ అపోహ ఉందా? నిజం తెలుసుకోండి (Pexels)

జీడిపప్పులో కీలకమైన విటమిన్లు, మినరల్స్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ప్రొటీన్, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే ప్రతీ రోజు మోతాదు మేరకు వీటిని తింటే ఓవరాల్ ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారు కూడా తమ డైట్‍లో జీడిపప్పు తీసుకోవచ్చు. అయితే, దీని గురించి ఓ అపోహ ఎక్కువగా పాపులర్ అయింది. జీడిపప్పు తింటే శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుందనే మాట వినిపిస్తుంటుంది. అయితే, ఈ విషయంలో నిజం ఇక్కడ తెలుసుకోండి.

జీడిపప్పులో కొలెస్ట్రాల్ ఉండదు

జీడిపప్పులో కొలెస్ట్రాల్ ఏ మాత్రం ఉండదు. చెట్ల ద్వారా వచ్చే వేటిలోనూ కొలెస్ట్రాల్ అనేది ఉండదు. కేవలం మాంసం లాంటి జంతు ఉత్పత్తుల్లోనే కొలెస్ట్రాల్ ఉంటుంది.

జీడిపప్పు తింటే శరీరంలో కొలెస్ట్రాల్ అధికం అవుతుందనే అపోహ సరికాదు. రోజులో 10 వరకు జీడిపప్పు తినవచ్చు. ఈ మోతాదులో తింటే ఆరోగ్యానికి ప్రయోజనాలు బాగా ఉంటాయి. మరీ ఎక్కువగా తింటే కడుపులో కాస్త ఇబ్బందిగా అనిపించే అవకాశం ఉంటుంది. మొత్తంగా జీడిపప్పు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందనేది అవాస్తవం.

చెడు కొలెస్ట్రాల్‍ను తగ్గిస్తుంది

జీడిపప్పులో యాంటీఆక్సిడెంట్లు, అన్‍సాచురేటెడ్ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. దీంతో ఇవి తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గేందుకు ఉపకరిస్తుంది. గుండె ఆరోగ్యానికి జీడిపప్పు మేలు చేస్తుంది. రెగ్యులర్‌గా తింటే గుండె వ్యాధుల రిస్క్ తగ్గిస్తుంది.

జీడిపప్పుతో ఇతర ప్రయోజనాలు

బరువు తగ్గేందుకు: జీడిపప్పు తింటే కడుపు నిండిన ఫీలింగ్ చాలాసేపు ఉంటుంది. తరచూ ఆకలి కాకుండా చేస్తాయి. దీంతో చిటికీమాటికీ తినాలనే ఆశ కలగదు. దీనివల్ల క్యాలరీలు ఎక్కువగా తీసుకోకుండా ఉండొచ్చు. అందుకే వెయిట్ లాస్ కోసం ప్రయత్నించే వారు డైట్‍లో జీడిపప్పును తినాలి. వీటిలో ఉండే ఫైబర్, ప్రోటీన్ కూడా బరువు తగ్గేందుకు ఇది తోడ్పడతాయి.

ఎముకల దృఢత్వానికి: జీడిపప్పులో కాల్షియం, మెగ్నిషియం సహా మరిన్ని మినరల్స్ ఉంటాయి. దీంతో ఇవి తింటే ఎముకల దృఢత్వం, సాంద్రత మెరుగవుతుంది. ఆస్టియోపోరోసిస్ రిస్క్ తగ్గుతుంది.

రోగ నిరోధక శక్తి మెరుగు: క్యాటనోయిడ్స్, పోలిఫెనాల్స్ లాంటి యాంటీఆక్సిడెంట్లు జీడిపప్పులో ఉంటాయి. వీటి వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది. ఇన్‍ఫెక్షన్లు, వ్యాధులతో శరీరం మెరుగ్గా పోరాడేందుకు జీడిపప్పు సహకరిస్తుంది. పూర్తిస్థాయి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

జీర్ణవ్యవస్థకు: మోతాదు మేరకు తింటే జీర్ణవ్యవస్థకు కూడా జీడిపప్పు మేలు చేస్తుంది. ఇందులో డయెటరీ ఫైబర్ ఉంటుంది. దీంతో జీర్ణం త్వరగా అయ్యేలా చేయగలదు. మలబద్ధకం లాంటి కడుపు సంబంధిత సమస్యలు కూడా తగ్గేందుకు సహకరిస్తుంది.

Whats_app_banner