రాత్రి పడుకునే ముందు పిల్లలకు పాలు తాగిస్తున్నారా? ఐతే ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తెలుసుకోండి!-is bedtime milk healthy for children know the best time for kids to drink milk ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  రాత్రి పడుకునే ముందు పిల్లలకు పాలు తాగిస్తున్నారా? ఐతే ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తెలుసుకోండి!

రాత్రి పడుకునే ముందు పిల్లలకు పాలు తాగిస్తున్నారా? ఐతే ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తెలుసుకోండి!

Ramya Sri Marka HT Telugu

చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు పడుకునే ముందు పాలు ఇవ్వడం ఆరోగ్యకరమని భావిస్తారు. కానీ ఈ అలవాటు వారి ఆరోగ్యానికి హాని కలిగించవచ్చట. దీని వల్ల కలిగే నష్టాలేంటి? పాలు తాగడానికి సరైన సమయం ఏంటి వంటి విషయాల గురించి తెలుసుకుందాం రండి.

బిడ్డ చేత పాలు తాగిస్తున్న తల్లి (Shutterstock)

పాలు తాగడం ఒక ఆరోగ్యకరమైన అలవాటు. పిల్లలు పాలు చూడగానే మూతి ముక్కు విరుచుకున్నా కూడా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే బలవంతంగా అలవాటు చేస్తారు. ఎందుకంటే పిల్లల ఎదుగలకు ఇవి చాలా అవసరమని వారి నమ్మకం. అయితే చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు పడుకునే ముందు ఒక గ్లాసు పాలు ఇస్తారు. ఇది ఆరోగ్యకరం కాదని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

సాధారణంగా పడుకునే ముందు పాలు తాగితే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని, వారి ఎదుగుదల బాగుంటుందని, బరువు పెరుగుతారని తల్లిదండ్రులు భావిస్తారు. కానీ ఈ అలవాటు వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువట. పడుకునే ముందు పాలు తాగడం ఎందుకు హానికరమో తెలుసుకుందాం, అలాగే పాలు తాగడానికి ఉత్తమ సమయం ఏదో తెలుసుకుందాం.

రాత్రి పూట పిల్లలకు పాలు తాగించడం వల్ల వచ్చే సమస్యలు:

1. కడుపు సంబంధిత సమస్యలు రావచ్చు

రాత్రి పడుకునే ముందు పాలు తాగడం వల్ల పిల్లల్లో కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి. నిజానికి పాలు చాలా మందంగా ఉంటాయి. వాటిని జీర్ణం చేసుకోవడం కొంచెం కష్టం. కాబట్టి పిల్లలకు పడుకునే ముందు పాలు తాగించడం వల్ల కడుపు నొప్పి, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. ఇది వారి నిద్రపై కూడా చెడు ప్రభావం చూపుతుంది. ఇది మొత్తం ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా మీ పిల్లల జీర్ణక్రియ బలహీనంగా ఉంటే లేదా వారికి పాలు జీర్ణం కావడం కష్టంగా ఉంటే, ఈ తప్పు చేయకండి.

2. దంత ఆరోగ్యంపై చెడు ప్రభావం

రాత్రి పాలు తాగి పడుకోవడం వల్ల పిల్లల దంత ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం పడుతుంది. మీరు పిల్లల పాలలో చక్కెర కలపకపోయినా, పాలలో ఉండే సహజ చక్కెర దంతాలను దెబ్బతీస్తుంది. రాత్రంతా ఇది పిల్లల నోటిలోనే ఉంటుంది, బ్యాక్టీరియా దీనిని ఆమ్లంగా మారుస్తుంది. దీని వల్ల దంతాలలో కావిటీస్, దంతాలు కుళ్ళిపోవడం, పురుగులు తయారవడం వంటి సమస్యల ప్రమాదం పెరుగుతుంది.

3. నిద్రకు ఆటంకం

పడుకునే ముందు ఒక గ్లాసు వేడి పాలు తాగితే నిద్ర బాగా పడుతుందని చాలా మంది తల్లిదండ్రులు నమ్ముతారు. అయితే వైద్యుల అభిప్రాయం ప్రకారం, పాలలో సహజ చక్కెర ఉంటుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిని అకస్మాత్తుగా పెంచుతుంది. దీని వల్ల పిల్లల్లో హైపర్యాక్టివిటీ వస్తుంది. ఫలితంగా వారికి నిద్రపోవడం కష్టమవుతుంది. ఇది పిల్లల మొత్తం ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది.

4. ఈ సమస్యలన్న వారికైతే మరీ ఇబ్బంది

మీ పిల్లలకు తరచుగా దగ్గు, జలుబు సమస్య ఉంటే, అది రాత్రి పాలు తాగడం వల్ల కూడా కావచ్చు. దీనిని మిల్క్ బిస్కెట్ సిండ్రోమ్ అంటారు. అంతే కాకుండా పిల్లలు చిన్నవారైతే మంచం మీద మూత్రం పోసే సమస్య కూడా పెరగవచ్చు. పాలలో కలిపిన చక్కెర, ఫ్లేవర్డ్ పౌడర్ పిల్లల అనారోగ్యకరమైన బరువు పెరుగుదలకు కూడా కారణం కావచ్చు.

మరి పాలు తాగడానికి సరైన సమయం ఏమిటి?

  • పిల్లలకు పాలు ఇవ్వడానికి సరైన సమయం ఏమిటనే ప్రశ్న ఇప్పుడు మీలో తలెత్తి ఉండచ్చు. దానికి సమాధానం ఇక్కడ ఉంది. నిపుణులు అభిప్రాయం ప్రకారం..
  • పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్ సమయంలో ఒక గ్లాసు పాలు ఇవ్వవచ్చు.
  • అలాగే రాత్రి భోజనానికి ముందు అంటే సాయంత్రం సమయంలో కూడా వారి పాలు తాగించచ్చు. దీని వల్ల పాలు బాగా జీర్ణమవుతాయి. పిల్లలకు పూర్తి పోషణ అందుతుంది.
  • అంతే కాకుండా రాత్రి భోజనం చేసిన గంట తర్వాత కూడా పిల్లలకు పాలు ఇవ్వవచ్చు. కాకపోతే పాలు తాగించిన వెంటనే వారు నిద్రపోకుండా చూసుకోండి.
  • పాలు తాగిన తర్వాత పిల్లలను కాసేపు నడవనివ్వండి, బ్రష్ చేయకుండా పడుకోబెట్టకండి.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.