Alum For Skin: మొటిమలు, మచ్చలను తగ్గించడంలో పటిక నిజంగానే ఉపయోగపడుతుందా?
Alum For Skin: ముఖంపై మొటిమలు, పిగ్మెంటేషన్ వంటివి సర్వసాధారణం. కానీ చాలా సార్లు ఇవి మచ్చలుగా మారి అందాన్ని దెబ్బతీస్తాయి. వీటి నుంచి తప్పించుకోవడానికి పటిక పనిచేస్తుందని చాలా మంది చెబుతున్నారు. మొటిమలు, మచ్చలను తగ్గించడంలో పటిక నిజంగానే ఉపయోగపడుతుందా? ఎలా వాడాలి వంటివి తెలుసుకుందాం.
ముఖంపై మొటిమలు, పిగ్మెంటేషన్ వంటివి సాధారణం. . కానీ చాలా సార్లు ఇవి మచ్చలుగా మారి అందాన్ని దెబ్బతీస్తాయి. వీటిని తగ్గించుకోవడానికి మార్కెట్లో దొరికే రకరకాల క్రీముల కన్నా సహజమైన పదార్థాలను ఉపయోగించడం మంచిదని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. మొటిమలు, మచ్చలు వంటి సమస్యలకు పటిక చక్కటి పరిష్కారమవుతుందని ఈ మధ్య సోషల్ మీడియాలో చాల మంది చెబుతున్నారు. చర్మ సమస్యలకు పటిక నిజంగానే పని చేస్తుందా. దీన్ని ఎలా ఉపయోగించాలి తెలుసుకుందాం రండి.

పటిక చర్మ సమస్యలను నిజంగానే నయం చేస్తుందా..?
ఆయుర్వేదం ప్రకారం.. పటిక సహజమైన చర్మ సంరక్షణ పదార్థం. జాగ్రత్తగా ఉపయోగిస్తే ఇది మొటిమలు, పెగ్మెంటేషన్, బ్లెమిషెస్ తగ్గించడంలో కచ్చితంగా సహాయపడుతుంది. ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం..
1. అంటీ-బ్యాక్టీరియల్, యాంటీ-సెప్టిక్ లక్షణాలు:
పటికలో సహజమైన అంటీ-బ్యాక్టీరియల్ , యాంటీ-సెప్టిక్ లక్షణాలు ఉంటాయి, ఇవి చర్మం మీద మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను ఎదరించి వాటిని నివారించడంలో సహాయపడతాయి.
2. అస్ట్రిజెంట్ ప్రభావం:
పటికలో అస్ట్రిజెంట్ లక్షణం ఉంటుంది, అంటే ఇది చర్మాన్ని కడిగేసి, కఠినంగా చేస్తుంది. దీని ద్వారా చర్మ రంధ్రాల్లో నూనె, మురికి, దుమ్ము, ధూళి వంటివి పేరుకుని ఉండవు. ఫలితంగా మొటిమలకు అడ్డుకట్ట పడుతుంది.
3. పెగ్మెంటేషన్ , మచ్చలు తగ్గించడం:
పటిక చర్మం మీద మృతకణాలను తొలగించి, పెగ్మెంటేషన్ , బ్లెమిషెస్ (మచ్చలు) తగ్గించడంలో సహాయపడుతుంది. దీని వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.
4. సహజమైన చర్మాన్ని తెల్లగా చేయడం:
పటిక చర్మాన్ని సహజంగా తెలుపు రంగులోకి మార్చడానికి సహాయపడుతుంది. క్రమం తప్పకుండా ఉపయెగించడం వల్ల చర్మంపై సున్నితమైన ప్రక్రియతో పెగ్మెంటేషన్ , మచ్చలు తగ్గించడంలో సహాయపడవచ్చు.
పటికను చర్మంపై ఎలా ఉపయోగించాలి:
- పటిక, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్:
- పటిక బెల్లాన్ని పొడి చేసి , రోజ్ వాటర్ లేదా తేనె కలిపి పేస్ట్ తయారుచేసుకోండి.
- దాన్ని ముఖంపై అప్లై చేసి 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగే ఉంచిండి.
- తర్వాత గోరువెచ్చటి లేదా చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రంగా కడిగేసుకోండి.
-పటిక, కొబ్బరి నూనె ఫేస్ ప్యాక్:
- అర టీస్పూన్ పటికని ఒక టీస్పూన్ కొబ్బరి నూనెతో బాగా కలపండి.
- ఒక ఇయర్ బడ్ సహాయంతో దీన్ని మచ్చలు, పిగ్మెంటేషన్ ఉన్న చోట అప్లై చేయండి.
- ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత 30 నిమిషాలు పాటు ఉంచుకుని, ఆపై కడిగేయండి.
మిగిలిన పేస్ట్‌ను డబ్బాలో వేసుకుని వారం వరకు ఉపయోగించవచ్చు. క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గడమే కాకుండా చర్మం మంచి రంగులోకి వస్తుంది.
జాగ్రత్తలు:
- పటిక వాడటం వల్ల కొందరి చర్మం అతిగా ఎండిపోవచ్చు. అందుకే, వాడిన తర్వాత చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడం మర్చిపోకండి.
- మీరు సెన్సిటివ్ చర్మం ఉన్నవారైతే, ముఖం మీద పటిక వాడేముందు ప్యాచ్ టెస్ట్ చేయండి, ఎందుకంటే కొందరు వ్యక్తులకు ఇది ఇబ్బందిని కలిగించవచ్చు.