Iron Kadayi Cooking: ఇనుప కడాయిలో ఈ 5 కూరగాయలు వండకపోవడమే బెటర్! రుచి మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది!-iron kadayi cooking these 5 vegetables are better not cooked in iron kadayi not only the taste but also the health ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Iron Kadayi Cooking: ఇనుప కడాయిలో ఈ 5 కూరగాయలు వండకపోవడమే బెటర్! రుచి మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది!

Iron Kadayi Cooking: ఇనుప కడాయిలో ఈ 5 కూరగాయలు వండకపోవడమే బెటర్! రుచి మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది!

Ramya Sri Marka HT Telugu

Iron Kadayi Cooking: ఆహారం ఇనుప కడాయిలో వండితే రుచికరంగా ఉంటుందని అందరూ భావిస్తుంటారు. కానీ, ఇలా వండకపోతేనే మరింత రుచికరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా, ఇనుప కడాయిలో వండితే ఆరోగ్యం కూడా మందగిస్తుందట. అదెలాగో తెలుసుకుందామా!

ఇనుప కడాయిలో వంటకం (Shutterstock)

ఆరోగ్యకరమైన ఆహారం తయారు చేసేందుకు సరైన పదార్థాలను ఎంచుకోవడం ఎంత ముఖ్యమో, వాటిని వండేందుకు సరైన పాత్రలను ఎంచుకోవడం కూడా అంతే ముఖ్యం. దక్షిణ భారతదేశంలోనే కాదు, మనదేశంలో చాలా మంది ఇనుప కడాయిలను చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. పైగా అందరిలో ఉండే భావన, వీటిల్లో వండితే చాలా ప్రయోజనకరమైనది అని. శరీరంలో ఇనుము లోపం ఉన్నవారికి ఇనుప కడాయిలో వండిన ఆహారం చాలా ప్రయోజనకరమైనదిగా భావిస్తారు. వాస్తవానికి ఇనుప పాత్రల్లో వండటం వల్ల కలిగే ప్రయోజనాలు అటుంచితే, వీటి వల్ల నష్టాలు బోలెడు ఉన్నాయట. ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే, కొన్ని కూరగాయలను ఇనుప కడాయిలో వండకపోవడమే బెటర్. ఇలా చేయడం వల్ల వాటి రంగు, రుచి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుంది.

ఐరన్ కడాయికి బదులుగా, స్టీల్ లేదా అల్యూమినియం వంటి నాన్-రియాక్టివ్ మెటల్ పాత్రలలో మాత్రమే వండాల్సిన కూరగాయలేమిటంటే..

టమాటోలను వండకండి

ఇనుప కడాయిలో ఎప్పటికీ టమాటోలను వండకూడదు. నిజానికి టమాటోల్లో ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది. కాబట్టి, మీరు దీన్ని ఇనుప కడాయిలో వండినప్పుడు, టమాటోతో చర్య జరుపుతుంది. దీని వల్ల మీ ఆహారం రుచి, వాసన రెండూ చెడిపోతాయి. మీరు గమనిస్తే, ఇనుప కడాయిలో వండిన టమాటోలో ఒక విచిత్రమైన లోహపు వాసన, రుచి వస్తుంది.

పాలకూరను కూడా వండకండి

ఇనుప కడాయి లేదా పాన్‌లో పాలకూరను కూడా వండకూడదు. నిజానికి పాలకూరలో పుష్కలంగా ఆక్సాలిక్ ఆమ్లం ఉంటుంది. మీరు దీన్ని ఇనుప కడాయిలో వండినప్పుడు, ఇది ఇనుముతో చర్య జరుపుతుంది. దీని వల్ల పాలకూర రంగు చెడిపోతుంది. ఇనుప కడాయిలో వండిన పాలకూర నల్లగా మారి, రుచి కూడా మారిపోతుంది. ఫలితంగా ఆ వంటలో నుంచి ఒక విచిత్రమైన వాసన కూడా వస్తుంది.

ఇనుప పాత్రలో చక్కెరను వండకండి

చక్కెరను కూడా ఇనుప పాత్రలో వండడం మానుకోవాలి. నిజానికి చక్కెరలో మంచి మోతాదులో ఇనుము ఉంటుంది, ఇది కడాయిలో ఉన్న ఇనుముతో చర్య జరుపుతుంది. దీని వల్ల మీ వంటకం రంగు పూర్తిగా చెడిపోతుంది. అంతేకాకుండా ఆహారపు వాసన, రుచి కూడా పూర్తిగా చెడిపోతుంది.

ఇనుప కడాయిలో నిమ్మకాయతో కూడిన ఆహారాలను వండకండి

ముందుగా చెప్పుకున్నట్లు ఆమ్ల స్వభావం ఉన్న కూరగాయలను వండకూడదు. అందులో మొదటిది నిమ్మకాయ, ఇనుప కడాయి లేదా పాన్‌లో ఎప్పటికీ నిమ్మకాయతో కూడిన వంటకాలను వండకూడదు. నిమ్మకాయల్లో ఉండే ఆమ్ల స్వభావం ఇనుప కళాయిలో వండినప్పుడు, ఇది ఆహారం రంగు, రుచిని మారుస్తుంది. దీని వల్ల ఆహారంలో చేదు వస్తుంది. కాబట్టి, మీరు ఇనుప కడాయిలో ఏదైనా వంటకం తయారు చేస్తున్నట్లయితే, దానిలో నిమ్మకాయను కలపడం మానుకోండి.

ఇనుప కళాయిలో ఉసిరికాయను వండకండి

ఆమ్ల స్వభావం ఉన్న మరో కూరగాయ ఉసిరికాయ. దీనిని కూడా ఎప్పటికీ ఇనుప కడాయి లేదా పాత్రలో వండకూడదు. పుల్లగా ఉండే ఉసిరికాయను ఇనుప కడాయిలో వండినప్పుడు, ఇది ఆహారం రంగును చెడిపోయేలా చేస్తుంది. అంతేకాకుండా ఇది ఆహారంలో ఒక రకమైన లోహపు రుచిని కూడా చేర్చుతుంది. ఉసిరికాయతో కూడిన ఏదైనా వంటకం తయారు చేస్తున్నట్లయితే, దానికి అల్యూమినియం లేదా మట్టి పాత్రలను ఉపయోగించవచ్చు.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం