ఇప్ప పువ్వు ఈ పేరు చాలా మంది వినే ఉంటారు. కానీ మీరు విన్నట్లు, అనుకుంటున్నట్లు ఇది కేవలం సారాయి తయారీకి మాత్రమే ఉపయోపడే పదార్థం కాదు. ఆయుర్వేదం ప్రకారం ఇది ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇంగ్లీషులో ఇండియన్ బటర్ ట్రీగా పిలిచే ఈ చెట్టు శాస్త్రీయ నామం 'డిప్లోనీమా బ్యూటీగేసియా'. ఈ చెట్టు వేర్ల నుంచి పుష్పం, ఫలం వరకూ అన్నీ ఔషధ గుణాలతో నిండి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడం నుంచి గుండె జబ్బులు, మోకాలి నొప్పులు, చర్మ సమస్యలను తగ్గించడం వరకూ అనేక రకాల సమస్యలు తగ్గుతాయి. వీటిని వల్ల కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలేంటి, వీటిని ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం రండి..
ఇప్ప పువ్వు నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జాయింట్ల నొప్పులు, మోకాలి నొప్పులు, కండరాల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఈ నూనెలోని ఔషధ గుణాలు నడకలో ఇబ్బందులను తగ్గిస్తాయి.
ఇప్ప పువ్వు విత్తనాలలో ఉన్న సహజ యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అల్సర్ అసిడిటీ, పొట్ట నొప్పి, పొట్ట ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలతో పాటు మలబద్ధకం, డయేరియా వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి.
ఇప్ప పువ్వు విత్తనాలతో తయారుచేసిన నూనె రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఈ నూనెలో ఉన్న ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. జలుబు, దగ్గు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తాయి.
ఇప్ప పూలు, పండ్లు అలర్జీలకు చక్కని ఔషధంలా పని చేస్తాయి. వీటితో తయారు చేసిన నూనెలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు దురద, దద్దుర్లు, తామెర వంటి చర్మ ఇన్ఫెక్షన్లు నయం చేస్తాయి. చర్మాపు లోతుల్లోకి పోషకాలు అందేలా చేస్తాయి. దీనివల్ల చర్మం తేమగా ఉండి ఆరోగ్యంగా మెరుస్తూ కనిపిస్తుంది.
ఇప్ప పువ్వు నూనెలో ఉన్న మోనో అన్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలి అన్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. ఈ ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా, గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.
ఇప్ప పువ్వులు దంతాలు, చిగుళ్ల సమస్యలకు కూడా చక్కటి పరిష్కారంగా పని చేస్తాయి. నోటిలో మంట, వాపుకు వంట సమస్యలను కూడా నయం చేస్తాయి.
సంబంధిత కథనం