యోగా వ్యాయామాలు మన శరీరం, మనస్సు రెండింటికీ ఆరోగ్యాన్ని అందిస్తాయి. అవి మన మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి. ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. యోగాభ్యాసాలు పురుషులు, మహిళలు ఇద్దరికీ చాలా ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, అవి చాలా ప్రత్యేకమైన రీతిలో మహిళలకు అనేక ప్రయోజనాలను అందిస్తాయి.
యుక్తవయస్సు నుండి రుతువిరతి వరకు స్త్రీ శరీరం వివిధ మార్పులకు లోనవుతుంది. యోగా అభ్యాసాలు మహిళలు ఈ హార్మోన్ల మార్పులకు అనుగుణంగా సహాయపడతాయి. యోగా వ్యాయామాలు వారి శారీరక, మానసిక ఆరోగ్యంలో తలెత్తే సమస్యలను పరిష్కరించడానికి కూడా సహాయపడతాయి. స్త్రీలు ఈ కింది యోగాసనాలు రోజూ చేస్తే వారి శారీరక సమస్యలు తొలగిపోయి. శరీర కదలికలు సక్రమంగా ఉంటాయి. ఇది వారిని యాక్టివ్‌గా కూడా చేస్తుంది. వారి మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
బాలాసనం స్త్రీల శారీరక ఆరోగ్యానికి ఉత్ప్రేరకం. ఈ యోగాసనాన్ని పిల్లల ఆసనంగా కూడా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ ఆసనం పిల్లల రిలాక్స్డ్ సిట్టింగ్ పొజిషన్‌ను పోలి ఉంటుంది. అంటే రెండు కాళ్లతో మోకరిల్లి, వెనుక కాళ్లపై కూర్చోవాలి. వెనుకకు వంచి, ముందు భాగంలో పడటం ద్వారా బలాసనం చేస్తారు. ఈ ఆసనం వెనుక కండరాలను బలపరుస్తుంది. శరీరం, మనస్సు మధ్య సంబంధాన్ని బలపరుస్తుంది. ఈ యోగా భంగిమలో 3 నిమిషాలు ఉండి, ఆపై సాధారణ స్థితికి రావాలి.
మార్జర్యాస దీనినే పిల్లి భంగిమ అని కూడా అంటారు. ఈ ఆసనం మహిళల్లో రుతుక్రమ సమస్యలను నయం చేయడంలో సహాయపడుతుంది. ఇది వెన్నెముకను బలపరుస్తుంది. దానిని ఫ్లెక్సిబుల్ చేస్తుంది. ఈ ఆసనం శ్వాసకు సంబంధించినది. రోజూ ఇలా చేస్తే శరీరానికి, మనసుకు మంచి ఫలితాలు వస్తాయి. ఇది వెన్నునొప్పిని కూడా తగ్గిస్తుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది.
వీరభద్రాసనాన్ని యోధుల ఆసనంగా పరిగణిస్తారు. ఈ ఆసనం మొత్తం శరీరాన్ని బలపరుస్తుంది. ఇది ఉదరం, తొడలు, ఛాతీ, భుజాలు, తుంటిని కూడా ఉత్తేజపరిచి పునరుజ్జీవింపజేస్తుంది. ఈ ఆసన స్థితిలో 2 నిమిషాలు ఉండి, ఆపై సాధారణ స్థితికి తిరిగి రావాలి. ఈ ఆసనాన్ని రెండు వైపులా చేయండి.
అధో ముఖ స్వనాసన ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. ఈ ఆసనం చేయడం వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరిగి శరీరం మొత్తం బలపడుతుంది. అలాగే ఈ ఆసనం వెన్నెముకకు గొప్పగా సహాయపడుతుంది.
నవసనం అనేది పడవ భంగిమ. నవసాన సాధన చేయడం వల్ల ఉదర కండరాలు బలపడతాయి. దాంతో పాటు శరీరం మొత్తం దృఢంగా మారుతుంది. ఇది పొట్టలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగిస్తుంది. అలాగే కాలు, వెనుక కండరాలను బలపరుస్తుంది.
ఈ యోగా వ్యాయామాలు మహిళల్లో మానసిక మార్పులను అధిగమించడానికి సహాయపడతాయి. మహిళలు ప్రతిరోజూ ఈ యోగాసనాలను చేసి లాభాలను పొందవచ్చు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21న ఉంది. కనీసం అప్పటి నుంచైనా ప్రతీరోజూ యోగా చేయడం అలవాటు చేసుకోండి.
టాపిక్