Yoga For Sleep : ఈ యోగాసనాలు క్రమం తప్పకుండా చేస్తే హాయిగా నిద్రపోతారు-international yoga day 2024 best yoga asanas for good sleep all you need to know about yoga poses ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Yoga For Sleep : ఈ యోగాసనాలు క్రమం తప్పకుండా చేస్తే హాయిగా నిద్రపోతారు

Yoga For Sleep : ఈ యోగాసనాలు క్రమం తప్పకుండా చేస్తే హాయిగా నిద్రపోతారు

Anand Sai HT Telugu
Jun 18, 2024 06:45 PM IST

International Yoga Day 2024 : నిద్ర అనేది మనిషి చాలా ముఖ్యం. నిద్రలేమితో బాధపడేవారు కొన్ని రకాల యోగాసనాలు క్రమం తప్పకుండా చేస్తే హాయిగా నిద్రపోవచ్చు.

నిద్రపోయేందుకు యోగాసనాలు
నిద్రపోయేందుకు యోగాసనాలు (Unsplash)

మనిషి ఆరోగ్యానికి నిద్ర చాలా మంచిది. ఒక వ్యక్తి రోజూ ఏడు గంటల కంటే ఎక్కువ నిద్రపోవాలి. నిద్ర తక్కువగా ఉంటే, అనేక అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. ఇటీవల యువత స్మార్ట్ ఫోన్లు, గ్యాడ్జెట్లపై మోజు పడటంతో అర్ధరాత్రి వరకు మొబైల్ తోనే గడుపుతున్నారు. కానీ ఇది అస్సలు మంచి పద్ధతి కాదు. రోజుకు ఎనిమిది గంటలు పడుకోవాలి. ఉదయమే లేవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు.

రాత్రిపూట త్వరగా నిద్రపోవాలి. ఒత్తిడి, ఆందోళన కారణంగా చాలామంది నిద్రపోలేరు. ఇలాంటి సమస్య ఉన్నవారు నిత్యం యోగా వ్యాయామాలు చేయడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఈ యోగాసనాలు మీకు బాగా నిద్రపోవడానికి ఎలా సహాయపడతాయో తెలుసుకుందాం.

యోగ నిద్ర (శవాసన)

యోగా అభ్యాసకులు ఆచరించే చివరి ఆసనం శవాసనం. మానవులలో ఒత్తిడిని తగ్గించడానికి శవాసన సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. శవాసనం చేసేటప్పుడు, చేతులు, కాళ్ళను హాయిగా చాచి నేలపై పడుకోవాలి. అప్పుడు లోతైన శ్వాస తీసుకోండి.

ప్రయోజనాలు

ఒత్తిడి తగ్గుతుంది.

ఏకాగ్రత పెరుగుతుంది.

జీవక్రియ మెరుగుపడుతుంది.

శరీరాన్ని పునరుజ్జీవింపజేస్తుంది.

భ్రమరీ ప్రాణాయామం

నిద్ర సమస్యలతో బాధపడే వారికి కూడా భ్రమరీ ప్రాణాయామం చాలా మంచిది. ఇలా చేస్తున్నప్పుడు లోతైన శ్వాస తీసుకోవడం వల్ల కోపం, ఒత్తిడి తగ్గుతుంది. ఈ ఆసనం వేసేటప్పుడు ముక్కు, చెవులను చేతుల సహాయంతో కప్పుకోవాలి. ఇంకా నోరు మూసుకుని ముక్కు సహాయంతో శ్వాస తీసుకోవాలి. ఇలా పది నిమిషాల పాటు చేస్తే చాలా మంచిది. భయం, ఆందోళన, కోపం, నిద్రలేమి వంటి మానసిక సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది

ప్రయోజనాలు

రక్తపోటును తగ్గిస్తుంది.

మైగ్రేన్ సమస్యను తగ్గిస్తుంది.

జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

ఒత్తిడి, నిరాశను తొలగిస్తుంది.

అనులోమ, విలోమ ప్రాణాయామం

అనులోమ, విలోమ ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఒక సమయంలో ఒక నాసికా రంధ్రం ద్వారా శ్వాస తీసుకోండి. ఇలా చేయడం వల్ల మన రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇందుకోసం ముందుగా కాళ్లు ముడుచుకుని కూర్చోవాలి. తర్వాత ఒక చేతి సహాయంతో ఒక్కో నాసికా రంధ్రం ద్వారా శ్వాస పీల్చుకోవాలి.

ప్రయోజనాలు

ఆస్తమా, అలర్జీ వంటి సమస్యలు దూరమవుతాయి.

నాడీ వ్యవస్థను సమతుల్యం చేస్తుంది.

ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు పరిష్కారమవుతాయి.

శరీరం నుండి టాక్సిన్స్ తొలగిస్తుంది.

బాలసానా

బాలాసన సమయంలో కూడా మన శరీరమంతా విశ్రాంతి పొందుతుంది. ముందుగా నేలపై కూర్చుని కాళ్లను ముందుకు వంచాలి. అప్పుడు మీ చేతులను నేలపై నిటారుగా ఉంచి, నేలను తాకేలా వెనుకకు, తలను ముందుకు వంచండి. లోతుగా ఊపిరి పీల్చుకోండి.

ప్రయోజనాలు

మెదడును ప్రశాంతపరుస్తుంది.

ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది.

రక్తపోటును పెంచుతుంది.

వెన్నునొప్పి సమస్యను పరిష్కరిస్తుంది.

మకరాసనం (మొసలి భంగిమ)

మకరాసనం అంటే మొసలి భంగిమ. మకరాసనం చేయడం కూడా చాలా సులభం. మనం సాధారణంగా నిద్రపోయే స్థితిలో కాకుండా బోర్లా పడుకోవాలి. మన శరీరమంతా నిటారుగా సాగదీసి తలకిందులుగా పడుకోవాలి. మరో చేతిని నేరుగా తలపై ఉంచి, మన చేతిని దానిపై ఉంచాలి.

ప్రయోజనాలు

ఆస్తమా సమస్యను పరిష్కరిస్తుంది.

శరీరాన్ని పునరుజ్జీవింపజేస్తుంది.

నిద్రలేమిని పరిష్కరిస్తుంది.

ఈ ఆసనాలను క్రమం తప్పకుండా చేయడం వల్ల నిద్రలేమి వంటి సమస్యలతో బాధపడేవారు మీ సమస్యలన్నింటి నుంచి బయటపడవచ్చు. అంతేకాదు వీటి ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి. యోగా చేయడం వలన మెుత్తం శరీరం బాగుపడుతుంది.

WhatsApp channel