టీ అనగానే అందరికీ వెంటనే ఒక ఆహ్లాదకరమైన అనుభూతి గుర్తుకు వస్తుంది. టీ తాగనివారు అరుదుగా కనిపిస్తారు. పొద్దున్నే లేచిన వెంటనే టీ తాగకపోతే.. ఇతర పనులు అస్సలు చేయలేరు. ఇటీవలి రోజుల్లో టీకి చాలా ప్రాముఖ్యత పెరిగింది. పూర్వ కాలంలో ప్రత్యేక సందర్భాలలో లేదా ప్రత్యేక అతిథులు వచ్చినప్పుడు టీ అందించేవారు. కానీ ఈ రోజుల్లో ఇది రోజువారీ పానీయంగా మారింది. టీ దొరకని ప్రాంతం ఇండియాలో మీకు కనిపించదేమో. అలా టైమ్ పాస్ కోసం బయటకు వెళితే.. అనేక రకాల రుచికరమైన టీ దుకాణాలు కనిపిస్తాయి.
కొన్ని ప్రాంతాల్లో టీ కోసం మీరు చాలా సేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. టీని రుచి చూడాలంటే మీరు లైన్‌లో వేచి ఉండాల్సిన దుకాణాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్‌లోనూ ఇలాంటివి దర్శనమిస్తాయి. టీకి రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. మే 21న అంతర్జాతీయ టీ దినోత్సవం జరుపుకొంటారు. ఇప్పుడు చాలా రకాల ఖరీదైన టీలు మార్కెట్‌లో సులువుగా లభిస్తున్నాయి. టీ గురించి మీకు తెలియని కొన్ని వాస్తవాలు ఇక్కడ ఉన్నాయి.. చదవండి
ప్రపంచంలో అత్యంత సాధారణంగా వినియోగించే పానీయాలలో టీ రెండోది.
టీ అనేది మొదటిసారిగా 1400లలో చైనా చక్రవర్తి ఉపయోగించారని చెబుతారు.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే టీలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి చైనాలో సాధారణంగా ఉపయోగించే టీ, మరొకటి భారతదేశంలోని అస్సాం, డార్జిలింగ్ వంటి కొండ ప్రాంతాలలో పెరిగే టీ మొక్కలు.
6 రకాల నమూనాలు టీలో ఉన్నాయి. నలుపు, తెలుపు, ఆకుపచ్చ, పసుపు, ఊలాంగ్ టీ అంతేకాకుండా.. స్వచ్ఛమైన టీని సాధారణంగా చైనాలో ఎక్కువగా ఉపయోగిస్తారు.
ఈ రకాలు అన్నీ ఒకే మొక్క నుండి వచ్చినప్పటికీ, వాటి ప్రాసెసింగ్ పద్ధతులు భిన్నంగా ఉంటాయి. వాటి రుచులు భిన్నంగా ఉంటాయి.
టీ మెుక్క నుండి వైట్ టీ తయారు చేస్తారు. ఇది మరింత ప్రాసెస్ చేస్తారు. ఈ రకమైన టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.
సాధారణంగా గ్రీన్ టీ ఆకులను శీతాకాలంలో పండించరు. ఎందుకంటే ఇది శీతాకాలంలో ఎక్కువ ఆక్సీకరణ శక్తిని కలిగి ఉంటుంది. వేసవి తర్వాత ఎక్కువ పండుతుందని చెబుతారు.
పసుపు టీ కూడా కొంత వరకు ఆక్సీకరణం చెందదు, కానీ దాని ప్రాసెసింగ్ పద్ధతి కొద్దిగా భిన్నంగా ఉంటుంది.
బ్లాక్ టీ అనేది ప్రపంచంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే టీ, దాని రుచికి ప్రసిద్ధి చెందింది.
ఊలాంగ్ అనేది ఒక రకమైన టీ, ఇందులో గ్రీన్ టీ కూడా ఉంటుంది. ఈ పద్ధతిలో పెద్ద టీ ఆకులను తెంచి, టీ తయారు చేస్తారు. కానీ ఇందులో 70 శాతం మాత్రమే పాక్షికంగా ప్రాసెస్ చేస్తారు.
ప్యూర్ అనేది ఒక ప్రత్యేకమైన టీ, దీనిని చైనా టీ అని పిలుస్తారు. చైనాలో తయారు చేస్తారు. ఈ పద్ధతిలో, టీని కేక్ రూపంలో నిల్వ చేస్తారు. కొన్ని సంవత్సరాల తర్వాత దాని రుచి తరచుగా మారుతుంది. భిన్నంగా ఉంటుంది. ఈ మోడల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీ మోడల్.
ఖరీదైన టీ అంటే కీటకాలు, పాండాల నుండి తయారైన టీ. వాటి మలం నుంచి కూడా టీని తయారు చేస్తారని చెబుతారు. ఇది చైనాలో చాలా ప్రజాదరణ పొందిన పద్ధతి. ఇవి టీ గురించి కొన్ని వాస్తవాలు. మీ అందరికీ ప్రపంచ టీ దినోత్సవ శుభాకాంక్షలు.
టాపిక్