International Museum Day 2023: ప్రపంచంలో ఉన్న వింత మ్యూజియాలివే..-international museum day 2023 worlds most bizarre museums you wont believe ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  International Museum Day 2023: World's Most Bizarre Museums You Won't Believe

International Museum Day 2023: ప్రపంచంలో ఉన్న వింత మ్యూజియాలివే..

May 18, 2023, 12:26 PM IST Koutik Pranaya Sree
May 18, 2023, 12:26 PM , IST

మే 18 న ఇంటర్నేషనల్ మ్యూజియం డే. ప్రపంచంలో ఉన్న వింత మ్యూజియాల గురించి తెలుసుకోండి.  

ఇంటర్నేషన్ మ్యూజియం డే సందర్భంగా ప్రపంచంలో ఉన్న వింత మ్యూజయాల గురించి తెలుసుకోండి. టాయిలెట్ల నుంచి పరాన్న జీవుల వరకు ఉన్న వివిధ వింత మ్యూజియంలు ఉన్నాయి. అవేంటో చూసేయండి. 

(1 / 10)

ఇంటర్నేషన్ మ్యూజియం డే సందర్భంగా ప్రపంచంలో ఉన్న వింత మ్యూజయాల గురించి తెలుసుకోండి. టాయిలెట్ల నుంచి పరాన్న జీవుల వరకు ఉన్న వివిధ వింత మ్యూజియంలు ఉన్నాయి. అవేంటో చూసేయండి. (Pinterest)

ది మ్యూజియం ఆఫ్ బ్యాడ్ ఆర్ట్, యూ‌ఎస్ఏ: ఈ మ్యూజియంలో చూడటానికి అస్సలు బాలేని, విచిత్రంగా ఉండి.. చూడగానే ఇదేం ఆర్ట్ రా బాబు అనిపించే బొమ్మల సేకరణ ఉంటుంది. 

(2 / 10)

ది మ్యూజియం ఆఫ్ బ్యాడ్ ఆర్ట్, యూ‌ఎస్ఏ: ఈ మ్యూజియంలో చూడటానికి అస్సలు బాలేని, విచిత్రంగా ఉండి.. చూడగానే ఇదేం ఆర్ట్ రా బాబు అనిపించే బొమ్మల సేకరణ ఉంటుంది. (Pinterest)

సులభ్ ఇంటర్నేషనల్ మ్యూజియం ఆఫ్ టాయిలెట్స్, డిల్లీ, ఇండియా: ఈ మ్యూజియంలో మరుగుదొడ్ల చరిత్ర, పారిశుద్ధ్య వ్యవస్థలో వచ్చిన మార్పుల గురించి ఉంటుంది. వివిధ కాలాలకు, సంస్కృతులకు సంబంధించిన టాయిలెట్లు ఇక్కడున్నాయి. 

(3 / 10)

సులభ్ ఇంటర్నేషనల్ మ్యూజియం ఆఫ్ టాయిలెట్స్, డిల్లీ, ఇండియా: ఈ మ్యూజియంలో మరుగుదొడ్ల చరిత్ర, పారిశుద్ధ్య వ్యవస్థలో వచ్చిన మార్పుల గురించి ఉంటుంది. వివిధ కాలాలకు, సంస్కృతులకు సంబంధించిన టాయిలెట్లు ఇక్కడున్నాయి. (AFP/Sajjad Hussain)

ది ఐస్లాండిక్ ఫాలోలాజికల్ మ్యూజియం,రేక్‌జావిక్‌, ఐస్‌ల్యాండ్‌: ఈ మ్యూజియం క్షీరదాలు, సముద్ర జీవులు మరియు జంతువులకు సంబంధించిన నమూనాలతో సహా వివిధ జంతు జాతుల పురుషాంగాలను అధ్యయనం చేయడానికి అంకితం చేయబడింది.

(4 / 10)

ది ఐస్లాండిక్ ఫాలోలాజికల్ మ్యూజియం,రేక్‌జావిక్‌, ఐస్‌ల్యాండ్‌: ఈ మ్యూజియం క్షీరదాలు, సముద్ర జీవులు మరియు జంతువులకు సంబంధించిన నమూనాలతో సహా వివిధ జంతు జాతుల పురుషాంగాలను అధ్యయనం చేయడానికి అంకితం చేయబడింది.(Pinterest)

ది మెగురో పారాసైటోలాజికల్ మ్యూజియం, టోక్యో, జపాన్: ఈ మ్యూజియం మానవులు మరియు జంతువులపై పరాన్నజీవుల ప్రభావంపై దృష్టి పెడుతుంది, ఇందులో సంరక్షించబడిన నమూనాలు, విద్యా ప్రదర్శనలు మరియు ఇంటరాక్టివ్ డిస్ప్లే సేకరణ ఉంది. 

(5 / 10)

ది మెగురో పారాసైటోలాజికల్ మ్యూజియం, టోక్యో, జపాన్: ఈ మ్యూజియం మానవులు మరియు జంతువులపై పరాన్నజీవుల ప్రభావంపై దృష్టి పెడుతుంది, ఇందులో సంరక్షించబడిన నమూనాలు, విద్యా ప్రదర్శనలు మరియు ఇంటరాక్టివ్ డిస్ప్లే సేకరణ ఉంది. (Pinterest)

విచ్‌క్రాఫ్ట్ అండ్ మ్యాజిక్ మ్యూజియం,కార్న్‌వాల్‌,ఇంగ్లాండ్‌: ఈ మ్యూజియం మంత్రవిద్య, మాయాజాలం చుట్టూ ఉన్న చరిత్ర మరియు జానపద కథలను తెలియజేస్తుంది, కళాఖండాలు, మంత్రవిద్య పద్ధతులు మరియు నమ్మకాలకు సంబంధించిన వస్తువులను ప్రదర్శిస్తుంది.

(6 / 10)

విచ్‌క్రాఫ్ట్ అండ్ మ్యాజిక్ మ్యూజియం,కార్న్‌వాల్‌,ఇంగ్లాండ్‌: ఈ మ్యూజియం మంత్రవిద్య, మాయాజాలం చుట్టూ ఉన్న చరిత్ర మరియు జానపద కథలను తెలియజేస్తుంది, కళాఖండాలు, మంత్రవిద్య పద్ధతులు మరియు నమ్మకాలకు సంబంధించిన వస్తువులను ప్రదర్శిస్తుంది.(Pinterest)

అవనోస్ హెయిర్ మ్యూజియం, టర్కీ: టర్కీలోని అవనోస్ హెయిర్ మ్యూజియం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళల నుండి విరాళంగా అందించబడిన జుట్టును ఇక్కడ ప్రదర్శిస్తుంది. ఈ విచిత్ర మ్యూజియం మానవుల జుట్టు, దాని సాంస్కృతిక ప్రాముఖ్యతను వినూత్నంగా తెలియజేస్తుంది. 

(7 / 10)

అవనోస్ హెయిర్ మ్యూజియం, టర్కీ: టర్కీలోని అవనోస్ హెయిర్ మ్యూజియం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళల నుండి విరాళంగా అందించబడిన జుట్టును ఇక్కడ ప్రదర్శిస్తుంది. ఈ విచిత్ర మ్యూజియం మానవుల జుట్టు, దాని సాంస్కృతిక ప్రాముఖ్యతను వినూత్నంగా తెలియజేస్తుంది. (Pinterest)

కప్ నూడుల్స్ మ్యూజియం, జపాన్: ఈ మ్యూజియం ఒక ప్రత్యేక ఆకర్షణ, ఇది  ఇన్‌స్టంట్ నూడిల్ ఆవిష్కరణను తెలియజేస్తుంది. జపాన్‌లో ఉన్న ఈ మ్యూజియంలో ఇంటారాక్టివ్ డిస్ప్లేలు ఉంటాయి. దాంతో పాటే మనకు నచ్చినట్టుగా కప్ నూడుల్స్ కస్టమైజ్ చేసుకునే అవకాశం ఇక్కడ ఉంది. కప్ నూడుల్స్ చరిత్ర గురించి కూడా ఇక్కడ అనేక వివరాలున్నాయి. 

(8 / 10)

కప్ నూడుల్స్ మ్యూజియం, జపాన్: ఈ మ్యూజియం ఒక ప్రత్యేక ఆకర్షణ, ఇది  ఇన్‌స్టంట్ నూడిల్ ఆవిష్కరణను తెలియజేస్తుంది. జపాన్‌లో ఉన్న ఈ మ్యూజియంలో ఇంటారాక్టివ్ డిస్ప్లేలు ఉంటాయి. దాంతో పాటే మనకు నచ్చినట్టుగా కప్ నూడుల్స్ కస్టమైజ్ చేసుకునే అవకాశం ఇక్కడ ఉంది. కప్ నూడుల్స్ చరిత్ర గురించి కూడా ఇక్కడ అనేక వివరాలున్నాయి. (Pinterest)

ది గోల్డ్ మ్యూజియం, కొలంబియా:  ఈ మ్యూజియంలో బంగారు కళాఖండాలు, పురావస్తు సంపద విశేషమైన సేకరణ ఉంది. సందర్శకులు ఈ ప్రాంతంలో బంగారం గొప్ప చరిత్ర, దాని సాంస్కృతిక ప్రాముఖ్యతను సంబంధించి చాలా విషయాలున్నాయి, విశేషమైన హస్తకళను చూడవచ్చు, పురాతన నాగరికత గురించి తెలుసుకోవచ్చు. 

(9 / 10)

ది గోల్డ్ మ్యూజియం, కొలంబియా:  ఈ మ్యూజియంలో బంగారు కళాఖండాలు, పురావస్తు సంపద విశేషమైన సేకరణ ఉంది. సందర్శకులు ఈ ప్రాంతంలో బంగారం గొప్ప చరిత్ర, దాని సాంస్కృతిక ప్రాముఖ్యతను సంబంధించి చాలా విషయాలున్నాయి, విశేషమైన హస్తకళను చూడవచ్చు, పురాతన నాగరికత గురించి తెలుసుకోవచ్చు. (Pinterest)

ది డాగ్ కాలర్ మ్యూజియం, ఇంగ్లండ్:  యూకే లోని లీడ్స్ క్యాసల్ లో ఉన్న ఈ మ్యూజియంలో డాగ్ కాలర్ సేకరణ ఉంది.  వివిధ కాలాలకు చెందిన అనేక రకాల చారిత్రాత్మక  కుక్క కాలర్‌లను ఇక్కడ ప్రదర్శిస్తారు. మనుషులు వాళ్ల పెంపుడు జంతువుల మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తుచేస్తుంది.  

(10 / 10)

ది డాగ్ కాలర్ మ్యూజియం, ఇంగ్లండ్:  యూకే లోని లీడ్స్ క్యాసల్ లో ఉన్న ఈ మ్యూజియంలో డాగ్ కాలర్ సేకరణ ఉంది.  వివిధ కాలాలకు చెందిన అనేక రకాల చారిత్రాత్మక  కుక్క కాలర్‌లను ఇక్కడ ప్రదర్శిస్తారు. మనుషులు వాళ్ల పెంపుడు జంతువుల మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తుచేస్తుంది.  (Pinterest)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు