Mother Language Day : అమ్మ మాటే మాతృభాష.. తెలుగు మాట్లాడితే 72000 నరాలు యాక్టివేట్ అవుతాయా?-international mother language day 2023 do you know these things about your mother tongue telugu language ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mother Language Day : అమ్మ మాటే మాతృభాష.. తెలుగు మాట్లాడితే 72000 నరాలు యాక్టివేట్ అవుతాయా?

Mother Language Day : అమ్మ మాటే మాతృభాష.. తెలుగు మాట్లాడితే 72000 నరాలు యాక్టివేట్ అవుతాయా?

HT Telugu Desk HT Telugu

International Mother Language Day : మనిషి తన భావాలను వ్యక్తిపరిచేందుకు సాధనం భాష. మాతృభాషతోనే మనిషి జీవితం మెుదలవుతుంది. అమ్మ నేర్పించే మాతృభాష అమృతంలాగా ఉంటుంది. తేనె కంటే తియ్యగా ఉంటుంది. నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం.. ఈ సందర్భంగా తెలుగు గురించి ఆసక్తికర విషయాలు మీ కోసం..

అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం

అమ్మ భాష.. అదే మాతృభాష. చిన్ననాటి నుంచి.. చివరి శ్వాస వరకూ.. మనిషి జీవితాంతం తోడు ఉండేది మాతృభాష. కమ్మనైన అమ్మపాట లాంటిది మన తెలుగు భాష. కొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగిన గొప్ప వారసత్వ సంపద. అందుకే అంతటి గొప్ప వ్యక్తి.. శ్రీ కృష్ణదేవరాయాలు 'దేశ భాషలందు తెలుగు లెస్స' అని వ్యాఖ్యానించాడు. తల్లే మెుదటి గురువు, తల్లే ఒడి బిడ్డకు మెుదటి బడి. జీవితంలో మెుదటగా నేర్చుకునేది ఏదైనా ఉందంటే.. అది మాతృ భాషే. అమ్మ పలికే.. ప్రతీ పలుకు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తుంటుంది బిడ్డ. అందుకే ప్రతీ ఒక్కరూ అమ్మను కాపాడుకున్నట్టే మాతృభాషను కాపాడుకోవాలి. పరభాషను ప్రేమించాలి.. మాతృభాషను గుండెల్లో పెట్టుకోవాలి. అందుకోసమే.. ప్రతీ ఏటా ఫిబ్రవరి 21న మాతృభాషా దినోత్సవం నిర్వహిస్తారు.

అమ్మ భాషను రక్షించుకోవడానికి 1999లో 30వ యునెస్కో మహాసభ.. ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా ప్రకటించింది. ఆత్మగౌరవాన్ని ప్రసాదించే.. అమ్మ భాషను గౌరవించడం ప్రతీ ఒక్కరి బాధ్యత. ఏ జాతి అయితే మాతృభాషను కీర్తిస్తుందో ఆ జాతి మరింత అభివృద్ధి చెందుతుంది. ఇక తెలుగు భాష విషయానికి వస్తే.. వేల ఏళ్ల నుండి మనుగడలో ఉంది. భాషలో కాస్త మార్పులు రావొచ్చు.. కాలం మారుతుంది.. భాషలోనూ మార్పులు వస్తున్నాయి. అయితే అందులోని మాధుర్యం మాత్రం అలానే ఉంది. అది తెలుగు భాష గొప్పదనం.

తెలుగులోని ప్రతి పదం అచ్చు శబ్దంతో ముగుస్తుంది. మన తెలుగులోనే అత్యధిక సంఖ్యలో సామెతలు ఉన్నాయి. భారతదేశంలో తెలుగు మాట్లాడేవారు ఎక్కువే ఉన్నారు. ఇటాలియన్ వర్తకులు.. తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ గా పిలిచారు. క్రీస్తుపూర్వం 400 నుంచి తెలుగు భాష ఉనికిలో ఉంది. తెలుగులో భాష మాధుర్యం గొప్పది. అయితే తెలుగును మాట్లాడితే 7200 నరాలు యాక్టివేట్ అవుతాయి. ఇది సైంటిఫిక్ గా నిరూపితమైంది.

తెలుగు రాష్ట్రాలతోపాటుగా భారత దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ తెలుగు మాట్లాడేవారు ఉన్నారు. శ్రీలంకకు చెందిన జిప్సీ జాతి ప్రజలు కూడా తెలుగు మాట్లాడుతారు. భారతదేశంలో స్థానిక భాషలు మాట్లాడే స్థానంలో తెలుగుది మూడో స్థానం. తెలుగులో తియ్యదనం ఉంది. ప్రతి పదం పలుకుతుంటే.. అమ్మతో మాట్లాడినట్టుగా ఉంటుంది. అందుకే మాతృభాషగా తెలుగును మాట్లాడే వ్యక్తులుగా ఆనందిద్దాం.., మాతృభాష గొప్పతనాన్ని నలుదిశలా చాటుదాం..

అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవ శుభాకాంక్షలు