ఈ రోజు ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే. స్నేహ బంధాలను సెలెబ్రేట్ చేసుకోడానికి, స్నేహితుల పట్ల ప్రశంసలు చూపించడానికి అంకితం చేయబడిన ప్రత్యేక రోజు . ఇది 1935 లో యునైటెడ్ స్టేట్స్‌లో మొదలైంది. స్నేహితులను గౌరవించడానికి, మన జీవితాలలో వారు పోషించే పాత్రను గౌరవించడానికి యు.ఎస్ కాంగ్రెస్ ఈ రోజును ప్రతిపాదించింది. సంవత్సరాలుగా, ఇది అంతర్జాతీయ గుర్తింపును పొందింది.
భారతదేశంలో స్నేహితుల దినోత్సవ ఆగస్టు మొదటి ఆదివారం రోజు జరుపుకుంటారు. అయితే జులై 30 వ తేదీన ప్రపంచమంతా ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటుంది.
భావోద్వేగాలు పంచుకోవడం, విడదీయలేని బంధం ఏర్పర్చుకోవడం, ఆనందాన్ని అందించడంలో స్నేహితుల ప్రాముఖ్యత ఎనలేనిది. సోషల్ మీడియా యుగంలో ఫోటోలు, జ్ఞాపకాలు, సందేశాలను ఆన్ లైన్ లో పంచుకోవడం, దూరప్రాంతాల్లో ఉన్న వారిని కూడా ఆన్‌లైన్ లోనే కనెక్ట్ అవుతున్నాం. ప్రతి సందర్బం ప్రత్యేకంగా మారిపోయింది.
ఫ్రెండ్షిప్ డే వ్యక్తిగత బంధాలను బలోపేతం చేయడమే కాకుండా దయ, అవగాహన మరియు పరస్పర గౌరవం యొక్క విలువలను కూడా గుర్తుచేస్తుంది. స్నేహితులు వల్ల మన జీవితంపై పడే సానుకూల ప్రభావాన్ని ఈ రోజు ప్రత్యేకంగా గుర్తు చేస్తుంది.
1. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, నువ్వు నా జీవితంలో ఉన్నందుకు నేను గర్వ పడుతున్నా. మనం గడిపిన ఆనంద క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేను.
2. నా కష్ట సుఖాల్లో నాకు తోడుగా ఉన్నందుకు థ్యాంక్యూ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే డియర్.
3. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, నీలాంటి మిత్రులు జీవితాన్ని అందమైన ప్రయాణంగా మార్చేస్తారు.
4. నీకు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు మిత్రమా. నీ స్నేహం నాకొక అమూల్యమైన నిధి. నీవు నీలాగే నాతో ఉన్నందుకు థ్యాంక్యూ.
5. నేను గుడ్డిగా నమ్మే వ్యక్తిగా, నా సంతోషానికి కారకుడిగా, నా ధైర్యానికి కారణమైనందుకు నీకు కృతజ్ఞతలు చెప్పాలి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. 💕💪
6. హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే బెస్ట్ ఫ్రెండ్! 👫 నా జీవితంలో నీ ఉనికి ఎంతో ఆనందాన్ని, ఆప్యాయతను ఇస్తుంది. మన విడదీయరాని బంధానికి అభినందనలు. 🥂
7. మన స్నేహం ఇంకా బలపడుతూ మనలో అంతులేని ఆనందాన్ని తీసుకురావాలి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. 🌟💖
8. ఈ రోజు మనం సెలెబ్రేట్ చేసుకోవాల్సిన రోజు 🎊 నీ అచంచలమైన మద్దతు మరియు ప్రేమకు ధన్యవాదాలు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. 🙏💛
9. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. 😊 ఎప్పటికీ స్నేహితులుగానే ఉంటామనే వాగ్దానంతో ఈ రోజును మరింత ప్రత్యేకం చేద్దాం. 💞
10. ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు ఫ్రెండ్! 🥳 మనం సృష్టించాల్సిన జ్ఞాపకాలు మరెన్నో ఉన్నాయి. నా స్నేహితుడిగా ఉన్నందుకు థ్యాంక్యూ. 🌈💫
టాపిక్