Asteroid Day 2022 : ఆస్టరాయిడ్స్ డేని ఎందుకు జరుపుతారో తెలుసా?-international asteroid day 2022 significance and history and theme ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  International Asteroid Day 2022 Significance And History And Theme

Asteroid Day 2022 : ఆస్టరాయిడ్స్ డేని ఎందుకు జరుపుతారో తెలుసా?

Geddam Vijaya Madhuri HT Telugu
Jun 30, 2022 11:32 AM IST

ఆస్టరాయిడ్ ప్రభావ ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రపంచ ఆస్టరాయిడ్ డేని జరుపుతున్నారు. భూమికి సమీపంలో ఉన్న వస్తువు వల్ల ముప్పు ఉన్నట్లయితే.. ప్రపంచ స్థాయిలో తీసుకోగల సంక్షోభ కమ్యూనికేషన్ చర్యల గురించి ప్రజలకు వివరిస్తారు.

ప్రపంచ గ్రహశకల దినోత్సవం
ప్రపంచ గ్రహశకల దినోత్సవం

International Asteroid Day 2022 : ప్రపంచ ఆస్టరాయిడ్ డే లేదా ప్రపంచ గ్రహశకల దినోత్సవం లేదా అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవాన్ని జూన్ 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. గ్రహశకలం ప్రభావ ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ రోజు లక్ష్యం.

చరిత్ర

డిసెంబర్ 2016లో.. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ A/RES/71/90 తీర్మానాన్ని ఆమోదించింది. ఇది 1908లో అదే రోజున సైబీరియా, రష్యన్ ఫెడరేషన్‌పై తుంగస్కా ప్రభావం వార్షికోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా పాటించే లక్ష్యంతో జూన్ 30ని అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవంగా ప్రకటించింది. ఉల్క ప్రభావ ప్రమాదం గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా దీనిని నిర్వహిస్తున్నారు. ఔటర్ స్పేస్ శాంతియుత ఉపయోగాలపై కమిటీ (COPUOS) ఆమోదించిన అసోసియేషన్ ఆఫ్ స్పేస్ ఎక్స్‌ప్లోరర్స్ ప్రతిపాదన ఆధారంగా జనరల్ అసెంబ్లీ ఈ నిర్ణయం తీసుకుంది.

ఆస్టరాయిడ్స్ అంటే ఏమిటి?

ఆస్టరాయిడ్స్ అంటే గ్రహశకలాలు. ఇవి సూర్యుని చుట్టూ తిరిగే చిన్న రాతి వస్తువులను సూచిస్తాయి. ఇవి సాధారణంగా అంగారక గ్రహం, బృహస్పతి మధ్య కక్ష్యలో ఉంటాయి. దీనిని 'గ్రహశకలం బెల్ట్'గా సూచిస్తారు. వాటి పరిమాణం గులకరాళ్ల పరిమాణం నుంచి దాదాపు 600 మైళ్ల వరకు ఉంటుంది. మన సౌర వ్యవస్థలో వేల సంఖ్యలో గ్రహశకలాలు ఉన్నాయని నమ్ముతారు.

ప్రాముఖ్యత

B612 పేరుతో ఒక సంస్థ భూమిని గ్రహశకలాల ప్రభావం నుంచి రక్షించే దిశగా పనిచేస్తుంది. గ్రహశకలాలు భూమికి ముప్పు కలిగిస్తాయని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడానికి ఆస్టరాయిడ్ డే జరుపుతారు.

ESA (యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ), JAXA (జపనీస్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ), ESA (యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ), Roscosmos (రష్యా), ISRO (భారతదేశం), NASA (USA) వంటి అనేక దేశాలలోని అనేక ఏజెన్సీలు వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తాయి.

WhatsApp channel

సంబంధిత కథనం