Intermittent Fasting | ఈ ఉపవాసం ఎవరు చేయవచ్చు.. ఎవరు చేయకూడదు..-intermittent fasting is good for high blood pressure here is the reasons ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Intermittent Fasting Is Good For High Blood Pressure Here Is The Reasons

Intermittent Fasting | ఈ ఉపవాసం ఎవరు చేయవచ్చు.. ఎవరు చేయకూడదు..

Geddam Vijaya Madhuri HT Telugu
Mar 22, 2022 08:32 AM IST

బరువు తగ్గడం అనేది మనలో చాలా మందికి ఉన్న ఒక లక్ష్యం. దీనికోసం ఆన్‌లైన్‌లో అనేక వ్యూహాలు కూడా పాటిస్తారు. అలాగే ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి సహాయపడే కొన్ని పరిష్కారాలు కూడా ఉన్నాయి. కానీ అవి అంత ప్రభావాన్ని చూపించవు. అయితే దీనిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అడపాదడపా ఉపవాసం (Intermittent Fasting) గురించి. అంటే రోజులోని కొన్ని గంటలలో తినడం. అయితే మీకు అధిక రక్తపోటు ఉన్నప్పుడు దీనిన పాటించడం సురక్షితమేనా?

ఈ ఉపవాసం అందరికీ మంచిదేనా?
ఈ ఉపవాసం అందరికీ మంచిదేనా?

Intermittent Fasting | బరువు తగ్గాలనుకునేవారు అడపాదడపా ఉపవాసాన్ని (Intermittent Fasting) కచ్చితంగా అనుసరిస్తారు. కానీ అధికరక్తపోటు ఉన్నవారు కూడా దీనిని పాటించవచ్చా? ఇది అధిక బీపీని తగ్గించడంలో సహాయపడుతుందా అంటే.. అవుననే అంటున్నారు నిపుణులు. అడపాదడపా ఉపవాసం కేవలం బరువు తగ్గించడంలోనే కాదు.. మీ రక్తపోటు, షుగర్ స్పైక్‌లను కూడా తగ్గిస్తుందని ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ అంజలి ముఖర్జీ వెల్లడించారు.

కొలెస్ట్రాల్, చక్కెర స్థాయిలు..

అధిక రక్తపోటుతో బాధపడుతున్నప్పటికీ.. మీరు ఈ ఉపవాసం ఎలా సురక్షితంగా చేయవచ్చు అనే దానిగురించి అంజలి వివరించారు. వాస్తవానికి ఈ రకమైన ఉపవాసం మీ రక్తపోటు, ఇన్సులిన్, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం ద్వారా మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని వెల్లడించారు. సెల్ మెటబాలిజం అనే జర్నల్‌లో ప్రచురించబడిన 2020 అధ్యయనం, అడపాదడపా ఉపవాసం మెటబాలిక్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న మహిళలకు సహాయపడుతుందని నిరూపించింది. వారికి తక్కువ రక్తపోటు, తక్కువ కొలెస్ట్రాల్, తక్కువ రక్తంలో చక్కెర స్పైక్‌లు ఉన్నాయి. నిజానికి ఇది దీర్ఘకాలిక మంటను కూడా తగ్గిస్తుందని స్పష్టం చేసింది.

రక్తపోటు అదుపులో..

ఒక అధ్యయనం ప్రకారం 4-21 రోజుల పాటు ఉపవాసం ఉన్న 1,422 మంది పాల్గొనగా రక్తపోటు స్థాయిలు తగ్గాయి. ఎందుకంటే ఉపవాసం పారాసింపథెటిక్ కార్యకలాపాలను పెంచుతుందని అధ్యయనాలు పేర్కొన్నాయి. దీనిని 'విశ్రాంతి, జీర్ణ స్థితి' అని కూడా పిలుస్తారు. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.

అధ్యయనాలు ఏమంటున్నాయ్..

ప్రత్యామ్నాయ-రోజుల్లో ఉపవాసాన్ని అనుసరించిన 32 మంది పెద్దలను పరిగణనలోకి తీసుకున్న మరొ అధ్యయనం కూడా ఉంది. వారు తమ ఉపవాసం రోజున 400-600 కేలరీలు తిన్నారు. ఇతర రోజులలో వారు కోరుకున్నది తిన్నారు. ఉపవాసం చేయని వారితో పోలిస్తే ఈ అలవాటు వారి రక్తపోటును తగ్గించడంలో సహాయపడిందని తేలింది. అంతే కాదండోయ్ 2018లో, న్యూట్రిషన్ అండ్ ఏజింగ్ 16:8 ఉపవాస నియమావళిపై 23 మంది పెద్దల అధ్యయనాన్ని ప్రచురించింది. ఇది కూడా తక్కువ రక్తపోటును కూడా చూపించిందని తెలిపారు.

ఈ ఉపవాసం మంచిదే అయినా.. దీనికి కొందరు దూరంగా ఉండాలని సూచించారు.

* మీకు తినే రుగ్మతల చరిత్ర ఉంటే..

* గర్భవతి లేదా తల్లిపాలు ఇచ్చేవారు

* మీకు 65 ఏళ్లు పైబడి ఉంటే..

* 18 ఏళ్లలోపువారు వారు పాటించకపోవడమే మంచిది.

* మీకు తక్కువ రక్తపోటు ఉంటే..

* మందులు వేసుకునేవారైతే.. దీనికి దూరంగా ఉండటమే మంచిది.

 

WhatsApp channel

సంబంధిత కథనం