Puffed Rice Dosa: మరమరాలతో మెత్తని దోసలు, వినడానికే కాదు తినడానికి కూడా కొత్తగా అనిపించే ఈ రెసిపీ ట్రై చేసేయండి మరి!
Instant Dosa: ఉదయాన్నే చాలా లైట్ ఫుడ్ తినాలనుకుంటున్నారా? అయితే మరమరాల దోస మీకు మంచి ఆప్షన్. తక్కువ కేలరీలతో త్వరగా చేసుకనే రుచికరమైన ఈ ఫుడ్ కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తుంది. మరమరాల దోస ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

మురమురాలతో మెత్తని దోసెలు
మరమరాలతో దోసలు అంటే వినడానికే కొత్తగా ఉంది కదా. దోసలు తినడానికే విసిగిపోయే వారు, లేదంటే చాలా లైట్ గా మాత్రమే తినాలనుకునే వారు ఈ దోస రెసిపీ ట్రై చేయొచ్చు. ఇందులో కలుపుకునే క్యాప్సికమ్, క్యారెట్, టమాటోతో పూర్తి వెజిటేబుల్ ఫ్లేవర్ వస్తుంది. పూర్తి హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రెసిపీ మీ కోసం.
కావాల్సిన పదార్థాలు: 👇
- మరమరాలు - 2 కప్పులు
- ఉప్మా రవ్వ - 1/2 కప్పు
- పెరుగు - 1/4 కప్పు
- నీరు - 1 + 1/2 కప్పు
- క్యారెట్ - 1
- క్యాప్సికమ్ -1
- ఉల్లిపాయ - 1
- టమాటో - 1
- కొత్తిమీర
- సాంబార్ మసాలా - 1 స్పూన్
- బేకింగ్ సోడా 1/ 2 స్పూన్
- ఉప్పు రుచికి తగినంత
- వంట నూనె
తయారీ విధానం: 👇
- మరమరాలను, ఉప్మా రవ్వ, పెరుగు వేసుకుని మిక్సీలో బాగా మెత్తగా అయ్యేంత వరకూ గ్రైండ్ చేయండి.
- అవసరమైనంత వరకూ నీరు పోసుకుని మెత్తగా చేసుకోవాలి. ఆ పిండి బాగా లూజ్‌గా కాకుండా, అలాగే టైట్‌గా కాకుండా ఉండాలని మర్చిపోకండి.
- ఆ పిండిలో ఉప్పు కలిపి ఒక పది నిమిషాల పాటు మూతపెట్టి ఉంచండి.
- ఆ తర్వాత మూత తీసి అందులో సన్నగా తరిగిన టమాటో, క్యారెట్, క్యాప్సికమ్, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకోండి.
- ఇప్పుడు పాన్ మీద నూనె వేసుకోండి. అది వేడైన తర్వాత పిండితో గుండ్రంగా వేసుకుంటూ దోసె పోసుకోండి.
- దానిపై కాస్త సాంబార్ పౌడర్ వేసుకుని రెండు వైపులా వేయించుకోండి.
- ఆ తర్వాత దానిని ఓ ప్లేటులోకి తీసుకుని కొబ్బరి చట్నీ లేదా అల్లం చట్నీ వేసుకుని సర్వ్ చేసుకోండి.
- అంతే రుచికరమైన, ఆరోగ్యకరమైన మరమరాల దోస రెడీ అయిపోయినట్టే. దీన్ని తినడం వల్ల ఎక్కువ తినేస్తున్నాం అనే బాధ, బరువు పెరుగుతామేమో అనే భయం రెండూ ఉండవు. పిల్లలు పెద్దలు ఇష్టంగా తినేయచ్చు.
సంబంధిత కథనం