Insomnia |సరైన నిద్రలేకపోతే.. గుండె జబ్బులు, మరణాలు తప్పవా?-insomnia impacts heart health here is the reasons and tips for best sleep ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Insomnia Impacts Heart Health Here Is The Reasons And Tips For Best Sleep

Insomnia |సరైన నిద్రలేకపోతే.. గుండె జబ్బులు, మరణాలు తప్పవా?

Geddam Vijaya Madhuri HT Telugu
Mar 26, 2022 07:37 AM IST

నిద్ర అనేది మనిషికి కావాల్సిన ప్రధాన అవసరాలలో ఒకటి. ఈ నిద్ర మీదనే ఆరోగ్యం కూడా ముడి పడి ఉంటుంది. మెదడుకి, శరీరానికి విశ్రాంతి ఇచ్చేది నిద్ర మాత్రమే. కానీ ఈ రోజుల్లో చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ఇది గుండె ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. మరి దీనిని ఎదుర్కోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

నిద్రలేమి
నిద్రలేమి

Sleeping Issues | ప్రపంచవ్యాప్తంగా 10-30% జనాభా నిద్రలేమితో బాధపడుతున్నారని వివిధ పరిశోధనలు వెల్లడించాయి. ఇది క్రమంగా గుండె జబ్బులను కూడా పెంచుతున్నాయని స్పష్టం చేశాయి. నిద్రలేమి లేదా పేలవమైన నిద్ర చక్రం ప్రవర్తన... మనిషి చురుకుదనం, శ్రద్ధను ప్రభావితం చేస్తాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులతో పాటు.. హృదయ సంబంధ వ్యాధులకు కూడా దారితీస్తుంది.

నిద్రలేమి వల్ల కలిగే నష్టాలు

యూకేలోని బయోబ్యాంక్ ప్రాస్పెక్టివ్ కోహోర్ట్ 40 నుంచి 69 సంవత్సరాల వయస్సు గల 5,00,000 మందిపై అధ్యయనం చేసింది. 5 గంటల కంటే తక్కువ నిద్రపోయే వ్యవధి లేదా 9 గంటల కంటే ఎక్కువ నిద్రించే వ్యక్తుల్లో హృదయ సంబంధ వ్యాధులు, మరణాల సంభవం ఎక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ఇతర అధ్యయనాలు కూడా నిద్రలేమి వల్ల అధిక రక్తపోటు, ఊబకాయం, గుండె జబ్బులు, స్ట్రోక్, గుండెపోటు ప్రమాదాన్ని పెంచే టైప్ 2 మధుమేహంతో ముడిపడి ఉన్నాయని నిరూపించాయి.

నిద్ర లేమితో బాధపడేవారిలో రక్తంలో ఇన్‌ఫ్లమేటరీ సైటోకిన్‌ల స్థాయిలు పెరగడం వల్ల గుండె జబ్బులు, మరణాలు సంభవిస్తాయని సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సంతోష్ కుమార్ వెల్లడించారు. కాలక్రమేణా నిద్ర లేమి వల్ల అనారోగ్యకరమైన అలవాట్లకు దారితీస్తాయని స్పష్టం చేశారు. దీని ఫలితంగా అధిక ఒత్తిడి స్థాయిలు, తక్కువ శక్తి, తక్కువ శారీరక శ్రమ, అనారోగ్యకరమైన ఆహార ఎంపికలు హృదయ సంబంధ వ్యాధులకు ప్రమాద కారకాలవుతాయన్నారు.

పలు సూచనలు

దీన్ని నివారించడానికి, ఆరోగ్యకరమైన గుండె కోసం 7-9 గంటల మంచి నిద్రకు దారితీసే ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లు తప్పనిసరి పాటించాలని సూచించారు. నిద్ర చక్రం సమస్యలను ఎలా పరిష్కరించవచ్చో, దాని ఫలితంగా గుండె జబ్బుల ప్రమాదాన్ని ఎలా తగ్గించవచ్చో ఈ విధంగా సూచించారు.

1. ఆ సమయంలో కెఫీన్‌ 

నిద్రించడానికి కనీసం 6 గంటల ముందు కెఫిన్ లేదా కార్బోనేటేడ్ డ్రింక్స్ తాగకుండా ఉండేందుకు ప్రయత్నించండి.

2. స్క్రీన్ సమయం

నిద్రవేళకు ముందు మీ స్క్రీన్ సమయాన్ని తగ్గించండి. గాడ్జెట్‌లకు దూరంగా ఉండండి.

3. నో స్మోకింగ్, ఆల్కహాల్

మీ రోజువారీ జీవితంలో స్మోకింగ్, ఆల్కహాల్ మానుకోండి.

4. ఆరోగ్యకరమైన ఆహారం

ప్యాక్ చేసిన ఆహారాలకు బదులుగా.. ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలను తినేందుకు ప్రయత్నించండి. ఆకలితో మాత్రం నిద్రించకండి.

5. ధ్యానం చేయండి

ధ్యానం సహాయంతో మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. ఇది రోజులో ఉదయం లేదా సాయంత్రం చేయవచ్చు.

6. పుస్తకాలు చదవండి

మీరు పడుకున్న 20 నిమిషాల తర్వాత నిద్రపోలేకపోతే... మీ మనసుకు ప్రశాంతత కలిగించే వాటిని చదవడానికి ప్రయత్నించండి. ఇది మీకు మంచి నిద్ర రావడానికి సహాయపడుతుంది.

7. బెడ్‌రూమ్‌పై పెట్టుబడి

మీరు కంఫర్ట్​గా పడుకునేందుకు మీ బెడ్‌రూమ్‌ను సౌకర్యవంతమైన ప్రదేశంగా మార్చుకోండి. మంచి నాణ్యమైన ఫోమ్ మ్యాట్రెస్‌లలో పెట్టుబడి పెట్టండి.

8. డాక్టర్‌ని సందర్శించండి

మీకు తీవ్రమైన నిద్ర సమస్యలు ఉంటే... వాటిని ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా తగ్గించుకోవచ్చు. కానీ దీర్ఘకాలిక సమస్యలు కొనసాగితే మాత్రం నిపుణుడిని సందర్శించండి. తదనుగుణంగా చికిత్స లేదా మందులు తీసుకోవడం చాలా ముఖ్యం. స్వీయ చికిత్సలు చేసుకోవద్దు. ఇది మీ నిద్ర లేమిని, అలాగే గుండె సమస్యలను పెంచుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్