శ్రుతి హాసన్ ముంబై ఇల్లు.. కామిక్ బుక్ అంచులతో, గోతిక్ స్టైల్ సొగసులతో-inside shruti haasan mumbai home featuring comic book references gothic decor ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  శ్రుతి హాసన్ ముంబై ఇల్లు.. కామిక్ బుక్ అంచులతో, గోతిక్ స్టైల్ సొగసులతో

శ్రుతి హాసన్ ముంబై ఇల్లు.. కామిక్ బుక్ అంచులతో, గోతిక్ స్టైల్ సొగసులతో

HT Telugu Desk HT Telugu

శ్రుతి హాసన్ ముంబై ఇల్లు ఆమె వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. గోతిక్ డెకర్, ప్రత్యేకమైన కళాఖండాలు, వ్యక్తిగత జ్ఞాపకాలతో ఈ ఇల్లు ఆమె అభిరుచులను తెలియజేస్తుంది.

ముంబై ఇంట్లో శ్రుతి హాసన్

శ్రుతి హాసన్ ముంబై ఇల్లు ఆమె వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. గోతిక్ డెకర్, ప్రత్యేకమైన కళాఖండాలు, వ్యక్తిగత జ్ఞాపకాలతో ఈ ఇల్లు ఆమె అభిరుచులను తెలియజేస్తుంది. ముంబైలోని శ్రుతి హాసన్ ఇంటిని కొన్ని మాటల్లో వర్ణించాలంటే, అది కచ్చితంగా గోతిక్, డార్క్, మూడీ (moody) ఇంటీరియర్‌తో కూడిన ఆత్మీయమైన స్థలం. ఆధ్యాత్మికంగానూ ఎంతో బలంగా నిలిచే ఇల్లుగా చెప్పొచ్చు.

జూలై 28న జూమ్ (Zoom) యూట్యూబ్‌లో షేర్ చేసిన వీడియోలో శ్రుతి తన ముంబై ఇంటిని చూపించింది. ఆమె సోషల్ మీడియా పోస్టుల్లో కూడా ఈ ఇంటి విశేషాలను పంచుకుంది. ఆ వీడియోలో శృతి హాసన్‌కు ఇష్టమైన స్పేస్, ప్రపంచం నలుమూలల నుండి సేకరించిన ప్రత్యేకమైన వస్తువులు, అద్భుతమైన పెయింటింగ్స్ వంటివి కనువిందు చేశాయి.

శ్రుతి హాసన్ ముంబై ఇంట్లోకి తొంగి చూద్దాం రండి

ముంబైలో తనకు ఇంతకుముందు మరో ఇల్లు ఉందని, కానీ దాని డెకర్ 'చాలా వింతగా' పింక్ ఇటుక గోడలతో ఉండేదని చెప్పింది. ఆ ఇంట్లో తనదైన స్టైల్‌ను నిలుపుకున్నా, ఆమెకు కొత్తగా, పెద్దగా ఉండే స్థలం కావాలనిపించిందట. అలా ఇప్పుడు ఉంటున్న ఇంటిని కొనుక్కుంది. ఇది విశాలంగా, సహజంగా, తన అభిరుచులకు అనుగుణంగా మార్చుకోవడానికి సిద్ధంగా ఉందని శ్రుతి చెప్పింది. "నాది చెన్నై. మాకు విశాలమైన ప్రదేశాలు అలవాటు. ఈ ఇంటి ఖాళీ స్థలాన్ని చూసినప్పుడు... నాకు కావాల్సిన ఇల్లుగా దీన్ని మార్చుకోగలనని నాకనిపించింది" అని శ్రుతి వెల్లడించింది.

రంగురంగుల తివాచీలు, కుషన్లు, కాంక్రీట్ ఫ్లోరింగ్, అలంకరించిన మొక్కల ద్వారా పెరిగిన పచ్చదనం, తన పియానో కోసం ఒక స్థలం, లివింగ్ రూమ్ గోడలపై గ్రాఫిటీ, షూటింగ్‌ల కోసం, కొన్నిసార్లు వ్యాయామం చేయడానికి ఉపయోగించే పెద్ద స్థలం... ఇవన్నీ ఆమె ఇంటికి ఒక ప్రత్యేకమైన శోభను తెచ్చాయి. అలాగే ప్రపంచం నలుమూలల నుండి సేకరించిన జ్ఞాపికల కోసం ఒక చిన్న స్థలం ఉంది. ఇందులో లెక్కలేనన్ని బాతు బొమ్మలు, కొవ్వొత్తులు, క్రిస్టల్స్, ట్రోల్స్, పుస్తకాలు, గ్నోమ్స్ (gnomes), ఎలిమెంటల్ స్టోన్స్ వంటి వ్యక్తిగత సేకరణను చూడొచ్చు.

శ్రుతి ఇంటిని ప్రత్యేకంగా, అత్యంత వ్యక్తిగతంగా మార్చేవి ఆమె డార్క్, గోతిక్ డెకర్‌కు జోడించిన కొన్ని ప్రత్యేకతలు. వాటిలో నీల్ గైమాన్ కోట్ చెక్కిన పౌడర్ రూమ్ తలుపు, క్రిస్టల్స్, టారోట్ డెక్‌లు ఉన్న పూజ గది, కుమారస్వామి, సరస్వతి దేవి చిత్రాలు, గ్రీస్ నుండి తెచ్చిన ఒక శిలువ ఉన్నాయి. ఆమె ఇంట్లో గోవా, గ్రీస్, లండన్, లాస్ ఏంజిల్స్ నుండి సేకరించిన కళాఖండాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా, ఆమె తన రిఫ్రిజిరేటర్‌ను ప్రపంచం నలుమూలల నుండి సేకరించిన అవార్డులు, అయస్కాంతాలతో అలంకరించింది.

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.