Blue Energy's LNG Truck | CNGకి మించిన మైలేజ్‌తో LNG ట్రక్.. 1400 కిమీ ఆగేదేలే!-indias first lng powered truck range up to 1400km launched by blue energy motors ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Indias First Lng Powered Truck Range Up To 1400km Launched By Blue Energy Motors,

Blue Energy's LNG Truck | CNGకి మించిన మైలేజ్‌తో LNG ట్రక్.. 1400 కిమీ ఆగేదేలే!

HT Telugu Desk HT Telugu
Sep 19, 2022 01:19 PM IST

బ్లూ ఎనర్జీ కంపెనీ భారతదేశపు మొట్టమొదటి LNG ట్రక్కును ఆవిష్కరించింది. ఇది CNG కంటే మెరుగైన మైలేజీని అందిస్తుంది. వివరాలు చూడండి.

Blue Energy Motors LNG Truck
Blue Energy Motors LNG Truck

మనకు ఇప్పటివరకు CNG వాహనాల గురించి తెలుసు. ఇవి పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాల కంటే ఎక్కువ మైలేజ్ అందిస్తాయి. ఖర్చు కూడా తక్కువ అవుతుంది. కార్బన ఉద్గారాలు కూడా తక్కువగానే వెలువడుతాయి. అయితే ఇప్పుడు ఈ CNG (Compressed Natural Gas) వాహనాలకు మించిన సామర్థ్యాన్ని అందించే LNG వాహనాలు వచ్చేశాయి.

పూణేకు చెందిన బ్లూ ఎనర్జీ మోటార్స్ భారతదేశపు మొట్టమొదటి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG) తో నడిచే ట్రక్కును విడుదల చేసింది. ఇది పర్యావరణ హితమైన గ్రీన్ ట్రక్కుగా కంపెనీ పేర్కొంది. ఈ కంపెనీ LNG ద్వారా ఆధారితమైన 5528 4×2 ట్రక్కును తమ మొదటి మోడల్‌గా విడుదల చేసింది.

బ్లూ ఎనర్జీ కంపెనీ ప్రకారం, ఈ గ్రీన్ ట్రక్కు లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG) ఇంధనంతో నడుస్తుంది. LNG అనేది సహజ వాయువుకి ఒక రూపం. దీనిని సాధారణంగా సుదూర శ్రేణి అవసరాలను తీర్చగల భారీ-డ్యూటీ వాహనాలలో ఉపయోగిస్తారు. సహజ వాయువును సూపర్ కూలింగ్ చేయడం, ఆపై క్రయోజెనిక్‌గా ద్రవ రూపంలో నిల్వ చేయడం ద్వారా LNG ఏర్పడుతుంది. ఈ గ్యాస్ ద్రవ రూపంలో ఉన్నందున, వాహనంలో ఎక్కువ ఇంధనాన్ని నిల్వ చేయవచ్చు, తద్వారా వాహనానికి ఎక్కువ రేంజ్ లభిస్తుంది. ఇలాంటి LNG వాహనాలు సాధారణంగా యూరోప్ దేశాలలో కనిపిస్తాయి.

Blue Energy LNG Truck ముఖ్యాంశాలు

బ్లూ ఎనర్జీ గ్రీన్ ట్రక్కును 5528 4×2 పేరుతో పిలుస్తున్నారు. ఇందులో 1000 లీటర్ల సామర్థ్యం కలిగిన ఇంధన ట్యాంక్‌ను అందించారు. ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే సుమారు 1400 కి.మీల పరిధిని అందించగలదని కంపెనీ పేర్కొంది. అలాగే ఈ గ్రీన్ ట్రక్ లోని ఇంజన్ 280hp పవర్, 1000Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

అంతేకాదు ఈ ట్రక్ కేవలం LNGతో మాత్రమే కాకుండా CNG, బయోమీథేన్‌లకు కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ మూడింటిలో ఎలాంటి ఎలాంటి గ్యాస్‌తో అయినా ఈ ట్రక్ నడపవచ్చు.

LNG తో 16 శాతం ఖర్చులు అదనంగా తగ్గుతాయి. అంతేకాకుండా Co2ని 30 శాతం వరకు తగ్గించడంలో సహాయపడుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం