Haldi Ceremony Tradition : హల్దీ వేడుక ఎందుకు చేస్తారో తెలుసా? కారణం ఇదే..
Haldi Ceremony Tradition : పెళ్లిళ్ల సీజన్ దగ్గర్లోనే ఉంది. ఇప్పడంటే హల్ది వేడుకను గ్రాండ్గా చేసుకుంటున్నారు కానీ.. అప్పట్లో ఈ వేడుక చేసేవారు కాదు. కానీ.. పసుపుతోనే ప్రతి పని చేసేవారు. పసుపు రాసి స్నానం చేయించనిదే.. ఏ పెళ్లి జరగదు అనడంలో అతిశయోక్తి లేదు. అందుకే పసుపునకు ప్రాధన్యతనిస్తూ.. హల్దీ వేడుక చేసుకుంటున్నారు.
Hladi Ceremony Rituals : పెళ్లిలో వధువు, వరుడు ఎంత ముఖ్యమో.. పసుపు కూడా అంతే ముఖ్యం. తాళిబొట్టు లేకుంటే.. పసుపుకొమ్ముతో.. దారానికి పసుపు రాసి కూడా పెళ్లి జరిపించేయవచ్చు. తలంబ్రాలలో పసుపు.. కాళ్లు, చేతులకు, శరీరానికి పసుపు.. ఇలా పెళ్లిలో పెద్దగా పసుపు నిలుస్తుంది. అలాంటి పసుపునకు ప్రాధన్యత ఇస్తూ.. హల్దీ వేడుకను చేసుకుంటారు.
వివాహానికి ముందు అత్యంత ముఖ్యమైన ఆచారాలలో ఒకటి హల్దీ వేడుక. వివాహ వేడుకలను స్టార్ట్ చేయడానికి వధూవరులకు.. సన్నిహితులు, కుటుంబ సభ్యులు కలిసి.. పెండ్లి కూతురు, పెళ్లి కొడుకు ముఖాలు, చేతులు, పాదాలకు పసుపు రాస్తారు. అయితే ఈ ఆచారాన్ని ఎందుకు నిర్వహిస్తారు? దాని ప్రాముఖ్యత ఏమిటి? ఆ కార్యక్రమానికి ఎలాంటి దుస్తులు ధరించాలి? వంటి ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.
హల్దీ వేడుక అంటే ఏమిటి?
హల్దీ ఆచారాలను వధూవరుల కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో నూతన వధూవరులకు పసుపును పూస్తారు.
దీని ప్రాముఖ్యత ఏమిటి?
పసుపు అనేది వంటగదిలో చాలా ముఖ్యమైన పదార్థాలలో ఒకటి. పసుపు ఆహారానికి రంగు, రుచిని జోడించడమే కాకుండా.. అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. గాయాలు,కాలిన గాయాలకు చికిత్స చేయడానికి హల్దీని క్రిమినాశక, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్‌గా ఉపయోగిస్తారు. అంతేకాకుండా.. జీర్ణకోశ, అనేక ఇతర వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఇవే కాకుండా పసుపును సౌందర్య ప్రయోజనాల కోసం కూడా ఉపయోగిస్తారు. అందం కోసం పసుపును ఇప్పటినుంచి కాదు.. ఎప్పటినుంచో ఉపయోగిస్తున్నారు. ఇందులో కర్కుమిన్ ఉన్నందున.. ఇది చర్మాన్ని మెరుగుపరిచి.. ప్రకాశవంతంగా చేయడంలో సహాయపడుతుంది.
ఈ కారణంగానే.. వివాహానికి ముందు వధూవరులకు పసుపును పూస్తారు. పెళ్లి సమయంలో అందం మెరుగవడంతో పాటు.. యాంటీ బాక్టీరియల్ ఏజెంట్‌గా వారికి రక్షణ ఇస్తుందని పసుపును ఉపయోగించడం.. ఓ ముఖ్యమైన ఆచారంగా మారిపోయింది.
పసనుపును రోజ్ వాటర్ లేదా ముఖ్యమైన నూనెలు లేదా పాలతో కలిపి పేస్ట్ చేస్తారు. దానిని కొన్ని గులాబీ రేకులతో అలంకరిస్తారు. ఈ మిశ్రమాన్ని వధువు, వరుడి ముఖం, చేతులు, పాదాలకు రాస్తారు.
హల్దీ వేడుకలో ఏది వేసుకోవచ్చంటే..
పసుపు రంగు హల్దీ వేడుకకు తగినదిగా పరిగణిస్తారు. ఇది శక్తివంతమైన రంగు. ఈ రంగు విష్ణువుతో సంబంధం కలిగి ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. ఇది కాంతి, జ్ఞానం, స్వచ్ఛత, విజయాన్ని సూచిస్తుంది. వధువు తన హల్దీ వేడుక కోసం పసుపు రంగు చీర, సల్వార్ సూట్ లేదా లెహంగా ధరించవచ్చు.
సంబంధిత కథనం
టాపిక్