వేసవి అంటేనే మామిడి పండ్ల కాలం. ఎక్కడ చూసినా మామిడి పండ్ల సువాసనే. మామిడి పండ్ల స్పెషాలిటీ ఏంటంటే వీటిని నేరుగా తినడం మాత్రమే కాదు, దీనితో రకరకాల నోరూరించే వంటకాలను తయారు చేయవచ్చు. ఇప్పుడు భారతదేశంలో తయారయ్యే మామిడి పండ్ల వంటకం ఒకటి ప్రపంచంలోనే అత్యుత్తమ మామిడి వంటకంగా గుర్తింపు పొందింది.
ప్రసిద్ధ ఆన్‌లైన్ ఆహార, ప్రయాణ మార్గదర్శి టేస్ట్ అట్లాస్(TasteAtlas) భారతదేశంలో, అందులోనూ వేసవిలో ప్రత్యేకంగా తయారుచేసే ఆమ్రస్‌ను మామిడి పండ్ల వంటకాల్లో ది బెస్ట్ అని గుర్తించింది. ఈ గుర్తింపు భారతీయ వంటకాల రుచి, వైవిధ్యాన్ని చాటి చెప్పుతుంది. టేస్ట్ అట్లాస్ గుర్తించిన ప్రపంచంలోని 20 వివిధ రకాల మామిడి వంటకాల్లో ఆమ్రస్ మొదటి స్థానం దక్కించుకుంది.
ఈ జాబితాలో ఆమ్రస్ మాత్రమే కాదు, భారతదేశంలో మామిడి సీజన్‌లో చేసే మరొక వంటకం కూడా స్థానం సంపాదించుకుంది. అది ఏంటంటే మామిడికాయ పచ్చడి. భారతదేశంలో ఎక్కువ ప్రజాదరణ పొందిన మామిడికాయ పచ్చటి టేస్ట్ అట్లాస్ ప్రపంచంలోని 20 బెస్ట్ మామిడి వంటకాల జాబితాలో 5వ స్థానాన్ని సంపాదించుకుంది.
వీటితో పాటుగా టేస్ట్ అట్లాస్‌లోని ఇతర బెస్ట్ మ్యాంగో రెసిపీలు ఏంటి? ఆమ్రస్, మ్యాంగో చట్నీ ప్రత్యేకతలు ఏంటి అనే వివరాలు ఇక్కడ ఉన్నాయి. తెలుసుకోండి.
1. ఆమ్రస్ (భారతదేశం)
2. మ్యాంగో స్టిక్కీ రైస్ (థాయ్‌లాండ్)
3. సోర్బెట్స్ (ఫిలిప్పీన్స్)
4. రుజాక్ (జావా, ఇండోనేషియా)
5. మామిడి చట్నీ (మహారాష్ట్ర, భారతదేశం)
6. మామిడి పొమెలో సాగో (హాంగ్ కాంగ్, చైనా)
7. చైనీస్ మ్యాంగో పుడ్డింగ్ (గ్వాంగ్‌డాంగ్, చైనా)
8. రుజాక్ సింగూర్ (సురబయ, ఇండోనేషియా)
9. బయోబింగ్ (చైనా)
10. మమువాంగ్ నామ్ ప్లా వాన్ (థాయ్‌లాండ్)
11. సోమ్ టామ్ మామువాంగ్ (థాయ్‌లాండ్)
12. గజ్పాచో డి మాంగో (ఆండలూసియా, స్పెయిన్)
13. ఆమ్ దాల్ (పశ్చిమ బెంగాల్, భారతదేశం)
14. జింజర్ మ్యాంగో చికెన్ (టర్క్స్ మరియు కైకోస్ దీవులు)
15. గ్రీన్ మ్యాంగో సలాడ్ లేదా క్రూక్ స్వయ్ (కాంబోడియా)
16. నామ్ ప్లా వాన్ (థాయ్‌లాండ్)
17. అంబా (మహారాష్ట్ర, భారతదేశం)
18. రుజాక్ పెటిస్ (సురబయ, ఇండోనేషియా)
19. మ్యాంగోస్లా అంబా (తమౌలిపాస్, మెక్సికో)
20. రుజాక్ కుకా (పశ్చిమ జావా, ఇండోనేషియా)
ఆమ్రస్ భారతదేశంలోని పశ్చిమ రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్‌లో తయారుచేసే అద్భుతమైన రుచిగల స్వీట్. ఇది పూర్తిగా పండిన మామిడి పండ్ల గుజ్జుతో తయారు చేసిన ప్యూరీతో చేస్తారు. ఈ రెసిపీ మామిడిపండు సహజ పరిమళం, రుచిని అందించే తినుబండారం. దీంట్లో ఏలకులు, కుంకుమ పువ్వు వంటి కలపడం ద్వారా దీని రుచి మరింత రెట్టింపు అవుతుంది.
భారతదేశంలో మామిడి సీజన్‌లో దాదాపు అన్ని రాష్ట్రాల్లో తయారుచేసే వంటకం మామిడి చట్నీ. మామిడికాయలు, మసాలాలతో, చక్కెరతో తయారుచేసిన ఇది తియ్యతియ్యగా, కారకారంగా అద్భుంగా ఉంటుంది. ఇందులో అల్లం, వెల్లుల్లి, మిరపకాయలు, జీలకర్ర మొదలైన వాటిని కలుపుతారు. దీని వాసన రుచి అమోఘంగా ఉంటాయి.
ఆమ్రస్ తయారు చేయడం చాలా సులువు. దీనికి కావలసిన పదార్థాలు ఏంటంటే..
మరి లేటెందుకు ఇక ప్రపంచంలోనే అగ్రస్థానాన్ని దక్కించుకున్న ఈ అద్భుతమైన మామిడి వంటకాలను సీజన్ పోయేలోపు మీరు ఓసారి ఆస్వాదించేయండి.