Valentines day History: అప్పట్లో ప్రేమికుల రోజునే స్త్రీలను కొరడాతో కొట్టేవారట, ఆ పండుగ వస్తుందంటే మహిళలు భయపడిపోయేవారు
Valentines day History: వాలెంటైన్స్ డే అంటే ఒక అందమైన అనుభూతి ఈ కాలంలో కలుగుతుంది. కానీ ఒకప్పుడు మహిళలకు అది నరకం లాంటిది. వాలెంటైన్స్ డే చరిత్ర తెలుసుకోండి.

వాలెంటైన్స్ డే పేరు వింటేనే ప్రేమికుల హృదయాల్లో గులాబీలు విచ్చుకుంటాయి. ఎంతో సున్నితమైన, అందమైన రోజుగా దాన్ని చెప్పుకుంటా.రు కానీ పురాతన రోమన్లలో మాత్రం ఇది సంతానోత్పత్తి పండుగ... అంటే ఆరోజు చేసే కొన్ని పనులు మహిళల్లో సంతాన సామర్థ్యాన్ని పెంచుతాయనే నమ్మకం ఉండేది. ఈ పండుగ వచ్చిందంటే పురాతన రోమన్ స్త్రీలు భయంతో వణికి పోయేవారు.
సంతానోత్పత్తి పండుగ
పురాతన రోమన్లు ఫిబ్రవరి 13 నుండి 15 వరకు లూపెర్కాలియా అనే పండుగను నిర్వహించుకునేవారు. వాలెంటెన్స్ డే కి మూలాలు ఈ పండుగేనని చెప్పుకుంటారు. రోమన్లు ఇది ఒక పురాతన సంతానోత్పత్తి పండుగగా నమ్ముతారు. రోమన్ పురుషులు పిల్లలు పుట్టని తమ భార్యలను తోలు ఊడేలా కొరడాలతో కొట్టేవారు. అలాగే మేకలను బలి ఇచ్చేవారు. ఇలా చేయడం వల్ల ఆ మహిళలకు సంతాన సామర్థ్యం పెరుగుతుందని నమ్మేవారు. ఈ పండుగ తర్వాతి కాలంలో వాలెంటైన్స్ డే గా మారిందని చెప్పుకుంటారు.
కొంతమంది చరిత్రకారులు ఐదవ శతాబ్దం చివరిలో పోపు గెలాక్సీయస్ -1 ఫిబ్రవరి 14ని వాలెంటైన్స్ డే గా ప్రకటించి రోమన్ల పండుగను లేకుండా చేశారనే కూడా వాదనలు ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజమో మాత్రం చరిత్ర కారులు నిరూపించలేకపోయారు.
చరిత్ర ప్రకారం అప్పట్లో రోమ్‌లో ఫిబ్రవరి 14న జరిగే వాలెంటైన్స్ డే పండుగకు ఇద్దరు క్రైస్తవ సాధువులు పాల్గొన్నారని చెబుతారు. ఆ క్రైస్తవ సాధువులు రోమ్ లోనే మరణించారని కూడా చెబుతారు. వారి పేర్లలో ఒకరి పేరు సెయింట్ వాలెంటైన్. అతని పేరు మీదే వాలెంటైన్స్ డే పేరు వచ్చిందని అంటారు.
15వ శతాబ్దంలో ఫ్రాన్స్ లో ఫిబ్రవరి 14న శృంగార ప్రేమకు గుర్తుగా ఈ పండుగ నిర్వహించుకునే వారని చెబుతారు. ఆరోజు జంటలు పాటలు, నృత్యాలతో విలాసవంతమైన విందులతో బిజీగా ఉంటాయి. ఆ రోజున భార్యలకు ప్రేమ లేఖలు రాసేవారు భర్తలు.
గ్రీటింగ్ కార్డుల చరిత్ర
ఇక వాలెంటైన్స్ డే కు గ్రీటింగ్ కార్డులు ఇచ్చుకోవడం అనేది 18వ శతాబ్దంలో మొదలయ్యాయి అని చెప్పుకుంటారు. ముందుగా కాగితాలపై చేసిన గ్రీటింగ్ కార్డులు అందుబాటులో లేకపోవడంతో చేతితోనే ఆకుల పైన, పువ్వులతోనూ గ్రీటింగ్ కార్డులు తయారు చేసే వారని చెప్పుకుంటారు. వాటిపై కవితలను రాసేవారు. ఆ పదాలు, చిత్రాలు ప్రేమికులకు ఇచ్చి తమ ప్రేమను వ్యక్తపరిచేవారు.
18వ శతాబ్దపు గ్రీటింగ్ కార్డులు లండన్ మ్యూజియంలో ఇప్పటికీ ఉన్నాయి. 1913 నుంచి మొట్ట మొదటిసారిగా వాలంటైన్స్ డేకి వాణిజ్యపరంగా గ్రీటింగ్ కార్డులు అమ్మడం మొదలుపెట్టారు. వాలెంటైన్స్ డే కార్డుల పైన అందమైన చిత్రాలతో పాటు కవితలు కూడా ఉండడంతో అవి తక్కువ కాలంలోనే జనాదరణను పొందాయి.
సంబంధిత కథనం