Optical Illusion: ఈ ఆప్టికల్ ఇల్యూషన్లో ఒక పెంగ్విన్ మాత్రం భిన్నంగా ఉంది, అది ఎక్కడుందో పది సెకన్లలో కనిపెట్టి చెప్పండి
Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్లు మీ ఐక్యూ లెవెల్స్‌కు సవాలు విసురుతాయి. వీటిని త్వరగా పరిష్కరిస్తే మీ ఐక్యూ ఎక్కువ అని అర్థం. ఇక్కడ ఇచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్‌ను సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి.
Optical Illusion: ఇక్కడ ఒక ఆప్టికల్ ఇల్యూషన్ ఇచ్చాము. ఈ చిత్రంలో ఎన్నో పెంగ్విన్లు నిలువుగా నిలుచుని ఉన్నాయి. అన్ని ఒకే వైపుకు చూస్తున్నాయి. అన్ని పెంగ్విన్లలో ఒక పెంగ్విన్ మాత్రం కాస్త భిన్నంగా ఉంది. అది ఎక్కడ ఉందో మీరు కనిపెట్టి చెప్పాలి. ఓ పావుగంట సమయం ఇస్తే ఎవరైనా ఇట్టే కనిపెట్టేస్తారు. అప్పుడు మీ తెలివితేటలతో పనేముంది? అందుకే కేవలం 10 సెకండ్లలోనే ఆ పెంగ్విన్ ఎక్కడుందో కనిపెట్టండి. అలా కనిపెడితే మీ మెదడు చాలా తెలివిగా పనిచేస్తుందని అర్థం. అంతేకాదు మీ ఐక్యూ లెవెల్స్ కూడా ఎక్కువే అని అర్థం చేసుకోవాలి. ఇంకెందుకు ఆలస్యం ప్రయత్నించండి.
ఆప్టికల్ ఇల్యూషన్ జవాబు
ఇక్కడున్న పెంగ్విన్లలో భిన్నంగా ఉన్న పెంగ్విన్‌ను ఎవరైతే 10 సెకండ్లలో కనిపెట్టారో వారు చాలా తెలివైన వారని అర్థం. వారి ఐక్యూ లెవెల్ చాలా ఎక్కువ. వారికి సమస్యలను పరిష్కరించే సామర్థ్యం ఎక్కువ ఉందని అర్థం చేసుకోవాలి. 10 సెకన్ల తర్వాత కనిపెట్టిన వారి ఐక్యూ లెవెల్స్ అందరివీ కాస్త తక్కువే అని అర్థం చేసుకోవాలి. ఇక జవాబు విషయానికి వస్తే ఇక్కడ ఆరు అడ్డు వరుసల్లో పెంగ్విన్లు ఉన్నాయి. నాలుగో అడ్డు వరుసలోని ఐదో పెంగ్విన్ ను చూడండి. అన్ని పెంగ్విన్ల కాళ్లు క్రీమ్ కలర్ లో ఉంటే ఈ పెంగ్విన్ కాళ్లు మాత్రం పూర్తిగా తెల్లగా ఉన్నాయి. అదే మీరు కనిపెట్టాల్సిన పెంగ్విన్. తీక్షణంగా చూస్తే ఈ పెంగ్విన్ ను ఇట్టే కనిపించవచ్చు. అది మీ మెదడు, కళ్ళు సమన్వయంగా పనిచేయడంపై ఆధారపడి ఉంటుంది. ఈ రెండూ సమర్థవంతంగా, సమన్వయంగా పనిచేస్తే మీరు ఈ పెంగ్విన్‌ను 10 సెకన్లలోపే కనిపెట్టేస్తారు.
ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లు కళ్ళకు, మెదడుకు మంచి ప్రాక్టీస్ ను ఇస్తాయి. చురుకైన పరిశీలనా నైపుణ్యాలు, అభిజ్ఞా పనితీరును ఈ ఆప్టికల్ ఇల్యూషన్లు పెంచుతాయి. మీ కళ్ళు చూసినది, మీ మెదడు విశ్లేషిస్తుంది. మీ కళ్ళు సరిగ్గా చూస్తేనే మీ మెదడు సరిగా విశ్లేషించగలదు. కాబట్టి ఈ రెండు కలిపే పని చేయాలి. ఈ రెండు కలిపి పని చేయడం విషయంలో మీరు ప్రాక్టీస్ తీసుకోవాలనుకుంటే ప్రతిరోజు ఆప్టికల్ ఇల్యూషన్లను సాల్వ్ చేయడం ప్రారంభించండి.
చిన్నపిల్లల కోసం కూడా ఎన్నో ఆప్టికల్ ఇల్యూషన్లు ఉన్నాయి. వాటిని పిల్లలకు పరిచయం చేయండి. ఇది వారి అభిజ్ఞా సామర్ధ్యాన్ని పెంచుతుంది. వారికి తార్కికంగా ఆలోచించే శక్తిని ఇస్తుంది. అలాగే సమస్యలను పరిష్కరించే తెలివితేటలను అందిస్తుంది. ప్రతిరోజూ ఒక ఆప్టికల్ ఇల్యూషన్ ఇచ్చి వారిని పరిష్కరించమని చెప్పండి. వారికి ఒక టైమ్ పీరియడ్ కూడా ఇవ్వండి. ఆ టైంలో గా ఆప్టికల్ ఇల్యుషన్లు సాల్వ్ చేయాలని చెప్పండి. ఇది వారి మెదడుకు మంచి శిక్షణ అని చెప్పుకోవచ్చు.
టాపిక్