Nude Sleep: సంతానోత్పత్తి పవర్ పెరగాలంటే రాత్రి పూట నిద్రపోవాల్సిన పద్ధతి ఇది-in order to increase fertility power it is necessary to sleep naked at night ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Nude Sleep: సంతానోత్పత్తి పవర్ పెరగాలంటే రాత్రి పూట నిద్రపోవాల్సిన పద్ధతి ఇది

Nude Sleep: సంతానోత్పత్తి పవర్ పెరగాలంటే రాత్రి పూట నిద్రపోవాల్సిన పద్ధతి ఇది

Haritha Chappa HT Telugu
Jul 22, 2024 10:30 AM IST

Nude Sleep: నగ్నంగా పడుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రాత్రిపూట బట్టలు ధరించకుండా నిద్రపోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా, అందంగా ఉంటుందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పురుషుల్లో సంతానోత్పత్తి పవర్ పెరుగుతుంది.

న్యూడ్ స్లీపింగ్ వల్ల లాభాలు
న్యూడ్ స్లీపింగ్ వల్ల లాభాలు (shutterstock)

రాత్రి పూట నిద్ర మన ఆరోగ్యానికి ఎంతో అవసరం. అయితే రాత్రిపూట దుస్తులు ధరించకుండా నగ్నంగా పడుకుంటే ఇంకా మంచిది. ఆడవారితో పోలిస్తే మగవారు ఇలా నగ్నంగా నిద్రపోవడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు. వారిలో సంతానోత్పత్తి శక్తి కూడా పెరుగుతుంది. రాత్రిపూట బట్టలు వేసుకోకుండా నిద్రపోవడం వల్ల వేడి నుంచి ఉపశమనం లభించడమే కాకుండా ఆరోగ్యానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. బట్టలు లేకుండా పడుకోవడం వల్ల శరీరం స్వేచ్ఛగా శ్వాస తీసుకుంటుంది. దీని వల్ల వ్యక్తులకు ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ లభిస్తుంది. ఆ వ్యక్తికి మత్తుగా నిద్ర పడుతుంది. అంతే కాదు రాత్రిపూట దుస్తులు వేసుకోకుండా పడుకోవడం వల్ల చర్మం మెరుపు సంతరించుకుంటుంది. పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. రాత్రి పూట నగ్నంగా నిద్రపోవడం వల్ల ఇంకా ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.

రక్తప్రసరణ

రాత్రి పూట నగ్నంగా నిద్రపోవడం వల్ల చర్మం రిలాక్స్ అవుతుంది. చర్మం శ్వాస తీసుకోగలుగుతుంది. ఇది శరీరమంతా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అదే సమయంలో బిగుతైన దుస్తులు ధరించి నిద్రపోవడం వల్ల రక్తప్రసరణపై ప్రభావం పడుతుంది.

ఆడవారిలో…

రోజంతా మహిళలు బిగుతైన లోదుస్తులు ధరించే ఉంటారు. దీని వల్ల వారిలో అనేక రకాల బ్యాక్టీరియా పెరగడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా యోని భాగంలో కూడా బ్యాక్టిరియాలు పెరగవచ్చు. ఇది ఆరోగ్యానికి హానికరం. అటువంటి పరిస్థితిలో, లోదుస్తులు ధరించకుండా నిద్రపోవడం వల్ల యోని వద్ద పిహెచ్ స్థాయిని సవ్యంగా ఉంటుంది. వ్యాధి సంక్రమణ ప్రమాదం కూడా బాగా తగ్గుతుంది.

మెటబాలిజంను మెరుగుపరుస్తుంది

బట్టలు లేకుండా నిద్రపోవడం కూడా శరీర జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మెటబాలిజం వల్ల బరువు పెరగదు. దీని వల్ల ఊబకాయానికి సంబంధించిన సమస్యలు ఉండవు. ముఖంపై కాంతి పెరుగుతుంది.

భార్యాభర్తలు…

భాగస్వామితో మంచంపై దుస్తులు లేకుండా పడుకోవడం ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. ఇది దంపతుల బంధాన్ని బలోపేతం చేస్తుంది. నిజానికి బట్టలు వేసుకోకుండా నిద్రపోతున్నప్పుడు ఇద్దరి చర్మం ఒకదానికొకటి తాకినప్పుడు శరీరం నుంచి ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. దీనివల్ల టెన్షన్, అలసట తొలగిపోవడంతో పాటు రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.

బిగుతైన లోదుస్తులు ధరించడం వల్ల పురుషుల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. అటువంటి పరిస్థితిలో, రాత్రి పడుకునేటప్పుడు ఎల్లప్పుడూ లోదుస్తులను తొలగించండి. ఇలా చేయడం వల్ల స్పెర్మ్ కౌంట్ కంట్రోల్ అవుతుంది. లోదుస్తులు ధరించి నిద్రపోవడం పురుషుల వృషణాలకు మంచిది కాదు. ఇది వారి సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది.

మంచి నిద్ర

నగ్నంగా నిద్రపోవడం వల్ల మంచి నిద్ర వస్తుంది. నిద్ర లేమి వల్ల రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. బట్టలు వేసుకోకుండా నిద్రపోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది, ఇది గాఢ నిద్ర పట్టేలా చేస్తుంది. కళ్ళ క్రింద నల్లటి వలయాల సమస్య ఉండదు.

Whats_app_banner