parenting: పిల్లల పెంపకంలో ఆచీ.. తూచీ..-impact on children future from parenting style ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Impact On Children Future From Parenting Style

parenting: పిల్లల పెంపకంలో ఆచీ.. తూచీ..

Koutik Pranaya Sree HT Telugu
May 09, 2023 07:52 PM IST

parenting: పిల్లలు భావోద్వేగాలను అంగీకరించడం నుండి ఆలోచించి స్పందించడం నేర్చుకోవడం వరకు, తల్లిదండ్రుల పెంపకం మీద ఆధారపడి ఉంటుంది.

Impact of parenting on the future of children
Impact of parenting on the future of children (Pexels)

ఆరోగ్యకరమైన పిల్లల పెంపకం, పిల్లల ప్రవర్తన మీద చాలా ప్రభావం చూపుతుంది. వాళ్లు పెద్దయ్యాక వాళ్లుండే బంధంలో ఎలా మసులుకోవాలో తెలుస్తుంది. ఇంట్లో తల్లిదండ్రుల ప్రవర్తన వాళ్లు పెద్దయ్యాక నేరుగా ప్రభావం చూసుతుంది. కోపం వచ్చినపుడు పిల్లల ముందు అరవకుండా మీ భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకోవాలి. ఆరోగ్య కరమైన సంభాషణలు మాత్రమే పిల్లల ముందు చేయాలి. పేరెంటింగ్ ఎలా ఉండాలో సైకాలజిస్ట్ నికోల్ తన ఇన్స్టాగ్రామ్ లో తెలియజేశారు.

హద్దులు తెలియాలి:

ఏ మనిషీ ప్రతీ పనినీ చెయ్యలేరు. ప్రతి దానికి ఒక హద్దుంటుందని వాళ్లకు తెలియాలి. మీరు చేయలేని పనైతే కారణంతో సహా స్పష్టంగా చెప్పండి. వాళ్లు పెద్దయ్యాక ఎదుటి మనిషి నుంచి ఎంత వరకూ ఆశించొచ్చో అనే విషయంలో హద్దుల గురించి తెలుస్తాయి.

క్షమాపణ:

మీరు మీ పిల్లల విషయంలో పొరపాటున ఏదైనా తప్పు చేస్తే క్షమించమని అడగండి. ఒక చిన్న సారీ చెప్పండి .ఇదే లక్షణం వాళ్లకూ అలవరుతుంది. తప్పును ఒప్పుకునే మనసుంటుంది.

భావోద్వేగాలు:

పిల్లలు మీతో ఏదైనా పంచుకునే స్వతంత్రం ఇవ్వాలి. వాళ్లు సాధించిన విజయాలు మాత్రమే ముఖ్యం కాదని తెలియజెప్పాలి. దానివల్ల చక్కని మనస్తత్వం ఏర్పడుతుంది.

స్పందన:

మీకు ఎంత కోపమొచ్చినా కూడా మీ పిల్లలకు అర్థమయ్యేలా నిదానంగా వివరించి చెప్పాలి. అలాగే పెద్దయ్యాక వాళ్లు కూడా ప్రశాంతంగా మాట్లాడటం, ఏదైనా విషయానికి ఆచితూచి నిదానంగా స్పందించడం నేర్చుకుంటారు.

మద్దతు:

పిల్లలకు ప్రతి విషయంలో మీరు తోడున్నారనిపించాలి.వాళ్లకు కష్టాలొచ్చినపుడు మీరు ఆదుకుంటారనే నమ్మకం కలిగించాలి. అది మాటల్లో కన్నా మీ చేతల్లోనే చూయించాలి.

WhatsApp channel