Optical Illusion: మీ చూపు చురుకైనదైతే కింద ఇచ్చిన ఆప్టికల్ ఇల్యుషన్‌లో 23 నెంబరు ఎక్కడుందో పది సెకన్లలో చెప్పండి
Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్లను సాధించడం చాలా సవాలుగా ఉంటుంది. అందుకే మరొక ఆసక్తికరమైన సవాలుతో మీ ముందుకు వచ్చాము. ఇక్కడ ఇచ్చిన ఆప్టికల్ ఇల్యుషన్లో 23 నెంబర్ ఎక్కడుందో కనిపెట్టి చెప్పండి.
ఆప్టికల్ ఇల్యూషన్లను సాధించడం మీకు ఇష్టమా? అయితే మీలాంటి వాళ్ల కోసమే మేము ఇక్కడ ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌ను అందించాము. ఈ గజిబిజి నెంబర్లు అక్షరాల మధ్యలో 23 అనే నెంబర్ ఒకచోట ఇరుక్కొని ఉంది. అది ఎక్కడుందో మీరు కనిపెట్టి చెప్పాలి. ఎక్కువ సమయం ఇస్తే ఎవరైనా కనిపెట్టేస్తారు. కేవలం 10 సెకన్లలోనే మీరు 23 నెంబరును కనిపెడితే మీ చూపు చాలా చురుకైనదని అర్థం చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం పని మొదలు పెట్టండి.
ఆప్టికల్ ఇల్యూషన్ జవాబు
ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లను కేవలం 10 సెకన్లు సాధించిన వారికి కంగ్రాట్స్. 23 నెంబర్ కోసం ఇంకా వెతుకుతున్న వారి కోసమే మేమిక్కడ జవాబు ఇచ్చాము. ఈ ఆప్టికల్ ఇల్యూషన్లో రెండో అడ్డు వరుసలో చివరి నుంచి రెండో స్థానంలోనే 23 నెంబర్ ఉంది. మీరు కాస్త నిశితంగా పరిశీలిస్తే ఈ నెంబర్ చాలా సులువుగా దొరికేస్తుంది. ఎందుకంటే అన్ని Z అక్షరాల్లా ఉన్నాయి. కాబట్టి Z కి 2 కి మధ్య తేడాను మీ చూపు గుర్తిస్తే చాలు, ఆన్సర్ ఇట్టే దొరికేస్తుంది. అలా గుర్తించడంలోనే మీ సామర్ధ్యత ఆధారపడి ఉంటుంది. మెదడు కళ్ళు కలిసే ఈ 23 నెంబర్ ను కనిపెట్టాలి. కాబట్టి ఆ రెండు అనుసంధానంగా పనిచేస్తే చాలు.
ఆప్టికల్ ఇల్యూషన్లు మన మెదడుకు కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మనం ఏదైనా సాధించాలంటే కన్ను, మెదడు సమన్వయంతో పని చేయడం అత్యవసరం. ఆ రెండూ సమన్వయంతో పని చేయాలంటే వాటికి ప్రతిరోజూ శిక్షణ అవసరం. ఆప్టికల్ ఇల్యూషన్లు, బ్రెయిన్ టీజర్లు వంటివి మంచి శిక్షణను అందిస్తాయి. కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటివి పరిష్కరిస్తూ ఉండండి. మీ మెదడు ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి.
ఆప్టికల్ ఇల్యుషన్లో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఎంతోమంది వీటిని ఇష్టపడుతున్నారు. వీటి పేరుతో ఇన్‌స్టాగ్రామ్ పేజీలు కూడా ఎన్నో ఉన్నాయి. మీకు ఆసక్తి ఉంటే అలాంటి ఇన్‌స్టాగ్రామ్ పేజీల్ని ఫాలో అయితే ప్రతిరోజు వీటిని సాధించే అవకాశం ఉంటుంది. ఇక వీటి చరిత్ర విషయానికి వస్తే ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది. ప్రస్తుతం గ్రీకుదేశాన్ని ఆప్టికల్ ఇల్యూషన్‌లా పుట్టిల్లుగా చెప్పుకుంటున్నారు. అక్కడే వీటి ఆనవాళ్లు లభించాయని అంటున్నారు. కొన్ని పురాతన దేవాలయాలపై ఆప్టికల్ ఇల్యూషన్ల ఆనవాళ్లు కనిపించినట్టు చరిత్రకారులు గుర్తించారు. అంతకుమించి ఆర్టికల్ ఇల్యూషన్‌లా చరిత్ర బయటపడలేదు.