Kids Health: మీ చంటి పిల్లలకు బొటనవేలు నోట్లో పెట్టుకునే అలవాటు ఉంటే వెంటనే మానిపించండి, ఈ ఇబ్బందులు మొదలవ్వచ్చు-if your baby has a habit of thumb sucking stop it immediately this may cause problems ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kids Health: మీ చంటి పిల్లలకు బొటనవేలు నోట్లో పెట్టుకునే అలవాటు ఉంటే వెంటనే మానిపించండి, ఈ ఇబ్బందులు మొదలవ్వచ్చు

Kids Health: మీ చంటి పిల్లలకు బొటనవేలు నోట్లో పెట్టుకునే అలవాటు ఉంటే వెంటనే మానిపించండి, ఈ ఇబ్బందులు మొదలవ్వచ్చు

Haritha Chappa HT Telugu
Jan 21, 2025 06:34 PM IST

చాలా మంది పిల్లలకు బొటనవేలు నోట్లో పెట్టుకుని నిద్రపోయే అలవాటు ఉంటుంది. తల్లిదండ్రులు ఆ అలవాటను మానిపించరు. పిల్లలకు ఈ అలవాటుతో కలిగే దుష్ప్రభావాలను పేరెంట్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లలకు బొటనవేలు నోట్లో పెట్టుకునే అలవాటు ఎందుకు ఉంటుంది? దాని వల్ల కలిగే నష్టాలేంటో తెలుసుకోండి.

నోట్లో బొటన వేలు పెట్టుకోవడం ప్రమాదమా?
నోట్లో బొటన వేలు పెట్టుకోవడం ప్రమాదమా? (shutterstock)

చాలా మంది చిన్న పిల్లలకు బొటన వేలు నోట్లో పెట్టుకుని నిద్రపోయే అలవాటు ఉంటుంది. అలాగే ఆడుకుంటున్నప్పుడు కూడా బొటన వేలు నోట్లో పెట్టుకుంటారు. ఆ వేలు బయటకు తీసేస్తే ఏడవడం మొదలుపెడతారు. మీ చుట్టూ ఎంతో మంది పిల్లలు ఇలా బొటనవేలు చప్పరించడం చూసే ఉంటారు. తల్లిదండ్రులు నోట్లో వేలు పెట్టుకోవడం వల్ల నిశ్శబ్దంగా ఉన్నారన్న ఉద్దేశంతో అలా వదిలేస్తారు. కానీ చాలా కాలం పాటు ఈ అలవాటు కొనసాగితే పిల్లలకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

yearly horoscope entry point

పిల్లల బొటనవేలును పీల్చడం సాధారణ పనిలాగే కనిపిస్తుంది, అయితే తల్లిదండ్రులు మాత్రం కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ అలవాటుతో ముడిపడి ఉన్న సమస్యలను తల్లిదండ్రులు తెలుసుకోవాలి. అసలు కొంతమంది పిల్లలకు బొటనవేలు నోట్లో పెట్టుకుని చప్పరించే అలవాటు ఎందుకు ఉంటుంది? అనే విషయం చాలా మందికి తెలియదు.

పిల్లలు బొటనవేలు ఎందుకు చప్పరిస్తారు?

చాలాసార్లు పిల్లలకు ఆకలిగా అనిపించినప్పుడు బొటనవేలు నోట్లో పెట్టుకుని చప్పరించడం ప్రారంభిస్తారు. తల్లిపాలు వెంటనే పడితే వారు బొటన వేలు పెట్టుకోవడం మానేస్తారు. అలా వదిలేస్తే వారు ఆకలేసినప్పుడు బొటనవేలు చప్పరిస్తూ ఉంటారు. తల్లి పాలు సమయానికి అందకపోయినా పిల్లలు బొటనవేలును చప్పరించవచ్చు.

- బొటనవేలు చప్పరించడం వల్ల పిల్లలు తమకు తాము సురక్షితంగా ఉన్నట్టు ఫీలవుతారు.

పిల్లలు ఒత్తిడికి గురైనప్పుడు కూడా వారి బొటనవేలు, ఇతర వస్తువులను నోట్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. వారు ఆందోళనకు గురైనప్పుడు ఒత్తిడిని తగ్గించడానికి, శాంతపరచడానికి సహాయపడుతుంది.

చాలా మంది పిల్లలు నాలుగు సంవత్సరాల వయస్సు వచ్చేసరికి లేదా వారి దంతాలు పెరిగిన తరువాత బొటనవేలు చప్పరించే అలవాటును వదిలివేస్తారు. అయితే ఈ అలవాటు ఇలాగే కొనసాగితే పిల్లలకు అనేక సమస్యలు వస్తాయి.

1. గోరు చుట్టూ ఉన్న చర్మం గోరు గట్టిగా రాయిలాగా మారిపోతుంది.

2. దంతాల అమరిక కూడా మారిపోతుంది. ఎగువ, దిగువ, ముందు దంతాల మధ్య దూరం పెరిగిపోతుంది.

3. బొటనవేలు చప్పరించే పిల్లల బొటనవేలు సన్నగా, పెదవులు మందంగా ఉంటాయి.

4. బొటనవేలు చప్పరించే పిల్లలకు తరచుగా పొట్ట ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఎందుకంటే పిల్లలు రోజంతా ఆడుకుంటారు. ఇలా చేసేటప్పుడు చాలా వస్తువులను తన చేతులతో పట్టుకుంటాడు. దీని వల్ల వారి చేతుల్లో అనేక రకాల సూక్ష్మక్రిములు అంటుకుంటాయి, ఇవి బొటనవేలు పీల్చినప్పుడు నోటి ద్వారా కడుపులోకి వెళతాయి.

5. బొటనవేలు పీల్చే పిల్లలు తినడానికి, త్రాగడానికి అయిష్టంగా ఉంటారు. అలాంటి పిల్లలు తమ బొటనవేలును ఎప్పుడూ చప్పరిస్తూనే ఉండాలని కోరుకుంటారు. దీనివల్ల వారి శారీరక ఎదుగుదల కూడా సక్రమంగా జరగదు.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Whats_app_banner

సంబంధిత కథనం