Monday Motivation: మీ కలలు నిజం కావాలంటే ఈ రోజు నుంచే పని మొదలుపెట్టండి, విజయానికి పునాది వేయండి
Monday Motivation: సోమవారం వచ్చిందంటే చాలా మంది నీరసపడిపోతారు. మళ్లీ ఆఫీసులు, పనులు మొదలుపెట్టాలని బాధపడిపోతారు. అలా ఉంటే ఆ వారమంతా నీరసంగానే సాగుతుంది.
Monday Motivation: మోటివేటెడ్ మండే.... సోమవారం మీరు ఎంత ప్రేరణ పొందితే అంత మంచిది. సోమవారం ఉత్సాహంగా ప్రారంభించక పోతే ఆ వారం అంతా నీరసంగానే ఉంటారు. కాబట్టి సోమవారం సానుకూలంగా మేల్కోవడానికి ప్రయత్నించండి. మీ తాజా ప్రారంభానికి సోమవారమే ఆరంభదినం. మీ కలలను వెంటాడడానికి సోమవారమే మొదలు.మీరు ఎంత పాజిటివ్ గా ఆలోచిస్తేనే ఆ వారం అంతా మీరు ఉత్సాహంగా పనులు చేయగలుగుతారు.

సోమవారాన్ని ఒక ఖాళీ కాన్వాస్‌గా అనుకోండి... మీరే ఆ ఖాళీ కాన్వాస్ పై ఒక కళాఖండాలను రూపొందించండి. అంటే ఆ వారమంతా చేయాల్సిన పనులను, సాధించాల్సిన విజయాలను సోమవారం డిసైడ్ చేసుకోండి. అప్పుడు సోమవారం మీకు ఉత్సాహంగా అనిపిస్తుంది. సృజనాత్మకంగా, స్ఫూర్తిదాయకంగా మారుతుంది. సానుకూలమైన, స్ఫూర్తిదాయకమైన వాక్యాలను చదవడం ద్వారా మీ ప్రయాణాన్ని ప్రారంభించండి. సందేహం లేకుండా సోమవారం మీకు మంచి ఉత్తేజాన్ని ఇస్తుంది.
శనివారం. ఆదివారం రెండు రోజులు సెలవు. తర్వాత సోమవారం వస్తుంది. ఆ రోజు పనిచేయాలన్నా, ఆఫీస్ కి వెళ్ళాలన్నా చాలా బద్దకంగా ఉంటుంది. అందుకే మండే బ్లూస్ ఎంతోమందిని కమ్మేస్తాయి. ఆ రోజు మీరు పని చేయకపోతే వారమంతా అలాగే సాగుతుంది. సోమవారాలు చాలామందికి మానసికంగా కష్టపరంగా అనిపిస్తాయి. వర్క్ మోడల్ లోకి రావడం కష్టంగా భావిస్తారు. అలాంటివారు స్ఫూర్తి నింపే వాక్యాలను చదువుతూ ఉండాలి.
సోమవారం ఉదయం లేచిన వెంటనే ఒక చిన్న సానుకూల ఆలోచన చేయండి. ఆ రోజంతా మీకు ఉత్సాహంగా సాగుతుంది. మీ కలలను నిజం చేసుకోవాలంటే ఎన్నో సోమవారాలను దాటి రావాలి. కాబట్టి ధైర్యంగా ముందడుగు వేయండి. భవిష్యత్తులో మీరు ఎలా ఉండాలో ఈరోజు మీరు చేసే పని పైనే ఆధారపడి ఉంటుంది. కొంతమంది విజయం గురించి కలలు మాత్రమే కంటారు. మరికొందరు సోమవారం ఉదయం లేచి ఆ పనిని సాధించేందుకు అడుగులు వేస్తారు.
నీ కలలు నిజం అవ్వాలన్నా, విజయం సాధించాలన్నా... ముందుగా మీరు చేయాల్సిన పని నిద్ర నుంచి మేల్కోవడం. సోమవారం నిద్ర నుంచి మేల్కోవడానికి మీరు కష్టపడితే ఇక విజయాన్ని ఎలా సాధించగలరు. వారమంతా మంచి ఊపుతో మీరు పని చేయాలంటే.. సోమవారం ఆనందంగా మీరు మొదలుపెట్టాలి. సోమవారం ఉదయం మీ ఆలోచనలు మీ వారాన్ని సెట్ చేస్తాయి. కాబట్టి సోమవారమే మీరు ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండాలి. సంతృప్తికరంగా, సంతోషకరమైన జీవితాన్ని గడపాలి. ఆ వారం అంతా మీరు అలానే జీవించేందుకు అవకాశం ఉంటుంది.
ప్రతిక్షణం ఒక కొత్త ప్రారంభంగా భావించండి. సోమవారం నాడు ప్రారంభమయ్యే ఆ క్షణం మీకు జీవితంలో ఎన్నో మంచి మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉంది. సోమవారాన్ని చూసి భయపడడం మానేయండి. ధైర్యంగా ఉండండి. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, ఆ భయం పై విజయం సాధించడం.