Hair accessories: ఇండియన్ లుక్‌లోనే అందంగా మెరిసిపోవాలనుంటే ఈ హెయిర్ యాక్సెసరీలు ట్రై చేయండి-if you want to shine beautifully in the indian look try these hair accessories ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hair Accessories: ఇండియన్ లుక్‌లోనే అందంగా మెరిసిపోవాలనుంటే ఈ హెయిర్ యాక్సెసరీలు ట్రై చేయండి

Hair accessories: ఇండియన్ లుక్‌లోనే అందంగా మెరిసిపోవాలనుంటే ఈ హెయిర్ యాక్సెసరీలు ట్రై చేయండి

Haritha Chappa HT Telugu
Aug 12, 2024 09:30 AM IST

Hair accessories: ఒక చిన్న హెయిర్ యాక్సెసరీ జడ అందాన్ని ఎన్నో రెట్లు పెంచుతుంది. ఈ రోజుల్లో ఎలాంటి హెయిర్ యాక్సెసరీలు ట్రెండ్ అవుతున్నాయో, వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.

హెయిర్ స్టైల్
హెయిర్ స్టైల్

జుట్టును అందానికి సూచికగా భావిస్తారు. జుట్టును అలంకరించే సంప్రదాయం ఈనాటిది కాదు,  శతాబ్దాల నాటిది. రామాయణంలో కూడా జుట్టుకు పెట్టే చూడామణి ప్రస్తావన ఉంది. పురాతన కాలం నుంచి బంగారు, రత్నాలతో కూడిన ఆభరణాలను వివాహిత మహిళలు జుట్టుకు అలంకరిస్తూ ఉంటారు. మహాభారతంలో కూడా ద్రౌపది తన జుట్టుకు ఉన్న చూడామణిని తొలగించి తన జుట్టును ముడి వేయనని  ప్రతిజ్ఞ చేసింది.  ఇలా జుట్టును అలంకరించే అలవాటు సింధు లోయ సంప్రదాయంలో కూడా ఉందని తెలుస్తోంది. వారిలో జుట్టును కర్లింగ్ చేసి బన్ తయారు చేసే ట్రెండ్ ఉండేదని ఆనాటి శిల్పాలు చెబుతున్నాయి. 

చరిత్ర చెబుతున్న ప్రకారం హెయిర్ యాక్సెసరీలు శతాబ్దాలుగా ట్రెండ్ లో ఉన్నాయి. ఇప్పుడు హెయిర్ ఎక్స్టెన్షన్స్ అధికంగా వాడుతున్నారు. జుట్టు రాలిపోవడం, పల్చటి జుట్టు సమస్యతో సతమతమవుతున్న మహిళలకు ఈ హెయిర్ ఎక్స్‌టెన్షన్  ఒక వరమనే చెప్పాలి. ఇది వాడడం వల్ల మీ జుట్టుకు రసాయనాలను వర్తించాల్సిన అవసరం కూడా లేదు. హెయిర్ స్టైలిస్ట్ సమీర్ ఖాన్ మాట్లాడుతూ ఈ రోజుల్లో నిజమైన జుట్టుతో తయారు చేసిన పువ్వులు, ఆకులు, రొట్టెలు, బన్లు కూడా చాలా ట్రెండ్ లో ఉన్నాయని చెప్పారు. దీనిలో, మీరు మీ జుట్టుకు సరిపోయేలా యాక్ససరీలను అప్లై చేయవచ్చు.  

మిర్రర్ వర్క్

ఈ రోజుల్లో సొగసైన హెయిర్ స్టైల్స్ ట్రెండ్ బాగా కనిపిస్తోంది. ఈ స్లీక్ లుక్ లో మిర్రర్ వర్క్ చాలా అందంగా కనిపిస్తుంది. ఇందులో డైమండ్ లేదా గుండ్రటి ఆకారంలో ఉండే అద్దాలను వెంట్రుకలకు అతికిస్తారు. అదేవిధంగా, ముత్యాల స్టిక్కర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.  జుట్టులో వివిధ సైజుల ముత్యాలను అతికించడం ద్వారా  అందంగా మారవచ్చు. మంచి విషయం ఏంటంటే ఈ తరహా లుక్ కోసం పెద్దగా డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.

ఈ రోజుల్లో హెయిర్ స్టైలింగ్‌లో రెట్రో లుక్‌ను ఇష్టపడుతున్నారు.  ఈ రెట్రో లుక్ ఇచ్చేందుకు స్కూంచీ, విల్లు, రిబ్బన్ వంటి హెయిర్ యాక్సెసరీలు ఉంటాయి. ప్రత్యేకత ఏంటంటే ఈ యాక్సెసరీలన్నీ వస్త్రంతో తయారు చేసినవే. 

గోటా కూడా మంచి హెయిర్ యాక్సెసరీ.  లేస్‌ను జడ, బన్ లేదా ఫ్రంట్ వేరియేషన్ లో చేర్చి స్టైలింగ్ లో భాగం చేశారు. ఈ తరహా స్టైల్ లో మరే ఇతర రకాల హెయిర్ యాక్సెసరీలను అప్లై చేయాల్సిన అవసరం లేదు.  మీ హెయిర్ స్టైల్ చాలా చౌకగా, అద్భుతంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ట్రెడిషనల్ లుక్ కావాల్సిన వారికి ఇలాంటి అందమైన హెయిర్ స్టైల్ ఫాలో అవుతున్నారు.

టాపిక్