నోరు చప్పగా అనిపిస్తే మసాలా పులిహోర వండితే రుచిగా ఉంటుంది, ఇది ఎలా చేయాలంటే-if you want to eat spicy food cook masala pulihora like this how to do it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  నోరు చప్పగా అనిపిస్తే మసాలా పులిహోర వండితే రుచిగా ఉంటుంది, ఇది ఎలా చేయాలంటే

నోరు చప్పగా అనిపిస్తే మసాలా పులిహోర వండితే రుచిగా ఉంటుంది, ఇది ఎలా చేయాలంటే

Haritha Chappa HT Telugu

ఎంతో మంది ఇళ్లల్లో అన్నం మిగిలిపోతూ ఉంటుంది. ఆ అన్నాన్ని నిమ్మ పులిహోరగా, ఎగ్ రైస్ గా వండుకుంటారు. మీకు స్పైసీగా తినాలనిపిస్తే ఓసారి మసాలా పులిహోర వండి చూడండి. ఇలా చాలా రుచిగా ఉంటుంది. ఎన్నో పోషకాలను కూడా అందిస్తుంది.

మసాలా పులిహోర రెసిపీ

వాతావరణం చల్లబడితే చాలు కారంగా ఏదైనా తినాలనిపిస్తుంది. ఇక్కడ మేము కొత్తగా మసాలా పులిహోర ఎలా చేయాలో చెప్పాము. ఇంట్లో అన్నం మిగిలిపోవడం జరుగుతూనే ఉంటుంది. అలా మిగిలిపోయిన అన్నంతోనే మసాలా పులిహోర వండుకోవచ్చు. కేవలం ఐదు నుండి పది నిమిషాల్లో తయారుచేసే ఈ వంటకం అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది.

మధ్యాహ్నం లేదా రాత్రి అన్నం మిగిలిపోయినప్పుడు ఇది వండేందుకు ప్లాన్ చేయండి. దీన్ని బ్రేక్ ఫాస్ట్ గానే కాకుండా లంచ్, డిన్నర్ కు కూడా తయారు చేసుకోవచ్చు.ఈ రెసిపీ చాలా ఈజీ. ఈ మసాలా పులిహోర ఎలా వండాలో తెలుసుకోండి.

మసాలా పులిహోర రెసిపీకి కావాల్సిన పదార్థాలు

వండిన అన్నం - రెండు కప్పులు

పచ్చిమిర్చి తరుగు - ఒక టీ స్పూను

ఉప్పు - రుచికి తగినంత

ఆవాలు - అర టీ స్పూను

పసుపు - అర టీ స్పూను

కారం - అర టీ స్పూను

పచ్చి శెనగపప్పు - అర టీ స్పూను

కొత్తిమీర తరుగు - ఒక స్పూను.

కరివేపాకులు - గుప్పెడు

నూనె - ఒక స్పూను

జీలకర్ర - ఒక స్పూను

పల్లీలు - గుప్పెడు

ఉల్లిపాయలు - ఒకటి

మసాలా పులిహోర రెసిపీ

  1. మిగిలిన అన్నాన్ని ఒక ప్లేటులో వేసి పొడిపొడిగా వచ్చేలా ఆరబెట్టుకోండి.
  2. ఆ అన్నంలోనే రుచికి తగినంత ఉప్పు, కారం వేసి బాగా కలపాలి.
  3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె లేదా నెయ్యి వేయాలి.
  4. నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత శనగపప్పు, పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకులు, వేరుశెనగలు వేసి బాగా వేయించాలి.
  5. అందులో పల్లీలను కూడా వేయించాలి.
  6. ఇప్పుడు ఈ మిశ్రమంలో ముందు కారం కలిపి పెట్టుకున్న అన్నాన్ని వేసి బాగా కలుపుకోవాలి.
  7. ఉల్లిపాయలను సన్నగా తరిగి ఈ పులిహోరలో వేసి కలుపుకోవాలి.

8. పైన కొత్తిమీర తరుగును వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.

9. అంతే టేస్టీ మసాలా పులిహోర రెడీ అయినట్టే. దీన్ని రైతాతో తింటే అదిరిపోతుంది.

మసాలా పులిహోరను బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ లకు కూడా తినవచ్చు.ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈ మసాలా పులిహోరను తయారు చేసి ఆస్వాదించవచ్చు. పిల్లలకు లేదా మీ ఆఫీస్ లంచ్ బాక్స్ లకు కూడా ఇది బెస్ట్ రెసిపీ.

పెద్దలు స్పైసీ తినడానికి ఇష్టపడతారు. కానీ పిల్లలకు మాత్రం ఇది కాస్త స్పైసీగా అనిపించవచ్చు. కాబట్టి పిల్లల కోసం తయారు చేసుకోవాలనుకుంటే పచ్చిమిర్చి వేయకండి. నూనెకు బదులు నెయ్యి వాడినా స్పైసీ చాలా వరకు తగ్గుతుంది.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.