ఐరన్ కావాలంటే మాంసాహారం మాత్రమే తినాలని లేదు, ఈ శాకాహారాలను తిన్నా చాలు-if you want iron you dont have to eat only meat just eat these vegetarian foods ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  ఐరన్ కావాలంటే మాంసాహారం మాత్రమే తినాలని లేదు, ఈ శాకాహారాలను తిన్నా చాలు

ఐరన్ కావాలంటే మాంసాహారం మాత్రమే తినాలని లేదు, ఈ శాకాహారాలను తిన్నా చాలు

Haritha Chappa HT Telugu

ఇనుము పొందడానికి మీరు మాంసం మాత్రమే తినాల్సిన అవసరం లేదు. ఎన్నో శాకాహారాలు కూడా ఉన్నాయి. వీటిని ప్రతిరోజూ తినడం ద్వారా శరీరానికి కావాల్సినంత ఇనుమును పొందవచ్చు. ఐరన్ రిచ్ ఫుడ్స్ గురించి ఇక్కడ ఇచ్చాము.

ఐరన్ నిండుగా ఉండే శాకాహారాలు

ఇనుము శరీరానికి అత్యవసరమైన పోషకం. ఇది లోపిస్తే ఎన్నో సమస్యలు వస్తాయి. చాలామంది ఐరన్ కావాలంటే మాంసాహారం తినాలని అనుకుంటారు. మీట్ లేకుండా మీ శరీరంలో ఐరన్ కంటెంట్‌ను పెంచాలనుకుంటే ఎలాంటి శాకాహారాలు తినాలో తెలుసుకోండి.

శాఖాహారాన్ని మాత్రమే ఇష్టపడేవారు, ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకునే వారి కోసమే ఈ ఆహారాల జాబితా ఇచ్ాచము. వీటిలో అన్నీ ప్రతిరోజూ తినవచ్చు. వీటిలో ఇనుము సమృద్ధిగా ఉంటుంది. అవి ఏమిటో తెలుసుకోండి.

ఉడికించిన పాలకూర

అరకప్పు ఉడికించిన పాలకూరలో సుమారు 3.2 మి.గ్రా ఐరన్ ఉంటుంది. ఇందులో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది మీ శరీరం ఐరన్ పోషకాలను బాగా గ్రహించడానికి సహాయపడుతుంది. మీరు దీన్ని సూప్ లు, కూరగా వండుకుని తినవచ్చు.

టోఫు

టోఫును సోయాతో చేస్తారు. ఇది పనీర్ లాగే ఉంటుంది. పనీర్ కు బదులు టోఫును వాడవచ్చు. సూపర్ మార్కెట్లలో ఇది అందుబాటులో ఉంటాయి. అరకప్పు టోఫులో 3.4 మి.గ్రా ఇనుము ఉంటుంది. ఇది మొక్కల ఆధారిత ప్రోటీన్ సప్లిమెంట్. దీన్ని మీరు గ్రేవీలు, సలాడ్లు, స్టిర్ ఫ్రైస్ తయారు చేసుకోవచ్చు.

గుమ్మడికాయ గింజలు

గుప్పెడు కాల్చిన గుమ్మడికాయ విత్తనాలలో 2.5 మి.గ్రా ఇనుము ఉంటుంది. మీరు దీనిని స్మూతీలు లేదా పెరుగుతో జత చేయవచ్చు. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, జింక్ కూడా ఉంటాయి. వీటిని కాల్చకుండా నేరుగా కూడా తినవచ్చు.

చిక్కుళ్ళు

అరకప్పు ఉడికించిన కాయధాన్యాలలో 3.3 మి.గ్రా ఐరన్ ఉంటుంది. సాంబార్, గ్రేవీలు, సలాడ్స్ వీటితో తయారు చేసుకోవచ్చు. చిక్కుళ్ళలో ప్రోటీన్లు, ఫైబర్స్ కలిగి ఉంటాయి. శాఖాహార ఆహారాలను మాత్రమే ఇష్టపడేవారికి ఇది గొప్ప ఎంపిక.

వండిన శనగలు

అరకప్పు ఉడికించిన శనగల్లో 2.4 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. ఈ గింజలతో గ్రేవీ తయారు చేసుకోవచ్చు. పూరీకి సరిపోయే శనగ మసాలా తయారు చేసుకోవచ్చు. ఉడికించి తినవచ్చు. స్నాక్స్ గా తినవచ్చు. ఇందులో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి.

డార్క్ చాక్లెట్

మీరు ఇనుమును తీసుకోవాలంటే ప్రతిరోజూ చిన్న ముక్క డార్క్ ఛాక్లెట్ తిన్నా చాలు. అందులో 3.4 మి.గ్రా ఇనుము ఉంటుంది. మీలో 70 శాతం కంటే ఎక్కువ కోకో ఉండేలా చూసుకోండి. ఇది మీ శరీరానికి చాలా మంచిది.

క్వినోవా

ఒక కప్పు క్వినోవాలో 2.8 మి.గ్రా ఇనుము ఉంటుంది. ఇది పూర్తి ప్రోటీన్. గ్లూటెన్ లేనిది. దీనిని మీ వివిధ భోజనాలతో తినవచ్చు. మీరు దీనిని బియ్యం బదులుగా తినవచ్చు. మీరు దీనిని సలాడ్లు, ఉప్మాలో కలుపుకుని తినవచ్చు.

జీడిపప్పులు

జీడిపప్పులో 1.9 మిల్లీగ్రాముల ఇనుము ఉంటుంది. మీరు దీన్ని వేయించి తినవచ్చు. లేదా అల్పాహారంలో భాగంగా తినవచ్చు. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం, ప్రోటీన్లు కూడా ఉంటాయి.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.