ఫిట్ నెస్, టేస్ట్ రెండూ కావాలంటే నూనె లేకుండా మామిడికాయ పచ్చడి తయారు చేసుకోండి.. ఎలాగో ఇక్కడుంది-if you want both fitness and taste make mango chutney without oil heres how ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  ఫిట్ నెస్, టేస్ట్ రెండూ కావాలంటే నూనె లేకుండా మామిడికాయ పచ్చడి తయారు చేసుకోండి.. ఎలాగో ఇక్కడుంది

ఫిట్ నెస్, టేస్ట్ రెండూ కావాలంటే నూనె లేకుండా మామిడికాయ పచ్చడి తయారు చేసుకోండి.. ఎలాగో ఇక్కడుంది

Ramya Sri Marka HT Telugu

నూనె లేకుండానే ఆవకాయ పచ్చడి తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? ఇది ఇతర రెసిపీలకన్నా భిన్నంగా ఉంటుంది. చాలా రుచికరంగా కూడా ఉంటుంది. దీన్ని తినడం వల్ల ఆవకాయ రుచిని ఆస్వాదించడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. దీన్ని తయారు చేయడం ఎలాగో తెలుసుకుందాం రండి.

నూనె లేకుండా కూడా రుచికరమైన ఆవకాయ పచ్చడి చేసుకోవచ్చు. ((Source: nishamdhulika.com))

వేసవిలో ఎండ, వేడి నుంచి ఉపశమనం కోసం చాలామంది ఎక్కువగా నీరు త్రాగుతారు. దీనివల్ల ఆకలి తగ్గుతుంది. అలాంటి సమయంలో ఆకలిని, రుచిని పెంచేది ఆవకాయే. అప్పుడే కాసిన మామిడికాయలను తెచ్చుకుని పచ్చడి చేసుకుని తినడం ఎవరికి నచ్చదు చెప్పండి. ఆవకాయ పచ్చడితో కుంబాలు కుంబాలు లాగించేసే వాళ్లు చాలా మంది ఉంటారు. కానీ కొందరు ఆవకాయ అంటేనే మనసులో నూనె, మసాలాలతో నిండిన వంటకంగా ఫీలవుతారు.

ముఖ్యంగా ఫిట్‌నెస్ ప్రియులు దీన్ని తినడానికి భయపడతారు. మీరు కూడా ఫిట్‌నెస్ ప్రియులే అయితే ఆవకాయ రుచిని ఆస్వాదించడంతో పాటు పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలనుకుంటే, ఈ జీరో ఆయిల్ మామిడి ఆవకాయ రెసిపీని ట్రై చేయండి. ఇది ఇతర మామిడికాయ పచ్చడి రెసిపీలకన్నా భిన్నంగా, చాలా రుచికరంగా ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఇందులో చుక్క నూనెను కూడా ఉపయోగించరు. నూనె లేకుండా పచ్చడా? ఎలా అనుకుంటున్నారా? ఇదిగో ఇలా .. చదివేసి చేసేయండి.

జీరో ఆయిల్ మామిడికాయ పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు:

-1 కిలో మామిడికాయలు(కచ్చవిగా ఉండాలి)

-2 పెద్ద చెంచాలు ఉప్పు

-1 పెద్ద చెంచా కారం పొడి

-1 పెద్ద చెంచా పసుపు పొడి

-1 పెద్ద చెంచా ఆవాలు

-1 పెద్ద చెంచా జీలకర్ర

-1 చిన్న చెంచా మెంతులు

-1 చిన్న చెంచా హింగు

-2 పెద్ద చెంచాలు వెనిగర్

జీరో ఆయిల్ మామిడికాయ పచ్చడి తయారీ విధానం:

  1. ఏ మాత్రం నూనె లేకుండా ఆరోగ్యకరమైన రుచికరమైన ఆవకాయ పచ్చడిని తయారు చేయాలంటే ముందుగా పచ్చి మామిడికాయలను తీసుకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోండి.
  2. ఇవి చక్కగా ఆరి తడి లేకుండా తయారవగానే వీటి తొక్కతీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కకు పెట్టుకోండి.
  3. ఇప్పుడు ఒక చిన్న కడాయి తీసుకుని దాంట్లో ఆవాలు, మెంతులు, జీలకర్రను వేరుగా వేయించండి.
  4. వీటన్నింటినీ చిన్న మంట మీదే ఉందే కొద్దిగా వేయించి చల్లారనివ్వండి.
  5. ఆవాలు, మెంతులు, జీలకర్ర ను చల్లారిన తర్వాత వాటిలో ఒక మిక్సీ జార్లో వేసి మెత్తటి పొడిలా తయారు చేసుకోండి.
  6. ఇప్పుడు ఒక పెద్ద పాత్ర తీసుకుని ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు దాంట్లో వేయండి.
  7. తరువాత దీంట్లోనే రుచికి తగినతంత ఉప్పు, ఎర్ర మిరపకాయ పొడి, పసుపులతో పాటు ముందుగా వేయించి పేస్టు చేసి పెట్టుకున్న మసాలాలను వేయండి.
  8. చివర్లో దీంట్లో కాస్త ఇంగువ, తర్వాతవ వెనిగర్ వేసి బాగా కలపండి.
  9. చుక్కనీరు కూడా కలవకుండా నూనె పోయకుండా ఈ మసాలాలన్నింటినీ మామిడికాయలను పట్టించండి.
  10. తరువాత ఈ మిశ్రమాన్ని ఒక గాజు పాత్రలో వేసి గాలి చొరబడకుండా మూత పెట్టి ఉంచండి.
  11. 2 లేదా 3 రోజుల తర్వాత మూత తెరిచి మరోసారి గరిటతో అంతా కలపారంటే జీర్ ఆయిల్ ఆవకాయ పచ్చడి రెడీ అయినట్టే. దీన్ని ఏడాదంతా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు.
  12. ముఖ్యమైన విషయంలో ఏంటంటే.. ఆవకాయను ఎప్పుడు తీసుకున్న తడి లేని గరిటలనే ఉపయోంచాలి. తడి ఉన్నా పచ్చడితో చేతులు పెట్టిన పాడైపోతుంది.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం