Clear Skin: మచ్చలు మొటిమల్లేని స్కిన్ కావాలంటే బియ్యప్పిండిలో వీటిని మిక్స్ చేసి ముఖానికి రాసుకోండి చాలు
Clear Skin: స్కిన్ క్లెన్సింగ్ కు బియ్యప్పిండి ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని ఫేస్ ప్యాక్ ల తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఇంట్లో బియ్యప్పిండితో ఫేస్ ప్యాక్ తయారుచేసుకోవచ్చు. మీ ముఖంపై నల్లటి మచ్చుల, మొటిమలు ఉంటే వాటిని బియ్యప్పిండితో పొగొట్టుకోవచ్చు.
ఎవరికైనా మచ్చలేని చర్మం కావాలని ఉంటుంది. ముఖ్యం మహిళలు అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ముఖంపై మొటిమలు, మచ్చలు ఉంటే వారికి నచ్చదు. వీటిని అడ్డుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ పేలవమైన జీవనశైలి, చెడు ఆహారాపు అలవాట్లు కారణంగా ఇలా మచ్చలు, మొటిమలు వస్తూ ఉంటాయి. చర్మ సమస్యలకు పరిష్కారంగా అనేక రకాల కాస్మోటిక్స్ ను వాడుతూ ఉంటారు.

చర్మం ప్రకాశవంతంగా ఉండటానికి ఖరీదైన స్కిన్ కేర్, బ్యూటీ ప్రొడక్ట్ లను వాడినా కూడా ఆశించిన ఫలితం రాదు. వాటికోసం వందల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టే బదులు ఇంట్లోనే సులువుగా ఫేస్ ప్యాక్ తయారుచేయవచ్చు. ముఖ్యంగా బియ్యంపిండిని ఉపయోగించడం ద్వారా చర్మాన్ని మెరిపించుకోవచ్చు. దీన్ని అప్లై చేయడం ద్వారా అనేక చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు. ముఖంపై మచ్చలను తొలగించడానికి బియ్యం పిండిని ఎలా ఉపయోగించాలో చూడండి.
ఆముదంలో కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మరమ్మత్తు చేయడానికి, మచ్చలను తొలగించడానికి సహాయపడతాయి. ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి, మీకు ఆర్గానిక్ ఆముదం నూనె, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి అవసరం. ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి, బియ్యం పిండిలో నూనె కలపండి. తర్వాత అది పేస్టులా అవుతుంది. దాన్ని మొటిమలు, మచ్చలపై అప్లై చేసి నెమ్మదిగా మసాజ్ చేయాలి. 30 నిమిషాలు అలా వదిలేసి తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.
కంటికింద నల్లటి వలయాలు పోవాలంటే బియ్యపిండిలో చిటికెడు పసుపు, టొమాటో రసం కలపాలి. దాన్ని నల్లటి వలయాలపై అప్లై చేయాలి. కాసేపు అలా వదిలేసి తరువాత శుభ్రం చేసుకోవాలి. పది నిమిషాల పాటూ ఉంచుకుంటే చాలు. తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఈ మూడింటిలోనూ చర్మాన్ని మెరిసేలా చేసే గుణాలున్నాయి.
హైపర్ పిగ్మెంటేషన్ సమస్యకు బియ్యప్పిండి బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి నిమ్మకాయ, బియ్యం పిండిని ఉపయోగించండి. ఈ రెండు పదార్థాలను మిక్స్ చేసిన తర్వాత అందులో కొన్ని చుక్కల రోజ్ వాటర్ మిక్స్ చేసి ఆ ప్యాక్ ను ముఖానికి, మెడకు అప్లై చేయాలి. 20 నిమిషాల పాటూ అలా వదిలేసి తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా మీరు రెండు మూడు సార్లు చేశాక మీకు ఎంతో మార్పు కనిపిస్తుంది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)