Healthy Breakfast: అల్పాహారంలో తేలికగా తినాలనుకుంటే ఇవిగో హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌లు, వీటిని నిమిషాల్లో చేసేయచ్చు
Healthy Breakfast: మీకు ఉదయం సమయం తక్కువగా ఉండడం వల్ల బ్రేక్ ఫాస్ట్ ఏం వండాలో తెలియక ఇబ్బంది పడుతున్నార? ఇక్కడ మేము మరియు ఈ రౌండ్ లో అల్పాహారం దాటవేయబడితే, మీరు ఇక్కడ పేర్కొన్న 3 ఎంపికలను ప్రయత్నించవచ్చు.
ఉద్యోగం చేసే మహిళలు ఇంటిల్లిపాదికి వండి ఉద్యోగానికి వెళ్లడం కష్టంగా మారుతుంది. అందుకే సింపుల్ గా అయిపోయే బ్రేక్ ఫాస్ట్ గురించి వెతుకుతూ ఉంటారు. ఆ అల్పాహారాలు ఆరోగ్యకరంగా కూడా ఉండాలి. అల్పాహారం అనేది ఎవరూ స్కిప్ చేయకూడదు. కచ్చితంగా తినాల్సిన భోజనం ఇది. వాస్తవానికి రాత్రి భోజనం చేసిన తర్వాత అల్పాహారం తీసుకునే సమయంలో 10 నుంచి 11 గంటల పాటు ఎలాంటి ఆహారం తినకుండా పొట్ట ఉపవాసం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, మీ ఉపవాసాన్ని విరమించడానికి అల్పాహారంలో ఆరోగ్యకరమైన ఆహారాన్నితినాల్సిన అవసరం ఉంది. త్వరగా రెడీ అయ్యే అల్పాహారాలతో పాటూ ఆరోగ్యకరంగా ఉండే హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ఐడియాలు ఇక్కడ ఇచ్చాము. నిజానికి ఇవి మిగతా అల్పాహారాలతో పోలిస్తే ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తాయి
ఓట్స్ గంజి
ఓట్స్ తో వండే సూప్ చాలా రుచిగా ఉంటుంది. అంతే కాదు ఎంతో ఆరోగ్యం కూడా. ఉదయం అల్పాహారంలో ఓట్స్ తో వండే గంజిని తింటే మంచిది. దీన్ని త్వరగా తయారు చేయాలనుకుంటే స్టవ్ మీద గిన్నె పెట్టి వోట్స్ వేసి వేయించాలి.ఇలా చేయడం వల్ల ఓట్స్ జిగటలా అతుక్కోకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక కుక్కర్లో వేయించిన ఓట్స్, క్యారెట్లు, పచ్చి బఠానీలు, బంగాళాదుంప ముక్కలు వేసి రుచికి సరిపడా ఉప్పును వేయాలి. అవి ఉడకడానికి సరిపడా నీటిని కూడా వేసి కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉంచాలి. తరువాత అది సూప్ లాగా తయారవుతుంది. దీన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. దీనికి అదనపు రుచిని జోడించడానికి, చివరలో నిమ్మరసం పిండుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కేవలం పదినిమిషాల్లో రెడీ అయిపోతుంది.
పాలు, కార్న్ ఫ్లేక్స్
ఇది చాలా సింపుల్ బ్రేక్ ఫాస్ట్ రెసిపీ. కార్న్ ఫ్లేక్స్ కొని తెచ్చుకోవాలి. తినేముందు పాలను వేడి చేసి, ఆ పాలల్లో కార్న్ ఫ్లేక్స్ వేసుకుంటే సరిపోతుంది. అది తినడానికి రెడీ అయిపోతుంది. వేడి పాలలో బెల్లం తురుము కూడా వేస్తే రుచిగా ఉంటుంది. బెల్లానికి బదులు కొన్ని పండ్లను కూడా కలుపుకోవచ్చు. దీనికి అరటిపండ్లు మంచి జత. ఇందులో అన్ని రకాల పండ్లు కలపకూడదు.
అవొకాడో టోస్ట్
అవకాడో పండు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఇది ఆరోగ్యాన్ని అందించే పండు. దీన్ని పాశ్చాత్యదేశాల్లో అధికంగా తింటారు. అవకాడోను కట్ చేసి గుజ్జును బయటకు తీయండి. మరో పక్క ఉల్లిపాయలు, టొమాటో ముక్కలు చాలా సన్నగా తరగాలి. ఒక గిన్నెలో అవకాడో గుజ్జు, తరిగిన ఉల్లిపాయలు, టమోటోలు, ఉప్పు, నల్ల మిరియాల పొడి, నిమ్మరసం వేసి కలపాలి. బాగా మిక్స్ చేసి వేయించిన బ్రెడ్ మీద ఈ అవకాడో మిశ్రమాన్ని వేయాలి. బ్రెడ్ పై మరో బ్రెడ్ ను ఉంచి దాన్ని తినేయాలి. అంతే అవొకాడో టోస్ట్ రెడీ అయిపోతుంది. ఇందులో వాడే బ్రెడ్ ను మల్టీ గ్రెయిన్ లేదా వీట్ బ్రెడ్ ఎంచుకోవాలి. బ్రౌన్ బ్రెడ్ ఇంకా మంచిది. అంతే కాదు మైదాతో చేసే బ్రెడ్ ఎంచుకోవద్దు.