బ్రహ్మ ముహూర్తం అంటే తెల్లవారు జామున ఉదయం అయిదు గంటల్లోపు సమయం. ఉదయం మూడున్నర నుంచి అయిదు లోపు సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. ఈ సమయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ సమయంలో నిద్ర లేచినవారు ఎక్కువ కాలం జీవిస్తారని, సానుకూలంగా ఉంటారని చెప్పుకుంటారు.
ఉదయం 4 గంటల సమయంలో లేవడం వల్ల ఆ రోజంతా పనుల్లో ప్రొడక్టవిటీ బావుంటుందని నమ్ముతారు. ఒకవేళ నాలుగు గంటలకు లేవలేకపోతే సూర్యోదయానికి గంటన్నర ముందు నిద్రలేవడం కూడా మంచిదే. పొద్దున్నే నిద్రలేచి 2 పనులు చేస్తే మీ రోజంతా సానుకూలంగా సాగుతుంది.
బ్రహ్మముహూర్తంలో నిద్రలేవడం వల్ల కలిగే ప్రయోజనాలను ఎన్నో ఉన్నాయి. చాలా మంది విజయవంతమైన వ్యక్తుల దినచర్యను మీరు గమనిస్తే, వారు ఉదయాన్నే నిద్రలేచి క్రమశిక్షణతో ఉంటారు. మీరు ఉదయాన్నే లేవాలని నిర్ణయించుకున్నట్లయితే, ఖచ్చితంగా ఉదయం దినచర్యలో 30 నిమిషాల ప్రాణాయామం, 30 నిమిషాల బ్రిస్క్ నడకను చేయండి.
ఉదయం పూట ఎలాంటి కాలుష్యం ఉండదని, ఈ సమయంలో ప్రాణాయామం చేస్తే స్వచ్ఛమైన గాలి, ఆక్సిజన్ లభిస్తాయని చెబుతారు. అనులోమ విలోమ, భ్రస్తిక, భ్రమరి, ప్రణవ ప్రాణాయామ పద్ధతులు చేయాలి. వీటి వల్ల రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి. ప్రణవ ప్రాణాయామం శరీర వ్యాధులను తొలగించడానికి ఉపయోగపడుతుంది. ఇందులో సమాధి స్థితికి వెళ్లి ‘ఓం’ ధ్వనిపై దృష్టి పెట్టాలి. దీన్ని సరళమైన పద్ధతిలో చేయడానికి, లోతైన శ్వాస తీసుకోండి. శ్వాసను పీల్చేటప్పుడు ఓం అని అనండి. మీరు కళ్ళు మూసుకుని, శరీరం లోపల ఈ ఓం అనుభూతి చెందాలి. మీ ఒత్తిడిని తగ్గించడం ద్వారా మంచి రోజును ప్రారంభించడానికి ఇది ఉత్తమ మార్గం. ప్రణవ ప్రాణాయామంతో, మీరు లోతైన శ్వాసతో మంత్రాన్ని జపిస్తారు, ఇది మీ మొత్తం వ్యవస్థకు సానుకూల ప్రకంపనలను ఇవ్వడంతో పాటు శరీరానికి ఆక్సిజన్ అందిస్తుంది.
ఆరోగ్యకరమైన, దీర్ఘాయుష్షును కోరుకుంటే, ఉదయాన్నే వాకింగ్ చేయడం ప్రారంభించండి. 80 ఏళ్ల వయసు వరకు బ్రిస్క్ వాకింగ్ చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. కీళ్ల, శ్వాసకోశ, గుండెజబ్బులు ఉన్న వారు మరీ వేగంగా నడవకుండా నెమ్మదిగా వాకింగ్ చేయాలి. బ్రిస్క్ వాక్ లో ఏదైనా సమస్య ఉంటే మార్నింగ్ వాక్ ను రొటీన్ గా చేసుకోండి. చురుకైన నడకలో, మీరు నిమిషంలో 100 అడుగులకు పైగా నడుస్తారు. మీరు ఏదైనా తిన్న ప్రతిసారీ 100 అడుగులు నడవడం అలవాటు చేసుకోండి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.