Kitchen Hacks: వాడేసిన టీ పొడిని ఇలా వాడితే అందాన్ని పెంచుకోవచ్చు, ఇంటినీ శుభ్రపరచుకోవచ్చు-if you use used tea powder like this you can increase the beauty and clean the house ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kitchen Hacks: వాడేసిన టీ పొడిని ఇలా వాడితే అందాన్ని పెంచుకోవచ్చు, ఇంటినీ శుభ్రపరచుకోవచ్చు

Kitchen Hacks: వాడేసిన టీ పొడిని ఇలా వాడితే అందాన్ని పెంచుకోవచ్చు, ఇంటినీ శుభ్రపరచుకోవచ్చు

Haritha Chappa HT Telugu
Aug 09, 2024 05:30 PM IST

Kitchen Hacks: టీ తయారు చేశాక టీ పొడిని వడకట్టి బయటపడేస్తారు. అలాగే టీ బ్యాగులను కూడా పడేస్తారు. అందులో మిగిలిన టీ పొడితో అందాన్ని పెంచుకోవడమే కాదు, ఇంటినీ మెరిపించుకోవచ్చు.

వాడేసిన టీపొడితో ఉపయోగాలు
వాడేసిన టీపొడితో ఉపయోగాలు (Shutterstock)

మన దేశంలో ఎక్కువ శాతం మంది తాగే పానీయం టీ. ఇక్కడ ప్రజలు టీతోనే రోజును ప్రారంభిస్తారు. దాదాపు ప్రతి ఇంట్లో ఉదయం, సాయంత్రం టీ తాగాల్సిందే. టీ తయారు చేసిన తర్వాత, టీ పొడి మిగిలే ఉంటుంది. దీనిని తరచూ చెత్తగా భావించి చెత్తబుట్టలో వేస్తారు. మిగిలిపోయిన టీ పొడిని పనికిరానిదిలా చూస్తారు. ఈ పనికిరాని టీ పొడితో ఎంతో పని చేయవచ్చని మీకు తెలుసా? ఇది ఇంటి శుభ్రతను సులభతరం చేస్తుంది, అలాగే మీ అందాన్ని పెంచుతుంది. మిగిలిపోయిన టీ ఆకులను ఎలా వినియోగించాలో తెలుసుకోండి.

ఇంటి అద్దాలను శుభ్రం చేసేందుకు

టీ పొడితో ఇంటి అద్దాలను పాలిష్ చేయవచ్చు. దీని కోసం, మిగిలిన టీ ఆకులను నీటిలో మరిగించండి. ఈ నీటిని స్ప్రే బాటిల్ లో నింపి దాని సహాయంతో అద్దాలను శుభ్రం చేయాలి. మీ అద్దాలు తళతళ ప్రకాశిస్తాయి. దీనితో పాటు, మీ గ్యాస్ బర్నర్లు ఎంత నల్లగా మారినా, మీరు వాటిని నిమిషాల్లో శుభ్రం చేయవచ్చు. టీ నీటిలో కొద్దిగా డిష్ వాష్ మిక్స్ చేసి బ్రష్ సహాయంతో రుద్దడం ద్వారా గ్యాస్ బర్నర్లను మెరిపించుకోవచ్చు.

పాదాల దుర్వాసన

రోజంతా బూట్లు ధరించడం వల్ల పాదాల్లో తరచూ దుర్వాసన వస్తుంటుంది. ఎంత రుద్దినా, కాళ్లు కడుక్కున్నా ఆ వాసన పోదు. అలాంటప్పుడు మిగిలిపోయిన టీ ఆకులను నీటిలో బాగా మరిగించండి. అది మరిగిన తర్వాత, గ్యాస్ ఆఫ్ చేసి, నీరు గోరువెచ్చగా మారే వరకు వేచి ఉండండి. ఇప్పుడు ఈ నీటిలో మీ పాదాలను 10 నుండి 15 నిమిషాలు నానబెట్టండి. ఇలా రోజూ చేయడం వల్ల పాదాల నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది.

జుట్టుకు మెరుపు

మిగిలిపోయిన టీ ఆకులు మీ జుట్టుకు ఒక వరం. ఇది మీ జుట్టుకు నేచురల్ షైన్ జోడించడానికి పనిచేస్తుంది. దీనితో పాటు జుట్టు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. దీని కోసం, మీరు టీ ఆకులను శుభ్రమైన నీటిలో మరిగించాలి. మరిగిన తర్వాత నీళ్లు చల్లారనివ్వాలి. షాంపూతో తలస్నానం చేసిన తర్వాత ఈ నీటితో తలస్నానం చేయాలి. కొద్ది రోజుల్లోనే మీ జుట్టు పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. ఇది నేచురల్ షైన్ ను కూడా కలిగి ఉంటుంది.

సహజ ఎరువుగా

ఇంట్లో పెంచుకునే మొక్కలకు సహజ ఎరువుగా ఈ తేయాకు ఆకులు ఉపయోగపడతాయి. ఇంట్లో చెట్లు, మొక్కలు ఉంటే తేయాకు ఆకుల సహాయంతో వాటి ఎదుగుదల రెట్టింపు అయ్యేలా చూసుకోవచ్చు. మిగిలిపోయిన టీ ఆకులను కంపోస్టులా మీ మొక్కల కుండీల్లో వేసేయండి. ఇది మొక్కల ఎదుగుదలను మెరుగుపరుస్తాయి. అవి ఆరోగ్యంగా ఎదుగుతాయి. పంచదార కలిపిన టీ పొడి అయితే నీటిలో బాగా కడిగి అప్పుడు వినియోగించాలి.

టాపిక్