Stomach pain: పొట్ట నొప్పి వచ్చినప్పుడు ఉల్లిరసాన్ని ఇలా వాడారంటే నిమిషాల్లొ ఆ నొప్పి తగ్గిపోతుంది
Stomach pain: పొట్టనొప్పి తరచూ వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కడుపునొప్పికి ఉల్లిపాయ రసం హోం రెమెడీగా కొంతమంది వినియోగిస్తూ ఉంటారు. ఉల్లిపాయ రసం వల్ల నిజంగానే పొట్ట నొప్పి తగ్గుతుందా?
ఉల్లిపాయ రసం వల్ల ఉన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఎన్నో ఇంటి చిట్కాల్లో కూడా ఉల్లిపాయను వినియోగిస్తూ ఉంటారు. జుట్టు పెరిగేందుకు ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు పట్టిస్తారు. ఇది మంచి ఫలితాలు చూపిస్తాయని ఎంతో మంది నమ్ముతారు. గాయాలు కావడం లేదా తల వెంట్రుకలు రాలిపోవడం వంటి వాటిని ఆపేందుకు ఉల్లిపాయ రసాన్ని అప్లై చేయడం మంచిది. చిన్న వయసులో పిల్లలకు తరచూ పొట్టనొప్పి వచ్చి వేధిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు పూర్వం వారికి తాగేందుకు ఉల్లిపాయ రసం ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆధునిక వైద్యం అందుబాటులోకి రావడంతో ఇలాంటి ఇంటి చిట్కాలకు ఆదరణ తగ్గింది. ఉల్లిపాయ రసం నిజంగా కడుపు నొప్పిని తగ్గిస్తుందా? ఉల్లిపాయ రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
ఉల్లిపాయలో ఉండే పోషకాలు
మీరు ఉల్లిపాయను కేవలం వంటల్లో మాత్రమే వినియోగిస్తారా? దానిలోని పోషక విలువలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఉల్లిపాయలో 2.8 గ్రాముల సోడియం, 102.2 గ్రాముల పొటాషియం, 7 గ్రాముల పిండి పదార్థాలు, 1.2 గ్రాముల డైటరీ ఫైబర్, 3 గ్రాముల చక్కెర, 0.8 గ్రాముల ప్రోటీన్, 28 గ్రాముల కేలరీలు ఉంటాయి. ఇవి మీ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి.
పొట్టనొప్పి తగ్గుతుందా?
ఉల్లిపాయల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి ఇ.కోలి వంటి బ్యాక్టీరియాను తగ్గించడంలో సహాయపడతాయి. ఉల్లిపాయ రసం ఈ బ్యాక్టీరియా పెరుగుదలను నివారించడంలో సహాయపడుతుంది. అందుకే పొట్టనొప్పిని ఉల్లిపాయ రసం తగ్గిస్తుందని నమ్ముతారు.
ఉల్లిపాయల్లో విటమిన్ సి, బి పుష్కలంగా ఉంటాయి. ఇందులో పొటాషియం, మాంగనీస్ కూడా ఉంటాయి. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది.
ఉల్లిపాయ రసం గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. రక్తంలో చక్కెరను తగ్గించడంతో పాటు, ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది.
రోజూ ఉల్లిపాయ రసం తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ రెగ్యులేట్ అవుతాయి. ముఖ్యంగా ప్రీడయాబెటిస్ ఉన్న వారు ప్రతిరోజూ పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఉల్లిపాయలలో ఉండే క్వెర్సెటిన్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. వీరు ప్రతిరోజూ ఉల్లిపాయ రసం తాగడం వల్ల మేలు జరుగుతుంది.
ఎముకలకు ప్రయోజనకరం
ఎముక బలం, సాంద్రతను పెంచడానికి పాల ఉత్పత్తులను తినాలని తరచుగా వింటూ ఉంటాము. కానీ ఉల్లిపాయలు తినడం ద్వారా ఎముకల సాంద్రతను కూడా పెంచుకోవచ్చు. ఉల్లిపాయ రసం తాగడం వల్ల రుతుక్రమం ఆగిపోయిన మహిళలకు ప్రయోజనం చేకూరుతుంది. ఇది వారి ఎముకల సాంద్రతను పెంచుతుంది.
ఉల్లిపాయ రసం ఎవరు తాగకూడదు?
కొంతమందికి ఉల్లిపాయ రసం తాగడం వల్ల హాని జరుగుతుంది.
- సున్నితమైన పొట్ట కలవారికి తరచూ ఏదో ఒక సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటి వారు ఉల్లిపాయ రసం తాగకూడదు.
- అదే సమయంలో యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలు ఉన్నవారు కూడా ఉల్లిపాయ రసం తాగడం వల్ల గుండెల్లో మంట, చికాకు వంటి సమస్యలు రావచ్చు.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)