నల్లమిరియాలు, శొంఠి కలిపిన పొడిని ప్రతిరోజూ చిటికెడు తినండి చాలు, మీలో వచ్చే మార్పును చూడండి
ఆయుర్వేదంలో త్రికటు చూర్ణానికి ఎంతో విలువ ఉంది. దీన్ని ఇంట్లోనే తయారుచేయవచ్చు. నల్ల మిరియాలు, ఎండు అల్లం పొడి వేసి కలిపితే త్రికటు చూర్ణం రెడీ అయిపోతుంది. దీనితో ఎంతో ఆరోగ్యం.
ఆయుర్వేదం మన పురాతన వైద్యవిధానం. దీనిలో అనేక వ్యాధులకు పరిష్కారం ఉంది. ఆయుర్వేద నిపుణులు తరచుగా వంటగదిలో దొరికే కొన్ని వస్తువులతోనే చికిత్స చేస్తూ ఉంటారు. సహజమైన మందుల ద్వారా వ్యాధులను తగ్గించడమే ఆయుర్వేద పద్ధతి. ఈ వైద్య విధానంలో ఎన్నో ఆరోగ్యమస్యలను తగ్గించుకోవచ్చు. చర్మ వ్యాధుల నుంచి ఊబకాయం వరకు ఎన్నో సమస్యలను ఇది పరిష్కరిస్తుంది. నల్ల మిరియాలు, ఎండు అల్లంతో చేసిన పొడిని తింటే ఎంతో ఆరోగ్యం కూడా. దీన్ని త్రికటు చూర్ణం అని పిలుస్తారు. నల్లమిరియాలు, శొంఠి కలిపి పొడి చేసుకోవాలి. అదే త్రికటు చూర్ణం.

ఆయుర్వేద వైద్యుడు కాంచన్ ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటారు. అందులో త్రికట చూర్ణం గురించి వివరించారు. దీన్ని తినడం ద్వారా అయిదు రకాల ప్రయోజనాలు పొందవచ్చని వివరించారు. ఇంట్లోనే త్రికటు చూర్ణాన్ని తయారుచేసుకోవచ్చు.
త్రికటు పొడి
త్రికటు పౌడర్ తయారు చేయడం చాలా సులభం. దీన్ని తయారు చేయడానికి, ఒక టీస్పూన్ నల్ల మిరియాల పొడి, ఒక టీస్పూన్ అల్లం పొడి, పిప్పలి కలుపుకుంటే త్రికటు చూర్ణం రెడీ అయిపోతుంది. ఈ త్రికటు పొడి ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది.
బరువు తగ్గడానికి
బరువు తగ్గేందుకు ఎంతోమంది ప్రయత్నిస్తూ ఉంటారు. సులభంగా బరువు తగ్గాలని భావించే వారు త్రికటు చూర్ణం చిటికెడు తీసుకోవడం చాలా అవసరం. నిరంతర ఆహార తగ్గినా, వ్యాయామం చేసినప్పటికీ బరువు తగ్గకపోతే ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ తేనె, పావు స్పూన్ త్రికటు పొడి కలిపి తాగడం వల్ల ఫలితం కనిపిస్తుంది.
అలర్జిక్ రైనైటిస్ లో ప్రయోజనకరం
అలర్జిక్ రైనైటిస్ సమస్యలు ఉన్నవారి సంఖ్య అధికంగానే ఉంటుంది. నిరంతరం ముక్కు కారడం ఈ అలర్జిక్ రైనైటిస్ ముఖ్య లక్షణం . త్రికటు పొడిని తేనెలో మిక్స్ చేసి ఉదయం, సాయంత్రం తీసుకోవాలి.
ఆకలి లేకపోవడం
కొంతమంది సన్నగా మారిపోతారు. ఆకలిగా అనిపించకపోవడం వల్ల బరువు పెరగక ఇబ్బంది పడతారు. కాబట్టి అలాంటి వారు కాయధాన్యాలు లేదా సలాడ్లలో కొద్దిగా త్రికటు పొడి చల్లి తినాలి. లేదా మజ్జిగలో మిక్స్ చేసి తాగాలి.
శరీరాన్ని డిటాక్స్
శరీరాన్ని నెలకు ఒకసారైనా పూర్తిగా డిటాక్సిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. శరీరాన్ని డిటాక్స్ చేయాలంటే.. గ్లాసు నీటిలో పావు టీస్పూన్ త్రికటు పౌడర్ వేసి మరిగించి సగం మిగిలి ఉండగా సిప్ చేసి తాగాలి.
ముఖంపై మొటిమలు వచ్చే వారు కూడా ఈ త్రికటు పొడిని తినడం వల్ల ఎంతో ఉపయోగం ఉంది. నెయ్యిలో పావు టీస్పూన్ త్రికటు పొడి కలిపి తినడానికి 15 నిమిషాల ముందు తినాలి.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)