Love language of Men: అబ్బాయిలు ఒకమ్మాయిని ప్రేమిస్తే.. వాళ్ల ప్రవర్తనలో వచ్చే మార్పులివే-if you see these body language changes in men he is loving you ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Love Language Of Men: అబ్బాయిలు ఒకమ్మాయిని ప్రేమిస్తే.. వాళ్ల ప్రవర్తనలో వచ్చే మార్పులివే

Love language of Men: అబ్బాయిలు ఒకమ్మాయిని ప్రేమిస్తే.. వాళ్ల ప్రవర్తనలో వచ్చే మార్పులివే

Love language of Men: ఒక అబ్బాయి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని చెప్పే లక్షణాలు కొన్ని ఉన్నాయి. వాళ్లలో కనిపించే చిన్న హావభావాలు ప్రేమను చెప్పకనే చెబుతాయి. అవేంటో తెల్సుకోండి.

అబ్బాయి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని చెప్పే లక్షణాలు (shutterstock)

కొన్నిసార్లు ప్రేమను అర్థం చేసుకోవడానికి మాటలు అవసరం లేదు. వాళ్లలో కొన్ని మార్పులు, మాటలు, చేతలు వాళ్ల ప్రేమను చెప్పకనే చెప్పేస్తాయి. ఒకబ్బాయి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా లేదా అనే సందేహం మీకుందా? అయితే ఈ పనులు ఆయన చేస్తున్నాడేమో గమనించండి. ఇవన్నీ సాధారణంగా అబ్బాయిలు ప్రేమను వ్యక్తం చేసే పనులు.

కళ్లలోకి చూడటం:

మీ కళ్లల్లోకి చూస్తూ అందరూ మాట్లాడరు. మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి మీ కళ్లల్లోకి చూసి మాట్లాడితే మీకు స్పష్టంగా తేడా తెలుస్తుంది. ఆ వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడుతున్నాడనడానికి ఇదొక సంకేతం. ఈ చిన్న పని ద్వారా అబ్బాయిలు వాళ్ల ప్రేమను వ్యక్తం చేస్తారు.

స్పర్శ:

ఈ రోజుల్లో అమ్మాయిలకు అబ్బాయిల్లో స్నేహితులుంటున్నారు. చాలా మంచి సంబంధాలు వాళ్ల మధ్య ఉంటున్నాయి. కానీ మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తి మాత్రం మీ స్నేహితునికి భిన్నంగా ఉంటారు. మీ చేతులు తాకాల్సి వచ్చినా చాలా తడబడతారు. స్పర్శలో తేడాతో మీరు దాన్ని కనిపెట్టొచ్చు. ఇది వాళ్లు హావభావాలు వ్యక్తపరిచే మరో మార్గం.

బ్లష్ అవ్వడం:

మీతో మాట్లాడుతున్నప్పు అధైర్య పడతారు. వేరే వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు కనిపించే ధైర్యం మీతో మాట్లాడుతున్నప్పుడు ఉండదు. వాళ్ల గడ్డం నిమురుకుంటూ, సిగ్గు పడుతూ మాట్లాడతారు. ఇవన్నీ వాళ్లు మీతో సన్నిహితంగా ఉండాలనుకుంటున్నారని చెప్పే హావభావాలు.

రక్షించడం:

సమస్య ఏదైనా సరే అందరి ముందు కూడా మీకోసం నిలబడితే మీమీద ఇష్టం ఉన్నట్లే. అలా ప్రతి ఒక్కరు అందరిముందు మీకోసం కారణం లేకుండా మాట్లాడలేరు. మీరే సమస్య పరిష్కరించుకుంటారని వదిలేస్తారు. ఆ తేడా మీకు స్పష్టంగా తెలుస్తుంది. మీరు అపాయంలో ఉన్నారన్నా వాళ్ల తోడు మీకుంటుంది. మీకు రాబోయే అపాయం గురించి కూడా ముందే ఊహించి మిమ్మల్ని కాపాడతారు.

దృష్టి:

మీరు అందరితో కలిసి ఉన్నా అతని దృష్టి మీమీద మాత్రమే ఉందంటే మిమ్మల్ని ఇష్టపడుతున్నాడని స్పష్టంగా చెప్పే సూచన ఇది. మీ మాటలు వినడం, ఏం చెప్పినా శ్రద్ద పెట్టడం, అర్థం చేసుకోవడం, వాటికి విలువివ్వడం.. ఈ లక్షణాలన్నీ అతను మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని చెప్పేవే.