రాత్రి పడుకునే ముందు పాలు తాగడం మంచి అలవాటు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ పాలు ఒక్కటే తాగే కన్నా అందులో చిటికెడు కుంకుమపువ్వు వేసుకుని తాగడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. కుంకుమపువ్వు ప్రపంచంలో అత్యంత ఖరీదైన మసాలా దినుసులలో ఒకటి. దీని ప్రత్యేక వాసన, రంగు మిగిలిన మసాలా దినుసుల కంటే దీన్ని ప్రత్యేకమైనదిగా నిలిచేలా చేస్తోంది. ప్రతిరోజూ పడుకునే ముందు ఒక గ్లాసు పాలలో కుంకుమపువ్వు కలిపిన తాగితే కొద్ది రోజుల్లోనే శరీరంలో అనేక మార్పులు కనిపిస్తాయి.
నిద్ర పట్టక ఇబ్బందులు సమస్యలు ఉన్నవారు ఎంతో మంది. అలాంటి వారు పాలలో కుంకుమపువ్వు కలుపుకుని తాగాలి. పాలలో కుంకుమపువ్వు కలిపి తాగడం వల్ల మనసు, మెదడు రిలాక్స్ గా మారుతాయి. దీని వల్ల మీకు నిద్ర సులభంగా పడుతుంది. కుంకుమపువ్వు కలిపిన పాలు నిద్రలేమి సమస్యను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. రోజూ కుంకుమపువ్వు పాలు తాగితే మెటబాలిజం పెరిగి బరువు తగ్గడం సులువుగా మారుతుంది.
పురుషులు, మహిళల్లో సంతానోత్పత్తి సమస్యలు పెరిగిపోతున్నాయి. పెళ్లి చేసుకున్న ఎన్నో జంటలు సహజంగా గర్భం ధరించలేక ఆసుపత్రులకు చుట్టూ తిరుగుతున్నారు. అలాంటి వారు పాలల్లో కుంకుమపువ్వును కలుపుకుని తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కుంకుమ పువ్వులో కామోద్దీపన లక్షణాలు ఉన్నాయి. ఇవి లిబిడో, లైంగిక పనితీరును పెంచడంలో సహాయపడతాయి. అదే సమయంలో కుంకుమపువ్వులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు స్పెర్మ్ నాణ్యతను, చలనశీలతను పెంచడంలో సహాయపడతాయి. ఇది పురుషుల సంతానోత్పత్తి సమస్యను తొలగిస్తుంది.
రాత్రిపూట కుంకుమపువ్వు పాలు తాగడం వల్ల చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. కుంకుమపువ్వు చర్మానికి సాగే గుణాన్ని ఇస్తుంది. సన్నని గీతలు, ముడతలను తగ్గిస్తుంది. ముఖం యవ్వనంగా కనిపించాలంటే రోజూ కుంకుమపువ్వు పాలు తాగాలి.
రోజూ రాత్రిపూట కుంకుమపువ్వు పాలు తాగడం వల్ల రాత్రిపూట జీర్ణ ఎంజైములు స్రవించడానికి కుంకుమపువ్వు సహాయపడుతుంది. ఇది కడుపు ఉబ్బరం సమస్యను తగ్గిస్తుంది. ఇది జీర్ణశయాంతర ప్రేగులలో ఉపశమనం కలిగిస్తుంది. ఇది యాసిడ్ రిఫ్లక్స్, అజీర్ణ సమస్యను తొలగిస్తుంది.
కుంకుమపువ్వు పాలు రోజూ తాగడం వల్ల డిప్రెషన్ సమస్యలున్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. 2019 అధ్యయనం ప్రకారం, కుంకుమ పువ్వు డిప్రెషన్ వంటి తేలికపాటి, మితమైన లక్షణాలపై ప్రభావాన్ని చూపుతుంది.
సంబంధిత కథనం
టాపిక్