Travel plan in 1Lakh: మీ దగ్గర లక్ష రూపాయలుంటే చాలు ఈ దేశాలకు షికారు వెళ్లి రావచ్చు
Travel plan in 1Lakh: మన దేశం నుంచి లక్ష రూపాయల్లోనే కొన్ని దేశాలకు ట్రిప్ వెళ్లి రావచ్చు. అంతర్జాతీయ ట్రిప్ వెళ్లాలనుకునే వారికి ఈ దేశాలను చాలా తక్కువ ఖర్చుతో సందర్శించవచ్చు. ప్రయాణ ఛార్జీలు తెలుసుకోండి.
మనదేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా లక్ష రూపాయల ఖర్చు అవ్వదు. కొన్ని వేలల్లోనే ఇండియాలో ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. కానీ విదేశీ పర్యటన మాత్రం అలా కాదు. లక్షలు లక్షలు ఖర్చు అవుతుంది. అందుకే చాలా మంది ఇతర దేశాలకు ప్రయాణం చేయడానికి ఇష్టపడరు. కానీ కొన్ని దేశాలను భారతదేశం నుంచి చాలా తక్కువ డబ్బులు ఖర్చుతోనే ప్రయాణించవచ్చు. మీ దగ్గర లక్ష రూపాయలు ఉంటే చాలు ఎన్నో దేశాలకు వెళ్లి తిరిగి రావచ్చు. ఆ దేశాలేంటో తెలుసుకోండి.
ఇండోనేషియా
ఇండోనేషియా దేశంలో అన్వేషించడానికి ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. ఇందులో దేవాలయాల నుండి బీచ్ లు, గుహల వరకు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మీరు ఇండోనేషియా వెళ్లాలనుకుంటే, న్యూఢిల్లీ నుండి ప్రయాణించడానికి సుమారు 40-70 వేల రూపాయలు ఖర్చవుతుంది. ఇండోనేషియాలో నివసించడానికి అద్దె 3 వేల నుండి ప్రారంభమవుతుంది. కాబట్టి మీరు ఇక్కడికి వెళ్లడానికి ఒక లక్ష రూపాయలు చాలు.
థాయ్ లాండ్
మీకు సముద్రం, బీచ్ లంటే ఇష్టమా… అయితే థాయ్ లాండ్ దేశాన్ని సందర్శించండి. ఈ దేశానికి వెళ్లేందుకు ఎక్కువగా ఖర్చు కాదు. థాయ్ లాండ్ వెళ్లాలంటే 24-26 వేల రూపాయలు ప్రయాణం ఖర్చులు అవుతాయి. అలాగే, అక్కడ హోటల్ అద్దె 3 వేల రూపాయల నుండి ప్రారంభమవుతుంది. ఆహారం ధర రూ.1100 నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి మీ జేబులో ఒక లక్ష ఉంటే థాయ్ లాండ్ ట్రిప్ ను సులువుగా పూర్తి చేసుకోవచ్చు.
కంబోడియా
అంగోర్ కోట్ ఆలయం గురించి అందరూ వినే ఉంటారు. ఇది కంబోడియా దేశంలో ఉంటాయి. మీరు ఈ పురాతన దేశాన్ని సందర్శించాలనుకుంటే పెద్దగా ఖర్చుపెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వెళ్లేందుకు సుమారు 41,500 రూపాయల నుండి 48,500 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక్కడ జీవన వ్యయం 4 వేల రూపాయల నుండి ప్రారంభమవుతుంది. ఆహారం ఖర్చు వెయ్యి రూపాయల నుండి ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ అందమైన దేశాన్ని అన్వేషించడానికి, కేవలం లక్ష రూపాయలు అవసరం.
లావోస్
లావోస్ అనేది ఆసియాలోని ఒక చిన్న దేశం. అక్కడ ప్రకృతి దృశ్యాలు చూసేందుకు రెండు కళ్లూ చాలవు. ఈ దేశాన్ని సందర్శించడానికి ఆహారం, హోటల్ ఖర్చు సుమారు 5 వేల రూపాయల నుండి ప్రారంభమవుతుంది. ప్రయాణానికి సుమారు 40 నుంచి 65 వేల రూపాయలు ఖర్చవుతుంది.
వియత్నాం
వియత్నాం దేశాన్ని సందర్శించాలనుకుంటే 25 వేల రూపాయల నుంచి ఫ్లైట్ టికెట్లు ఖర్చు అవుతుంది. అలాగే, ఇక్కడ నివసించడానికి 2 వేల రూపాయల నుండి ప్రారంభమవుతుంది. ఇక్కడ ఆహారం కూడా చాలా చౌకగా ఉంటుంది.
శ్రీలంక
పొరుగు దేశమైన శ్రీలంక ప్రకృతి ప్రేమికులకు స్వర్గంలాంటిది. శ్రీలంకకు విమాన ఛార్జీలు 10 వేల నుండి ప్రారంభమవుతాయి. అలాగే, ఆహారం, బసకు 4 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి మీరు తక్కువ డబ్బుతో ఈ దేశాన్ని సులభంగా సందర్శించవచ్చు.
టర్కీ
టర్కీ వెళ్లేందుకు విమాన ఛార్జీలు సుమారు 45 నుండి 50 వేల రూపాయలు అవసరం. అలాగే, ప్రతిరోజూ జీవనానికి 2500 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆహారం కోసం ఒక వెయ్యి రూపాయలకు వరకు ఖర్చవుతుంది. కాబట్టి టర్కీ వంటి దేశానికి ట్రిప్ ను సులభంగా ప్లాన్ చేసుకోవచ్చు.