చపాతీ మిగిలిపోతే ఇలా ఉప్మా చేసేయండి, పిల్లలకు ఇది బాగా నచ్చుతుంది-if you have leftover chapati make this upma kids will love it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  చపాతీ మిగిలిపోతే ఇలా ఉప్మా చేసేయండి, పిల్లలకు ఇది బాగా నచ్చుతుంది

చపాతీ మిగిలిపోతే ఇలా ఉప్మా చేసేయండి, పిల్లలకు ఇది బాగా నచ్చుతుంది

Haritha Chappa HT Telugu

చాలా మంది డిన్నర్ కు చపాతీలు తింటారు. కానీ ఒక్కోసారి అవి మిగిలిపోతూ ఉంటాయి. వాటిని వేడి చేసి తినేకన్నా కొత్త రకం రెసిపీగా మార్చుకుంటే బావుంటుంది. ఇక్కడ చపాతీ ఉప్మా రెసిపీ ఇచ్చాము. ఇది పిల్లలకు నచ్చుతుంది.

చపాతీ ఉప్మా రెసిపీ

రాత్రి వండుకున్న ఆహారం మిగిలిపోవడం అందరి ఇళ్లల్లో జరిగేదే. రాత్రి చపాతీలు తినేవారి సంఖ్య అధికంగానే ఉంది. రాత్రి వండుకున్న చపాతీలు మిగిలిపోతే వాటితో ఉదయం సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ ఫాస్ట్ వండుకోవచ్చు. రాత్రి మిగిలిపోయిన చపాతీలతో ఓసారి ఉప్మా చేసుకుని చూడండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. సాధారణ ఉప్మాతో పోలిస్తే చపాతీ ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. దీన్ని చేయడం కూడా చాలా సులువు. పిల్లలకు పెద్దలకు కూడా ఇది నచ్చేలా ఉంటుంది. చపాతీ ఉప్మా రెసిపీ ఎలా చేయాలో తెలుసుకోండి.

చపాతీ ఉప్మా రెసిపీకి కావల్సిన పదార్థాలు

  • చపాతీలు - 4
  • ఉల్లిపాయలు - 1
  • టొమాటో - 1
  • క్యారెట్ - 1
  • క్యాప్సికమ్ - 1/2
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1/2
  • ధనియాల పొడి - అర
  • గరం మసాలా - 1/2 టీస్పూన్
  • కొత్తిమీర తరుగు - కొన్ని
  • ఉప్పు - రుచికి తగినంత
  • కరివేపాకు - తగినంత
  • నూనె - 2 టేబుల్ స్పూన్లు
  • ఆవాలు - 1/2 టీస్పూన్
  • జీలకర్ర - ½ స్పూను

చపాతీ ఉప్మా రెసిపీ

  1. చపాతీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  2. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర వేయాలి.
  3. అవి వేగాక తరిగిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రంగు మారే వరకు వేయించాలి.
  4. తరువాత తరిగిన టొమాటోలు వేసి మూతపెట్టాలి. అవి మెత్తగా ఉడుకుతాయి.
  5. ఇప్పుడు క్యాప్సికమ్, క్యారెట్ ముక్కలు వేసి వేగించాలి.
  6. అందులో పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి వేగించాలి. మళ్లీ మూతపెట్టి రెండు నిమిషాలు ఉడికించాలి.
  7. ఇప్పుడు తరిగిన చపాతీ ముక్కలు వేసి బాగా కలపాలి. చివరగా గరం మసాలా, కరివేపాకు వేసి బాగా కలపాలి.
  8. ఇందులో నీరు కలపాల్సిన అవసరం లేదు. పొడిపొడిగా ఇది వస్తుంది. చివర్లో కొత్తిమీర చల్లండి.
  9. రుచికరమైన చపాతీ ఉప్మా తినడానికి సిద్ధంగా ఉంది. ఈ ఉప్మాకు సాంబార్, చట్నీ పర్ఫెక్ట్ కాంబినేషన్. ఒకసారి ఈ స్టైల్ ట్రై చేసి చూడండి.. మీకు కచ్చితంగా నచ్చుతుంది.

చపాతీ ఉప్మా రావాలంటే చపాతీలను చాలా సన్నగా తురమాలి. లేకుంటే నూడుల్స్ లాగా వస్తుంది. సాధారణ ఉప్మా ఈ ఉప్మానే టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో వండుకుని చూడండి మీకు నచ్చడం ఖాయం.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.