పాలు కొబ్బరి ఉంటే చాలు పది నిమిషాల్లో అద్భుతమైన స్వీట్ తయారు చేయచ్చు, ఇదిగోండి రెసిపీ!-if you have coconut and milk you can make a wonderful sweet heres the recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  పాలు కొబ్బరి ఉంటే చాలు పది నిమిషాల్లో అద్భుతమైన స్వీట్ తయారు చేయచ్చు, ఇదిగోండి రెసిపీ!

పాలు కొబ్బరి ఉంటే చాలు పది నిమిషాల్లో అద్భుతమైన స్వీట్ తయారు చేయచ్చు, ఇదిగోండి రెసిపీ!

Ramya Sri Marka HT Telugu

ఇంట్లో పిల్లలుంటే వారికి స్వీట్ అంటే ఇష్టమైదే ఈ కొబ్బరి బర్ఫీ చేసి పెట్టండి. ఆరోగ్యకరమైన ఈ తియ్యటి పదార్థాన్ని ఇంట్లో ఈజీగా తయారు చేయచ్చు. తినడానికి అద్భుతంగా ఉండే ఈ రెసిపీని పిల్లలు మాత్రమే కాదు పెద్దలు కూడా చక్కగా ఆస్వాదిస్తారు. రెసిపీలోకి వెళిపోదాం రండి.

కొబ్బరి, బెల్లంతో తయారు చేసిన రుచికరమైన బర్ఫీ (shutterstock)

ఇంట్లో పిల్లలుంటే వారు ఎక్కువగా స్వీట్స్ కోసం అడుగుతుంటే ఈ రెసిపీ మీ కోసమే. మీ ఇంట్లో వాళ్ల తియ్యటి కోరికలు తీర్చడం కోసం బయట మార్కెట్ నుంచి తెచ్చిన కెమికల్స్‌తో కూడి తీపి పదార్థాలను, ఆరోగ్యానికి హానికరమైన బిస్కెట్లను ఇవ్వడం కంటే వివిధ రకాల రుచులు, ఆరోగ్యకరమైన పోషకాలు కలిగిన స్వీట్లను ఇవ్వడం అలవాటు చేసుకోండి. మీ పిల్లల కోసం వీటిని మీరు ఇంట్లోనే ఈజీగా తయారు చేయచ్చు. ఇలా చేయడం వల్ల పిల్లలు రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ నచ్చే కొబ్బరి బర్ఫీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం రండి.

కొబ్బరి బర్ఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు:

  • ఒక కప్పు దేశీయ నెయ్యి
  • రెండు కప్పులు తాజాగా తురిమిన కొబ్బరి
  • 3 కప్పులు బెల్లం
  • నాలుగు కప్పులు మరిగించి చల్లార్చిన పాలు
  • ఒక టీస్పూన్ యాలకుల పొడి

కొబ్బరి బర్ఫీని ఈజీగా తయారుచేసే విధానం

  1. కొబ్బరి బర్ఫీని చాలా రకాలుగా చేయచ్చు. అన్నింటిలోకి ఇక్కడున్న రెసిపీ చాలా సింపుల్ గా త్వరగా అయిపోతుంది. రుచిలో కూడా అద్భుతంగా ఉంటుంది.
  2. ఇందుకోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లో పాలు పోసి బాగా మరిగించండి.
  3. తరువాత స్టవ్ ఆఫ్ చేసి పాలు కాసేపు చల్లారే వరకూ పక్కకు పెట్టండి. పాలు గోరువెచ్చగా మారేంతవరకూ చల్లారనివ్వండి.
  4. ఈలోపు పచ్చి కొబ్బరి కాయను తీసుకుని సన్నగా తురుముకోండి.
  5. ఇప్పుడు ఒక మందపాటి పాత్రను తీసుకుని స్టవ్ మీద పెట్టి దాంట్లో ఒక కప్పు నెయ్యి వేసి వేడి చేయండి.
  6. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత దాంట్లో తాజా కొబ్బకి తురుము, తురిమిన లేదా చిన్న చిన్న ముక్కలుగా చేసిన బెల్లాన్ని దాంట్లో వేయండి.
  7. ఇప్పుడు ఈ మిశ్రమంలో పాలు పోసి బాగా కలపండి.
  8. పాలు చక్కగా మరిగి చిక్కటి మిశ్రమంలా తయారయ్యేంత వరకూ ఈ మిశ్రమాన్ని బాగా ఉడికించండి.
  9. ఈ మిశ్రమం పాత్ర అంచులకు అంటుకోవడం మానేసి పొడిపొడిగా గట్టిగా మారేవరకూ ఉంచండి.
  10. తరువాత దీంట్లో యాలకుల పొడి వేసి బాగా కలిపి రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించండి.
  11. తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమన్ని నెయ్యి రాసిన పాత్రలో వేసి చెంచాతో మీకు నచ్చినట్లుగా ముక్కలుగా కట్ చేసుకోండి.
  12. ఇది కాస్త ఆరిందంటే రుచికరమైన, ఆరోగ్యకరమైన బర్ఫీ రెడీ అయినట్టే. , గ్యాస్ ఆఫ్ చేయండి. నోట్లో వేసుకున్నారంటే మిగల్చకుండా మొత్తం తినేస్తారు. కావాలంటే ట్రై చేసి చూడండి.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం