Diabetes Day: డయాబెటిస్‌కు సంబంధించి మీకు ఇలాంటి అపోహలు ఉంటే వెంటనే మార్చుకోండి-if you have any such misconceptions about diabetes change them immediately ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diabetes Day: డయాబెటిస్‌కు సంబంధించి మీకు ఇలాంటి అపోహలు ఉంటే వెంటనే మార్చుకోండి

Diabetes Day: డయాబెటిస్‌కు సంబంధించి మీకు ఇలాంటి అపోహలు ఉంటే వెంటనే మార్చుకోండి

Haritha Chappa HT Telugu
Nov 13, 2024 12:30 PM IST

Diabetes Day 2024: ప్రతి సంవత్సరం నవంబర్ 14 న ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం నిర్వహించుకుంటారు. మధుమేహానికి సంబంధించి కొన్ని అపోహలు ఉన్నాయి. మీకు ఇలాంటి సందేహాలు ఉంటే వెంటనే మార్చుకోండి.

డయాబెటిస్
డయాబెటిస్ (Pexel)

ప్రపంచ మధుమేహ దినోత్సవాన్నిఏటా నవంబర్ 14న నిర్వహించుకుంటాము. మధుమేహంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ దినోత్సవం నిర్వహించుకోవడం వెనుక ముఖ్యోద్దేశం. ఈ వ్యాధి వల్ల ఎంతో మంది జీవితాలు ప్రభావితం అవుతున్నాయి. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల డయాబెటిస్ కారణంగా జరిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు. డయాబెటిస్ గురించి ఎంతో మందిలో కొన్ని సందేహాలు, అపోహలు ఉన్నాయి. అలాంటి అపోహలు నిజమో కాదో తెలుసుకోండి.

అనేక రకాల టేస్టీ చాక్లెట్లు, కుకీలు, బిస్కెట్లు మొదలైనవి మార్కెట్లో లభిస్తూ ఉంటాయి. వాటిని తినే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. కానీ డయాబెటిక్ పేషెంట్లు కూడా ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే వాటిలో కేలరీలు, సంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయి. అలాగే, ఇందులో ఉపయోగించే కృత్రిమ స్వీటెనర్ చెడు ప్రభావాలను చూపిస్తుంది.

పండ్లు తినవచ్చా?

పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదంటారు. అది నిజమే. కానీ కొన్ని రకాల పండ్లు మాత్రం డయాబెటిస్ రోగులకు హానికరం. ఎందుకంటే వాటిలో చక్కెర నిండుగా ఉంటుంది. ఈ పండ్లలో కేకులు, బిస్కెట్లు, స్వీట్ల కంటే సహజమైన చక్కెర ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తక్కువ చక్కెర ఉండే ఆహారాలను తినాలి. ముఖ్యంగా జామ, కివీ, ఆపిల్ వంటివి అధికంగా తింటూ ఉండాలి.

పంచదారతో చక్కెర వస్తుందా?

టైప్ 1 లేదా టైప్ 2 డయాబెటిస్‌ రావడానికి చక్కెర తినడానికి లేదా తినకపోవడానికి ఎటువంటి సంబంధం లేదు. ముఖ్యంగా టైప్ 1 డయాబెటిస్ అనేది పూర్తిగా జన్యుపరమైనది. ఇది వారసత్వంగా వస్తుంది. దీనిలో రోగనిరోధక వ్యవస్థ ప్యాంక్రియాస్ లో తయారైన ఇన్సులిన్ ను తొలగిస్తుంది. అంతే కాదు టైప్ 2 డయాబెటిస్ రావడానికి కూడా పంచదారకు సంబంధం లేదు. పంచదార తినడం వల్లే పూర్తిగా ఈ వ్యాధి రాదు. కానీ ఈ వ్యాధి వచ్చాక పంచదార తినడం వల్ల ఈ రోగం ముదిరిపోతుంది. అధిక చక్కెర ఉన్న ఆహారంలో ఎక్కువ కేలరీలు ఉంటాయి. తీపి పదార్థాలు అధికంగా తింటే ఊబకాయం, అధిక బరువుకు దారితీస్తుంది. ఇలా ఊబకాయం బారిన పడితే మీకు డయాబెటిస్ అవకాశం పెరిగిపోతుంది.

టైప్ 2 డయాబెటిస్ పూర్తిగా తేలికపాటిదని చెప్పలేము. దీని దుష్ప్రభావాలు చాలా ఎక్కువ. కాబట్టి సరైన చికిత్సతో పాటు, మందులు, ఆహార మార్పులు చాలా ముఖ్యమైనవి. లేదంటే కంటిచూపు కోల్పోవడం నుంచి కాళ్లలో గాయాలు, గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదాలు డయాబెటిస్‌తో ముడిపడి ఉంటాయి.

మీకు టైప్ 2 డయాబెటిస్ ఉంటే, ఎక్కువ తీపి ఆహారాలు తింటే చాలా ప్రమాదం. రక్తంలో చక్కెర స్థాయి ఎప్పుడూ సాధారణంగా ఉండదు. కానీ మందులు, జీవనశైలి మార్పులతో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించుకోవచ్చు. ఇలా తగ్గాక కొన్నిసార్లు తక్కువ మొత్తంలో చక్కెర నిండిన ఆహారాన్ని తినవచ్చు. అయితే, రోజూ తినడం హానికరం.

ప్రత్యేక డైట్ లేదు

డయాబెటిక్ పేషెంట్లకు ప్రత్యేక డైట్ లేదు. ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారంలో పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలు, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు, గుడ్లు, చేపలు వంటివి ఆహారంలో ఉండే సరిపోతుంది. చక్కెర నిండి పదార్థాలను తినకుండా ఉంటే చాలు.

పండ్లు, పాల ఉత్పత్తులలో సహజ చక్కెర ఉంటుంది. కాబట్టి వీటిని తినడం ద్వారా చక్కెరను తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇతర తీపి పదార్థాలు తినకుండా కేవలం వీటిని తినడం ద్వారా శరీరానికి సరిపడా చక్కెరను పొందవచ్చు.

Whats_app_banner