సోంపాపిడి స్వీట్ మిగిలిపోతే దానితో ఇలా ఖీర్ చేసేయండి, అద్భుతంగా ఉంటుంది-if you have any leftover sweet anise make kheer with it like this it will be amazing ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  సోంపాపిడి స్వీట్ మిగిలిపోతే దానితో ఇలా ఖీర్ చేసేయండి, అద్భుతంగా ఉంటుంది

సోంపాపిడి స్వీట్ మిగిలిపోతే దానితో ఇలా ఖీర్ చేసేయండి, అద్భుతంగా ఉంటుంది

Haritha Chappa HT Telugu

సోంపాపిడి స్వీట్ రెసిపీకి ఒక్కోసారి ఇంటికి తెచ్చినా కూడా మిగిలిపోతూ ఉంటుంది. ఇది ఎక్కువగా తిన్నా కూడా బోర కొట్టేస్తుంది. మిగిలిపోయిన స్వీట్‌తో ఖీర్ తయారుచేసుకోవచ్చు. సోంపాపిడి ఖీర్ ఎలా చేయాలో తెలుసుకోండి.

సోంపాపిడి ఖీర్ రెసిపీ

తెలుగు వారికి ఇష్టమైన స్వీట్లలో సోంపాపిడి ఒకటి. ఈ స్వీట్ తెచ్చినప్పుడు ఒక్కోసారి మిగిలిపోతుంది. దాన్ని పడేయాల్సిన అవసరం లేదు. దాంతో రుచికరంగా సోంపాపిడి స్వీట్ చేయవచ్చు. దీన్ని చేయడం చాలా సులువు. ఇది రబ్రీ మాదిరిగా ఉండి ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులభం. కాబట్టి ఈ రెసిపీ గురించి తెలుసుకుందాం

సోంపాపిడి ఖీర్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

సోంపాపిడి స్వీట్ - అరకిలో

ఫుల్ క్రీమ్ మిల్క్ - ఒక లీటర్

నెయ్యి - ఒక స్పూన్

యాలకుల పొడి - అర టీస్పూన్

తరిగిన జీడిపప్పు - మూడు స్పూన్లు

తరిగిన బాదం - మూడు స్పూన్లు

తరిగిన పిస్తాపప్పు - మూడు స్పూన్లు

చక్కెర - అర కప్పు

సోంపాపిడి ఖీర్ రెసిపీ

  1. ఒక పాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసి తరిగిన జీడిపప్పు, బాదం, పిస్తా వేసి తక్కువ మంటపై తేలికగా వేయించాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు అదే పాన్ లో లీటర్ పాలు వేయాలి. వాటిని మరిగించాలి.
  3. అవి బాగా మరిగాక అరకిలో సోంపాపిడిని వేసి బాగా కలుపుకోవాలి. గ్యాస్ మంటను మీడియంలో ఉంచాలి.
  4. మిశ్రమం ఉడికిన తర్వాత అందులో అర టీస్పూన్ యాలకుల పొడి కలపాలి.
  5. కాసేపు ఇది ఉడికిన తర్వాత మీ రుచికి తగ్గట్టుగా పంచదార కలపాలి.
  6. సోంపిడి తీపిగా ఉంటే పంచదార తగ్గించుకోవాలి.
  7. కాసేపు మిశ్రమం ఉడికాక పైన డ్రై ఫ్రూట్స్ వేసి తక్కువ మంట మీద ఖీర్ చిక్కగా అయ్యే వరకు ఉడికించాలి.
  8. అంతే టేస్టీ సోంపాపిడి ఖీర్ రెడీ అయినట్టే. ఇది నోట్లో పెడితే కరిగిపోయేలా ఉంటుంది.

సోంపాపిడితో చేసే ఈ పాయసం ఎంతో రుచిగా ఉంటుంది. ఒక్కసారి దీన్ని ప్రయత్నించండి మీకెంతో నచ్చుతుంది. నైవేద్యాల సమయంలో కూడా దీన్ని వాడవచ్చు. ఇంటికి అతిధులు వచ్చినప్పుడు కూడా ఇది చేసి పెట్టండి… వారికి ఇది కచ్చితంగా నచ్చుతుంది.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.